E-Paper
Advertisement

Private Railway Station: దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!

Private Railway Station:  దేశంలోనే తొలి ప్రైవేట్ రైల్వే స్టేషన్.. దీని ముందు ఎయిర్ పోర్ట్ దిగదుడుపే!
Advertisement

Indian Railways: భారతీయ రైల్వే ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా కొనసాగుతోంది. మొత్తం 20 వేలకు పైగా రైళ్లు, సుమారు లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా 7400 పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. అయితే, తేజస్ లాంటి కొన్ని రైళ్లు ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. ప్రస్తుతం కొన్ని రైల్వే స్టేషన్ల నిర్వహణ బాధ్యతలు కూడా ప్రైవేట్ సంస్థలు తీసుకున్నాయి. అలాంటి వాటిలో ఒకటి భోపాల్‌లోని రాణి కమలపతి స్టేషన్. రీసెంట్ గానే ఈ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం పూర్తయ్యింది. గతంలో హబీబ్‌ గంజ్ స్టేషన్‌ అని పిలువగా, కొద్ది కాలం క్రితమే దీని పేరు మార్చారు. దేశంలో తొలిసారి ప్రైవేట్ నిర్వహణలో కొనసాగుతున్న రైల్వే స్టేషన్ గా ఇది గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, ఈ రైల్వే స్టేషన్ ప్రయాణీకులకు ఎయిర్ పోర్టు మాదిరి సర్వీసులను అందిస్తోంది.

ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్న రైల్వేస్టేషన్!

భోపాల్‌ లో ఉన్న రాణి కమలపతి స్టేషన్ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కింద నిర్వహించబడుతుంది. ఇండియన్ రైల్వే యాజమాన్యంలో ఉన్నా, ప్రైవేట్ సంస్థ సాధారణ కార్యకలాపాలు,  నిర్వహణకు బాధ్యతలు చేపడుతుంది. ఇండియన్ రైల్వేస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ తో కలిసి బన్సాల్ గ్రూప్ ఈ స్టేషన్ బాధ్యతలను నిర్వహిస్తుంది.

మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు

Advertisement

ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్ లో సౌకర్యాలు ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి. క్లైమేట్ కంట్రోల్ మెయిన్ హాల్, రాపిడ్ ఎలివేటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా, డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రయాణీకులకు  షెల్టర్డ్ పార్కింగ్, రిటైల్ సంస్థలు, ఫుడ్ అవుట్ లెట్లు, మీటింగ్ హాల్స్, బిజినెస్ ఫెసిలిటీస్, ప్రయాణీకులకు వసతిని అందించే స్టేషన్ హోటల్ ఆకట్టుకుంటున్నాయి. అద్భుతమైన యాక్సెసిబిలిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్,శుభ్రమైన ప్లాట్‌ఫారమ్‌లు ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి.

సాంప్రదాయ రైల్వే స్టేషన్లకు భిన్నంగా..   

ఇక రాణి కమలపతి స్టేషన్ డిజైన్ సాధారణ రైల్వే స్టేషన్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఆటోమొబైల్స్ కోసం షోరూమ్‌ లను కలిగి ఉంది. ఈ అదనపు సౌకర్యాలు దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను హైలెట్ చేస్తున్నాయి.  రాణి కమలపతి స్టేషన్ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్, రాజధాని ఎక్స్‌ ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, దురంతో ఎక్స్‌ ప్రెస్ లాంటి ఫ్లాగ్‌ షిప్ రైళ్లకు ఆపరేటింగ్ పాయింట్ గా కొనసాగుతోంది.  విస్తృత రైల్వే నెట్‌వర్క్‌ తో పాటు స్టేషన్ లోని సర్వీసులు ప్రయాణీకులను ఆకట్టుకుంటున్నాయి.న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై CST లాంటి మేటి రైల్వే స్టేషన్లను తలదన్నేలా ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించడం విశేషం. అక్కడి కంటే ఈ రైల్వే స్టేషన్ లోనే సర్వీసులు ప్రయాణీకులను అలరిస్తున్నాయి.

Advertisement

Read Also: రైలు కిందకి దూరి పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు.. వెంటనే అతడు ఏం చేశాడంటే?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×