Indian Railway Ticket Rules: భారతీయ రైల్వే దేశంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థలలో ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకరంగా ప్రయాణం చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఎక్కువ మంది రైల్లో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. చాలా వరకు ప్రయాణీకులు ముందుగానే రిజర్వేషన్ చేసుకుంటారు. జనరల్ బోగీల్లో ఇబ్బంది పడే కంటే, రిజర్వేషన్ కోచ్ లలో హ్యాపీగా వెళ్లాలి అనుకుంటారు. అందుకే ఫ్యామిలీతో కలిసి జర్నీ చేసే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ రైల్వే టికెట్లను కొనుగోలు చేస్తారు.
చిన్న పిల్లలు ఏ వయసు వరకు ఫ్రీగా వెళ్లొచ్చు?
రైల్వే ప్రయాణీకులకు సంబంధించి రైల్వే సంస్థ పలు నియామాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా టికెట బుకింగ్ కు సంబంధించి ప్రయాణీకులకు అనుగుణంగా రూల్స్ ను ఎప్పటికప్పుడు మార్చుతుంది. పిల్లలకు సంబంధించి కూడా పలు నిబంధనలు అందుబాటులోకి తెచ్చింది. చిన్న పిల్లలు ఉచితంగానే ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. అంటే, చిన్న పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంత మంది పిల్లలకు హాఫ్ టికెట్ తీసుకోవాలి. రైల్లో ప్రయాణించే పిల్లలు ఎంత వయసు వరకు టికెట్ అవసరం లేకుండా ప్రయాణించవచ్చు? ఏ వయసు నుంచి సగం టికెట్ తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
4 ఏండ్ల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు!
రైల్వే టికెట్లకు సంబంధించిన రైల్వే కచ్చితమైన నియమాలను ఫ్రేమ్ చేసింది. రైల్వే నిబంధనల ప్రకారం 4 ఏండ్ల లోపు పిల్లలకు టికెట్ అవసరం లేదు. తల్లిదండ్రులతో పాటు లేదంటే బంధువులతో వెళ్లే పిల్లలకు టికెట్ తీసుకోవాల్సిన అసవరం లేదు. పిల్లలు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ఇక 5 ఏండ్ల నుంచి 12 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలకు సగం టికెట్ తీసుకోవాలి. అంటే టికెట్ ధరలో సగానికి కాస్త ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, హాఫ్ టికెట్ తీసుకున్నప్పటికీ ప్రత్యేకంగా సీటు ఇవ్వరు. ఒకవేళ మీ పాప లేదంటే బాబుకు ప్రత్యేక సీటు కావాలంటే పూర్తి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది
టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఏమవుతుందంటే?
భారతీయ రైల్వే ప్రకారం టికెట్ లేని రైలు ప్రయాణాన్ని నేరంగా పరిగణిస్తారు. అలా ప్రయాణం చేసే వారిపై కఠిన చర్యల తీసుకునేలా నిబంధనలు పెట్టారు. టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణీకుడిని టీటీఈ గుర్తిస్తే అతడికి జరిమాన విధిస్తారు. కొన్నిసార్లు జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక జరిమానా ఎలా విధిస్తారంటే? టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడని తెలియగానే రూ. 250 ఫైన్ విధిస్తారు. అతడు రైలు ఎక్కిన స్టేషన్ నుంచి దిగాల్సిన స్టేషన్ వరకు టికెట్ ఛార్జీ కూడా వసూళు చేస్తారు. కొన్నిసార్లు సదరు ప్రయాణీకులకు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
Read Also: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్, అందులో ఓ రహస్య ఫ్లాట్ ఫారమ్, ఇంతకీ దాని కథేంటో తెలుసా?