E-Paper
Advertisement

వందే భారత్‌లో CC, EC అంటే ఏంటి? ప్రయాణానికి ఏ క్లాస్ బెస్ట్?

వందే భారత్‌లో CC, EC అంటే ఏంటి? ప్రయాణానికి ఏ క్లాస్ బెస్ట్?
Advertisement

Vande Bharat CC and EC: ఇండియన్ రైల్వేలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ కు ఉన్న ప్రత్యేకత గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేగం, సూపర్ డిజైన్, విమానాల్లో మాదిరి సౌకర్యాలతో ఈ రైలు ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అయితే టికెట్ బుక్ చేసుకునే సమయంలో చాలా మంది ప్రయాణికులు చైర్ కార్ (CC), ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC) మధ్య ఏది ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇంతకీ ఈ రెండు క్లాసుల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చైర్ కార్ (CC) అంటే ఏంటి?

చైర్ కార్‌ లో 3+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఒక వైపు మూడు సీట్లు, మరో వైపు రెండు సీట్లు ఉంటాయి. ఈ కోచ్‌ లో ఎక్కువ మంది ప్రయాణికులు కూర్చోవచ్చు. తక్కువ, మిడ్ రేంజ్ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. ఈ క్లాస్‌ లో సీట్లు సౌకర్యవంతంగానే ఉన్నప్పటికీ, ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొంత రద్దీగా అనిపిస్తుంది. బడ్జెట్‌ లో ప్రయాణించాలనుకునే వారికి ఇది సరైన ఎంపిక.

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC) అంటే ఏంటి?

Advertisement

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌ లో 2+2 సీటింగ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే రెండు వైపులా రెండు సీట్లు మాత్రమే ఉంటాయి. దీంతో ప్రయాణికులకు ఎక్కువ స్థలం, మంచి లెగ్‌ రూమ్ ఉంటుంది. ఈ కోచ్‌ లోని సీట్లు రిక్లైన్ అయ్యే విధంగా ఉండటమే కాకుండా కొన్ని రైళ్లలో తిరిగే సౌకర్యం కూడా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే వారు, బిజినెస్ ప్రయాణికులు, ఎక్కువ సౌకర్యం కోరుకునే వారికి EC మంచి ఎంపిక.

టికెట్ ధరల్లో తేడా

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ టికెట్ ధర సాధారణంగా చైర్ కార్ టికెట్ కంటే 50 నుంచి 60 శాతం వరకు ఎక్కువగా ఉంటుంది. అదనపు సౌకర్యాలు, విశాలమైన సీట్లు, ప్రీమియం సేవల కారణంగా ఈ ధర ఎక్కువగా ఉంటుంది.

రెండు క్లాసుల్లో లభించే సౌకర్యాలు

Advertisement

CC, EC రెండింటిలోనూ పూర్తిగా ఎయిర్ కండిషనింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, అత్యాధునిక ఇంటీరియర్, ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్ లాంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అయితే ECలో ప్రయాణికులకు ప్రశాంతమైన వాతావరణం, తక్కువ రద్దీ, కొన్ని స్టేషన్లలో లాంజ్ యాక్సెస్ లాంటి అదనపు ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

భోజనంలోనూ తేడా..

చైర్ కార్ ప్రయాణికులకు సాధారణంగా టీ, కాఫీ, శాకాహారం, మాంసాహార భోజనం అందిస్తారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో మాత్రం మరింత మెరుగైన భోజన సేవలు ఉంటాయి. వెల్ కమ్ డ్రింక్స్, వేడి స్నాక్స్, పండ్లు, కొన్ని మార్గాల్లో స్పెషల్ మల్టీ-కోర్స్ భోజనం కూడా అందిస్తారు.

ఏ క్లాస్ ఎవరికి బెస్ట్?   

తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం చేయాలనుకుంటే చైర్ కార్ (CC)  ఒకే. ఎక్కువ స్థలం, మెరుగైన సీట్లు, ప్రీమియం సేవలు కావాలంటే ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (EC)ను తీసుకోవాల్సి ఉంటుంది.

Read Also: వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!

Related News

రూ.17 వేల నుంచే వైల్డ్‌ లైఫ్ టూర్.. ఈ 3 ప్లేసులు మిస్ అవ్వొద్దు!

వందే భారత్ స్లీపర్ vs రాజధాని.. ఫుడ్ ఏ రైల్లో బాగుంటుంది?

రైలు పట్టాల కింద రాళ్లు లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఊహించడానికే భయంగా ఉంది బాబోయ్!

సైట్ ఓపెన్ చేస్తే సర్వర్ డౌన్.. క్షణాల్లో మాయమవుతున్న రైల్వే టికెట్లు!

రైలు ప్రయాణికులకు అలర్ట్.. టికెట్‌ ఉన్నా జరిమానా తప్పదు.. ఎందుకంటే?

రైల్వే ట్రాక్‌ లపై డ్రోన్లతో నిఘా.. ప్రయాణాలకు ఇబ్బంది లేకుండానే తనిఖీలు!

వెయిటింగ్ లిస్ట్ ఉన్నా టెన్షన్ వద్దు.. చార్ట్ తర్వాత కూడా రైలు టికెట్ ఇలా బుక్ చేసుకోవచ్చు!

పగిలిన అద్దాలు.. కంపుకొట్టే టాయిలెట్లు.. బాబోయ్.. ఇది వందేభారత్ రైలా?

Big Stories

Advertisement
×