E-Paper
Advertisement

ప్రాణాలను కాపాడే హెల్మెట్.. 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మార్చాలా?

ప్రాణాలను కాపాడే హెల్మెట్.. 5 సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా మార్చాలా?
Advertisement

Motorcycle Helmet Lifespan: బైక్ నడిపే ప్రతి ఒక్కరికీ హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే, రైడర్ ప్రాణాలకు అంత సేఫ్టీ ఉంటుంది. అయితే, చాలా మంది హెల్మెట్ బయటకు బాగానే కనిపిస్తే ఇంకా వాడొచ్చని అనుకుంటారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం హెల్మెట్‌ కు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుంది. సాధారణంగా హెల్మెట్‌ ను ఐదు సంవత్సరాల తర్వాత మార్చడం మంచిదంటున్నారు. ఇంతకీ ఈ 5 ఇయర్స్ రూల్ ఏం చెప్తుందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రమాదం నుంచి కాపాటే ఫోమ్ లైనర్ దెబ్బతినే అవకాశం

హెల్మెట్‌ లో EPS ఫోమ్ లైనర్ ఉంటుంది. ఇది ప్రమాద సమయంలో తలకు తగిలే దెబ్బలను తగ్గించి రక్షణ కల్పిస్తుంది. కాలక్రమేణా ఈ ఫోమ్ చెమట, వేడి, తేమ లాంటి కారణాల వల్ల నెమ్మదిగా తన బలం కోల్పోతుంది. బయటకు బాగానే ఉన్నట్లు కనిపించినా, లోపలి రక్షణ సామర్థ్యం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఐదేళ్ల తర్వాత కొత్త హెల్మెట్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

హెల్మెట్ సంస్థలు ఏం చెప్తున్నాయంటే?

Advertisement

హెల్మెట్ తయారీ సంస్థలు కూడా ఇదే సలహా ఇస్తున్నాయి. హెల్మెట్‌ ను కొనుగోలు చేసిన తేదీ నుంచి సుమారు ఐదు సంవత్సరాల వరకు మాత్రమే పూర్తి భద్రత ఉంటుందని చెప్తున్నాయి. హెల్మెట్ ఎక్కువగా ఉపయోగించకపోయినా, దాని లోపలి పదార్థం సహజంగానే పాతబడుతుంది. అందువల్ల కేవలం బయట రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోవడం సరైంది కాదంటున్నాయి.

హెల్మెట్ ను ఎప్పుడు మార్చాలి?

మీ హెల్మెట్‌ను మార్చాల్సిన సమయం వచ్చిందో? లేదో? కొన్ని పద్దతుల ద్వారా తెలుసుకోవచ్చు. హెల్మెట్ పైభాగంలో పగుళ్లు, గీతలు, ఆకారంలో మార్పులు ఉన్నాయా? పరిశీలించాలి. తర్వాత లోపలి ఫోమ్‌ ను చూడాలి. అరిగిపోయినట్లు, వదులుగా కనిపిస్తే వెంటనే కొత్త హెల్మెట్ కొనాలి. అంతేకాదు, హెల్మెట్ ధరించినప్పుడు తలకు బిగుతుగా కాకుండా కదులుతున్నట్లు అనిపించినా వెంటనే మార్చడం మంచిది.

Advertisement

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, హెల్మెట్ ఒకసారి ప్రమాదంలో దెబ్బ తిన్న తర్వాత మళ్లీ ఉపయోగించకూడదు. బయటకు బాగానే కనిపించినా, లోపలి రక్షణ పొర దెబ్బతిని ఉండే అవకాశం ఉంది. అలాంటి హెల్మెట్ మరో ప్రమాదంలో సరైన ప్రొటెక్షన్ ఇవ్వదు. అందుకే, హెల్మెట్ లైఫ్ టైమ్ రైడర్ ఎంత ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే దానిపైనా ఆధారపడి ఉంటుంది. రోజూ ఎక్కువ దూరం ప్రయాణించే వారు రెండు లేదంటే మూడేళ్లకే హెల్మెట్ మార్చడం మంచిది. ఎందుకంటే, ఎక్కువగా ఉపయోగిస్తే లోపలి లైనింగ్ వేగంగా అరిగిపోతుంది. మరోవైపు హెల్మెట్‌ ను ఎక్కువగా ఉపయోగించకపోయినా, ఐదేళ్ల తర్వాత దానిని మార్చడం సురక్షితమైన నిర్ణయం.

కొత్త హెల్మెట్లలో అధునాతన ఫీచర్లు

ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న కొత్త హెల్మెట్లలో మంచి వెంటిలేషన్, తక్కువ బరువు, అధునాతన భద్రతా సాంకేతికతలు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత హెల్మెట్‌ ను ఎక్కువకాలం వాడటానికి బదులుగా, సమయానికి కొత్త హెల్మెట్ తీసుకుంటే సేఫ్ గా ఉండొచ్చు.

Read Also: 2028 నుంచి పెట్రోల్,సీఎన్జీ బైక్స్ బంద్.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

Related News

అల్ట్రావయోలెట్ షాక్‌వేవ్ లాంచ్ 2027 లోనే.. ఎందుకు ఆలస్యమైందంటే?

యమహా నుంచి ప్రీమియం బైక్‌ల జోరు.. భారత్‌లో కొత్త మోడళ్లకు ప్లాన్!

టియాగో To హారియర్.. టాటా ఈవీలన్నింటికీ BaaS ఆప్షన్!

హయబుసా కొత్త వెర్షన్ వచ్చేసింది.. ధర, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

రెనాల్ట్ ట్రైబర్ టర్బో మైలేజ్ రివీల్.. లీటర్ పెట్రోల్ తో ఎంత దూరం ప్రయాణిస్తుందంటే?

30 కిలో మీటర్లకు మించి మైలేజ్.. త్వరలో రాబోతున్న 4 సూపర్ హైబ్రిడ్ SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అక్టోబర్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న 11 క్రేజీ కార్లు ఇవే!

ట్రైబర్‌ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!

Big Stories

Advertisement
×