Karnataka: కర్ణాటకలో అరేబియన్ సముద్ర తీరంలో ఉన్న గోకర్ణ, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక వాతావరణం, చిల్ వైబ్స్ కోరుకునే ట్రావెలర్స్‌కి ఓ సూపర్ డెస్టినేషన్‌గా మారింది. ‘మినీ గోవా’ అని పిలిచే ఈ చిన్న సిటీ, బీచ్‌లు, ఆలయాలు, అడ్వెంచర్‌లతో అందరినీ ఆకట్టుకుంటోంది. గోకర్ణలో బీచ్‌లు, టెంపుల్స్, హిస్టారికల్ ఫోర్ట్‌లు, నేచర్ ట్రెక్స్ అన్నీ కలిసి ఒక పర్ఫెక్ట్ హాలిడే స్పాట్‌గా మార్చాయి.
బీచ్‌లు
గోకర్ణ బీచ్‌లు దాని మెయిన్ హైలైట్. ఓం బీచ్, ఓం ఆకారంలో ఉండే ఈ బీచ్ అందమైన వ్యూస్‌తో పాటు వాటర్ స్పోర్ట్స్‌కి ఫేమస్. కుడ్లే బీచ్, పామ్ ట్రీస్, చిన్న చిన్న కేఫ్‌లతో సాయంత్రం స్ట్రోల్‌కి బెస్ట్. ఒంటరిగా సమయం గడపాలనుకునేవాళ్లకి హాఫ్ మూన్ బీచ్, ప్యారడైజ్ బీచ్ లాంటివి ట్రెక్కింగ్ చేస్తూ చేరుకుని, క్లియర్ నీళ్లు, పచ్చని బీచ్‌లు ఎంజాయ్ చేయొచ్చు.
గోకర్ణని ‘దక్షిణ వారణాసి’ అని కూడా అంటారు. ఇక్కడి శ్రీ మహాబలేశ్వర స్వామి టెంపుల్, 4వ శతాబ్దం నాటి శివాలయం, ద్రావిడ ఆర్కిటెక్చర్‌తో సముద్ర తీరంలో అద్భుతంగా కనిపిస్తుంది. ఇది కర్ణాటకలోని ఏడు ముక్తిక్షేత్రాల్లో ఒకటి. శివుడు ఇక్కడ ఆత్మలింగాన్ని సముద్రంలో వదిలాడని లెజెండ్. 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న మురుదేశ్వర టెంపుల్, భారీ శివ విగ్రహం, గోపురంతో సీ బ్యాక్‌డ్రాప్‌లో అదిరిపోతుంది.
హిస్టరీ అండ్ నేచర్
హిస్టరీ లవర్స్‌కి మిర్జన్ ఫోర్ట్ (21 కిమీ దూరం) ఓ మస్ట్ విజిట్. విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాణి చెన్నభైరాదేవి నిర్మించిన ఈ 16వ శతాబ్దపు ఫోర్ట్, స్పైస్ ట్రేడ్, యుద్ధాల గురించి చెబుతుంది. నేచర్ ఎంతో ఇష్టపడేవాళ్లకి హొన్నావర్ మాంగ్రోవ్ వాక్ సూపర్ ఆప్షన్. ఇక్కడి మాంగ్రోవ్ లేక్, బర్డ్ వాచింగ్‌కి ఇటీవల సోషల్ మీడియాలో ఫేమస్ అవుతోంది.
అడ్వెంచర్ అండ్ వెల్‌నెస్
గోకర్ణలో గోకర్ణ బీచ్ ట్రెక్ ఓం, కుడ్లే, హాఫ్ మూన్, ప్యారడైజ్ బీచ్‌లను కనెక్ట్ చేస్తూ సముద్ర వ్యూస్‌తో అడ్వెంచర్ లవర్స్‌కి ఫెవరెట్. ఓం, కుడ్లే బీచ్‌లలో జెట్ స్కీయింగ్, బనానా బోట్ రైడ్స్ లాంటి వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. రిలాక్స్ కావాలనుకునేవాళ్లకి స్వాస్వర లాంటి వెల్‌నెస్ రిట్రీట్స్‌లో యోగా, మెడిటేషన్, ఆయుర్వేద ట్రీట్‌మెంట్స్ ఉన్నాయి. కోస్టల్ కర్ణాటక కిచెన్‌లో దోసె, సీఫుడ్ కర్రీస్ నేర్చుకునే కుకింగ్ క్లాస్‌లు కూడా టూరిస్టులని ఆకర్షిస్తున్నాయి.
ఎందుకు గోకర్ణ?
గోకర్ణ ఆధ్యాత్మిక ట్రిప్, బీచ్ హాలిడే, అడ్వెంచర్ ట్రెక్స్… అన్నిటికీ సరిపోతుంది. డిసెంబర్‌లో 20-30°C టెంపరేచర్‌తో వింటర్ గెట్‌అవేకి పర్ఫెక్ట్ ప్లేస్. కర్ణాటక టూరిజం డిపార్ట్‌మెంట్ సస్టైనబుల్ టూరిజం, అడ్వెంచర్ టూరిజంని ప్రమోట్ చేస్తూ గోకర్ణని గ్లోబల్ డెస్టినేషన్‌గా మార్చుతోంది.
వెళ్లాలి ఎందుకంటే?
గోవాలోని డాబోలిమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (150 కిమీ) లేదా బెంగళూరు, మంగళూరు, ముంబై నుంచి డైరెక్ట్ బస్సుల ద్వారా గోకర్ణ వెళ్లొచ్చు. టౌన్ చిన్నది కాబట్టి నడకనో, స్కూటర్స్ రెంట్ చేసుకునో ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. బీచ్ హట్స్, హోంస్టేలు బడ్జెట్‌కి తగ్గట్టు దొరుకుతాయి.