E-Paper
Advertisement

ఈ సరికొత్త Xiaomi TV అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చూసాక.. సాధారణ LED TV కొనాలనిపించదు.. ఎందుకంటే?

ఈ సరికొత్త Xiaomi TV అడ్వాన్స్‌డ్ ఫీచర్లు చూసాక.. సాధారణ LED TV కొనాలనిపించదు.. ఎందుకంటే?
Advertisement

Xiaomi Mini LED TV: ప్రస్తుతం టీవీ మార్కెట్ రెండు రకాలుగా విడిపోయింది. తక్కువ ధరలో దొరికే సాధారణ ఎల్‌ఈడీ టీవీలు ఒకవైపు అయితే, అద్భుతమైన పిక్చర్ క్వాలిటీ ఇచ్చే ఖరీదైన ఓఎల్‌ఈడీ (OLED) టీవీలు మరోవైపు ఉన్నాయి. ఈ రెండింటికీ మధ్యస్తంగా ఇప్పుడు ‘క్యూడీ మినీ ఎల్‌ఈడీ’ (QD Mini LED) టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. షావోమి సంస్థ కేవలం రూ.51,999 ప్రారంభ ధరతో ఈ సరికొత్త టెక్నాలజీని సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చింది. మరి ఈ టీవీ పనితీరు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందామా..

స్క్రీన్ డిస్‌ప్లే క్వాలిటీ అదిరింది:

సాధారణ ఎల్‌ఈడీ టీవీలతో పోలిస్తే.. ఈ మినీ ఎల్‌ఈడీ టీవీల్లో వేల సంఖ్యలో చిన్న చిన్న లైట్లు ఉంటాయి. ఇవి స్క్రీన్‌పై ఉన్న చీకటి భాగాలను మరింత నల్లగా, వెలుతురు ఉన్న భాగాలను మరింత బ్రైట్‌గా చూపిస్తాయి. దీనివల్ల మనం చూసే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చాలా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. దీనికి తోడుగా ఉన్న క్వాంటం డాట్ (QD) టెక్నాలజీ రంగులను మరింత అందంగా స్క్రీన్‌పై పలికిస్తుంది. రూంలో ఉన్న వెలుతురును బట్టి టీవీ బ్రైట్‌నెస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసే సెన్సార్ కూడా ఇందులో ఉంది.

మెప్పించే ఆడియో, కనెక్టివిటీ:

Advertisement

సాధారణంగా చాలా టీవీల్లో సౌండ్ క్వాలిటీ అంతగా బాగోదు. కానీ షావోమి ఈ విషయంలో చాలా మంచి పనితీరు కనబరిచింది. దీనిలోని స్పీకర్లు ఇచ్చే బేస్, డైలాగ్ క్లారిటీ సినిమా థియేటర్ అనుభూతిని ఇస్తాయి. విడిగా హోమ్ థియేటర్ లేదా సౌండ్‌బార్ కొనాల్సిన అవసరం లేనంతగా దీని ఆడియో బాగుంది. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే.. ఇందులో హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌తో పాటు యాపిల్ ఎయిర్‌ప్లే, గూగుల్ కాస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనివల్ల మన మొబైల్స్ లేదా లాప్‌టాప్‌లను సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.

Also Read: LG నుంచి IFB వరకు.. రూ.8,000 లోపే సామాన్యులు సైతం కొనదగ్గ బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు ఇవే!

ఇక్కడే కొంచెం తగ్గారు:

Advertisement

ఈ టీవీలో 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందని కంపెనీ చెబుతున్నప్పటికీ, ఇది నిజమైన 120Hz ప్యానల్ కాదు. డియుయల్ లైన్ గేట్ (DLG) అనే టెక్నాలజీ సాయంతో సాఫ్ట్‌వేర్ పరంగా రిఫ్రెష్ రేట్‌ను పెంచారు. దీనివల్ల నార్మల్ టీవీల కంటే విజువల్స్ స్మూత్‌గా ఉన్నప్పటికీ, గేమింగ్ ప్రియులకు ఆశించినంత వేగం కనిపించకపోవచ్చు. అలాగే ఈ టీవీ గూగుల్ టీవీ, ప్యాచ్‌వాల్ సాఫ్ట్‌వేర్‌లపై నడుస్తుంది. టీవీ ఆన్ చేసిన మొదటి రెండు నిమిషాలు ఇంటర్‌ఫేస్ కొంచెం లాగ్ అయినట్లు, స్లోగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఈ టీవీని కొనుగోలు చేయొచ్చా?

ధరను బట్టి చూస్తే షావోమి టీవీ ఎస్ మినీ ఎల్‌ఈడీ చాలా విషయాల్లో అంచనాలను అందుకుంది. సాఫ్ట్‌వేర్ పెర్ఫార్మెన్స్ కొద్దిగా స్లోగా ఉన్న మాట నిజమే అయినా.. డిస్‌ప్లే క్వాలిటీ, ఆడియో పరంగా ఇది ఓఎల్‌ఈడీ టీవీలకు గట్టి పోటీ ఇస్తుంది. ఎక్కువ బడ్జెట్ పెట్టకుండా, ప్రీమియం హోమ్ థియేటర్ అనుభవాన్ని పొందాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×