Hyderabad: దక్షిణాదిలో బుల్లెట్ ట్రైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఎలైన్‌మెంట్‌కు సంబంధించిన ప్రక్రియ క్షేత్రస్థాయిలో మొదలైంది. రంగారెడ్డి నుంచి నల్గొండ జిల్లాల్లో సర్వే బృందాలు మార్కింగ్‌లు చేస్తున్నాయి. ఇదిలా వుండగా దక్షిణాదిలో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుంది.
బుల్లెట్ ట్రైన్ కారిడార్.. శంషాబాద్‌లో మార్కింగ్ పనులు మొదలు
దక్షిణ భారత్‌లో బుల్లెట్ రైలు నెట్‌వర్క్‌లో కీలక పాత్ర పోషించనుంది ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్-చెన్నై హై స్పీడ్ రైల్ కారిడార్‌ను అమరావతి మీదుగా నిర్మించాలన్న ఏపీ ప్రభుత్వ అభ్యర్థనకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సానుకూలంగా స్పందించింది. హై-స్పీడ్ రైల్ కారిడార్ తెలంగాణ-ఆంధ్రప్రదేశ్-తమిళనాడు రాష్ట్రాల మీదుగా 760.09 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుంది.
అందులో చిత్తూరు, తిరుపతిలను కలిపే ప్రత్యేక హై-స్పీడ్ లింక్‌కు ప్రాథమికంగా ఆమోదం లభించినట్టు సమాచారం. హైదరాబాద్-చెన్నై వయా ఏపీ మీదుగా రైలు ప్రయాణ సమయాన్ని 12 గంటల నుండి 2 గంటల 20 నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఏపీలో అత్యధికంగా 518 కిలోమీటర్లు, తెలంగాణలో 180 కిలోమీటర్లు, తమిళనాడులో 61 కిలోమీటర్లు ఉండనుంది.
అత్యధికంగా ఏపీలో 9 స్టేషన్లు.. ఆ తర్వాత తెలంగాణ
ఈ కారిడార్‌లో 18 స్టేషన్లను ప్రతిపాదించారు. అందులో ఏపీలో 9 స్టేషన్లు ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ, చివరలో తమిళనాడు ఉంది. హై-స్పీడ్ రైలు కారిడార్ హైదరాబాద్ లో ప్రారంభమవుతుంది. గచ్చిబౌలి లేదా నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో స్టేషన్ జోన్‌ను ప్రతిపాదించారు. అక్కడి నుండి రైలు.. శంషాబాద్ మీదుగా ఫ్యూచర్ సిటీ, డ్రై పోర్ట్ వంటి స్టేషన్ల గుండా వెళ్లనుంది.
సరిహద్దును దాటడానికి ముందు తెలంగాణలోని చివర రెండు స్టేషన్లు హాలియా-వడపల్లి వద్ద ఉండేలా ప్లాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు మొదలైన తర్వాత దాచేపల్లిలో ప్రారంభమవుతుంది. ఈ మార్గం ద్వారా రాజధాని అమరావతి మీదుగా చీరాల, ఒంగోలు, కావలి, ప్రాంతాల్లో ఆగుతుంది. గూడూరు మీదుగా చివరకు తిరుపతికి చేరుకుంటుంది.
హై-స్పీడ్ రైలు కారిడార్ చివరి తమిళనాడులోని తిరువళ్లూరు మీదుగా మింజూర్, చెన్నై ఔటర్ రింగ్ రోడ్-ORR వద్ద ఆగనుంది. చెన్నై సెంట్రల్ స్టేషన్ వద్ద ఎండింగ్ స్టేషన్ కానుంది. మరోవైపు హైదరాబాద్-చెన్నై-బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్‌ల పనుల్లో మొదలయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌ల ఎలైన్‌మెంట్‌కు సంబంధించి రంగారెడ్డి నుంచి నల్గొండ, వికారాబాద్ జిల్లాల వైపు సర్వే బృందాలు మార్కింగ్‌లు చేయడం మొదలుపెట్టాయి.
ALSO READ: ఏడాదిలో కేవలం 2 నెలలు మాత్రమే కనిపించే అందమైన నగరం.. పర్యాటకుల ఫేవరెట్ స్పాట్
శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, యాచారం మండలాల మీదుగా ఈ సర్వే జరుగుతోంది. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలం వైపు హైదరాబాద్-చెన్నై కారిడార్‌కు శంషాబాద్, షాబాద్ మండలాల మీదుగా పది రోజులుగా సర్వే చేస్తున్నారు. పంట పొలాలు, ఇతర ప్రాంతాల్లో ఎరుపు-తెలుపు రంగులతో ప్రత్యేక గుర్తులు మొదలుపెట్టారు.
యాచారం మండలంలోని మేడిపల్లి, తక్కళ్లపల్లి, చింతపట్ల, మందన, గౌరెల్లి గ్రామాల్లో మార్కింగ్‌లు పూర్తి చేసినట్టు సమాచారం. కారిడార్ ఎలైన్‌మెంట్, సర్వే పాయింట్లు, భూసేకరణ అవసరాలను గుర్తించేందుకు ప్లాన్ చేసినట్టు సమాచారం. హైస్పీడ్ రైలు కారిడార్‌కు సంబంధించి తొలుత ఏరియల్ సర్వే, ఆ తర్వాత క్షేత్రస్థాయిలో రూట్‌ను ఖరారు చేసే పనుల్ని వేగవంతం చేశారు. చివరగా ఎలైన్‌మెంట్, స్టేషన్ల స్థానాలపై క్లారిటీ రానుంది.