ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు కలిగిన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్. అద్భుతమైన నిర్మాణ శైలి, గొప్ప చరిత్రకు నిలువెత్తు నిదర్శనం ఆ స్టేషన్. మొత్తం 44 ప్లాట్ ఫారమ్ లు ఉంటాయి. ఓ రహస్య ప్లాట్ ఫారమ్ కూడా ఉంటుంది. ఇంతకీ ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉందంటే..
ప్రపంచంలో అతిపెద్ద రైల్వే స్టేషన్
అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇది న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతానికి సంబంధించిన సౌత్ పార్ట్స్ కు సేవలను అందిస్తుంది. ఈ స్టేషన్ నిర్మాణం 1903లో మొదలై 1913 మధ్య జరిగింది. ఫిబ్రవరి 2, 1913న దీనిని ప్రారంభించారు. తొలి రోజునే ఈ రైల్వే స్టేషన్ ను ఏకంగా 1,50,000 కంటే ఎక్కువ మంది స్టేషన్ ను సందర్శించారు.
48 ఎకరాలు.. 44 ప్లాట్ ఫారమ్ లు
గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ ను మొత్తం 48 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. మొత్తం 44 ప్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. దాని ప్లాట్ ఫారమ్‌లన్నీ అండర్ గ్రౌండ్ లోనే ఉన్నాయి. టెర్మినల్ ఎగువన 30 ట్రాక్ లు ఉండగా, దిగువ 26 ట్రాక్ లను కలిగి ఉంది. సైడింగ్ లు, రైలు యార్డ్ తో సహా మొత్తం 67 ట్రాక్ లు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం గొప్ప రాజభవనంలా కనిపిస్తుంది. దాని అందాన్ని చూసేందుకు చాలా మంది ఈ రైల్వే స్టేషన్ కు వెళ్తుంటారు.
Read Also:రైలు ఒక నిమిషం ఆగితే రైల్వేకు ఇంత నష్టమా? మీరు అస్సలు ఊహించి ఉండరు!
నేషనల్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ గా గుర్తింపు
ఇక ఈ టెర్మినల్ ను నేషనల్ హిస్టారికల్ ల్యాండ్ మార్క్ గా గుర్తించింది అమెరికా ప్రభుత్వం. అంతేకాదు, అమెరికాలో అత్యధికంగా సందర్శించే పర్యాటక ఆకర్షణల్లో ఒకటిగా కొనసాగుతోంది. గ్రాండ్ సెంట్రల్ లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి, మెయిన్ కాన్ కోర్స్ లోని నాలుగు ముఖాల ఒపల్ గడియారం. ఇది చూడ్డానికి అద్భుతంగా ఆకట్టుకుంటుంది. గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ లో కిరాణా మార్కెట్ తో సహా వివిధ రకాల దుకాణాలు, ఫుడ్ కోర్టులు ఉన్నాయి. ఈ భవనంలో ఈవెంట్ హాల్, లైబ్రరీ, టెన్నిస్ క్లబ్ కూడా ఉన్నది. ప్రతిరోజూ 1,25,000 మందికి పైగా ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగిస్తారు.
Read Also: దేశంలో అత్యంత నెమ్మదిగా వెళ్లే రైలు.. గంటకు దీని వేగం ఎంతో తెలుసా?
రహస్య ప్లాట్ ఫారమ్
ఇక గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ లో వాల్డోర్ఫ్ ఆస్టోరియా హోటల్ కింద ఒక సీక్రెట్ ప్లాట్ ఫారమ్ ఉంది. ట్రాక్ 61గా పిలువబడే ఈ రహస్య ఫ్లాట్ ఫారమ్ ను 1944లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్ వెల్ట్ ఉపయోగించారు. దీనిలోకి సాధారణ ప్రయాణీకులు యాక్సెస్ ఉండదు.
Read Also:ప్రపంచంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు.. ఇందులో మన స్టేషన్లు కూడా ఉన్నాయండోయ్!