E-Paper
Advertisement

Vande Bharat Sleeper Trains: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!

Vande Bharat Sleeper Trains:  ప్రయాణీకులకు గుడ్ న్యూస్, వందేభారత్ స్లీపర్ లో ఇక ఎమర్జెన్సీ కోటా టికెట్లు!
Advertisement

Vande Bharat Sleeper Trains Emergency Quota: వందేభారత్ స్లీపర్ రైళ్లలో ఎలాంటి వీఐపీ కల్చర్ ఉండదని ఇప్పటికే ఇండియన్ రైల్వే ప్రకటించింది. కానీ, తాజాగా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అన్ని అమృత్ భారత్ రైళ్లకు అత్యవసర కోటా (VIP కోటా) టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. తక్కువ ఆదాయ ప్రయాణీకుల కోసం రైళ్లలో జనరల్,  స్లీపర్ కోచ్‌లను ప్రవేశపెట్టారు. అమృత్ భారత్-2 ప్రారంభంతో,  కేంద్ర ప్రభుత్వం ప్రారంభంలో మహిళలు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, డ్యూటీ పాస్ హోల్డర్లకు మాత్రమే కోటాలను అందించింది.

అమృత్ భారత్ రైళ్లలో 24 ఎమర్జెన్సీ కోటా టికెట్లు

అత్యవసర కోటా కింద, ఏడు లేదా అంతకంటే ఎక్కువ స్లీపర్ కోచ్‌లతో నడిచే అమృత్ భారత్ రైళ్లలో 24 సీట్లను కేటాయించనున్నారు. ఏడు స్లీపర్ కోచ్‌ లతో ధన్‌ బాద్ మీదుగా నడిచే హౌరా-ఆనంద్ విహార్ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ ప్రయాణికులు కూడా ఈ సౌకర్యం నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

ఎమర్జెన్సీ కోటా టికెట్లకు సంబంధించి కీలక వివరాలు

Advertisement

⦿ వందే భారత్ స్లీపర్‌ రైళ్లలోనూ అత్యవసర కోటా టికెట్లను పరిచయం చేయాలని ఇండియన్ రైల్వే భావిస్తోంది. వీకెండ్స్ లో ఈ కోటా టికెట్లను పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

⦿ వందే భారత్ స్లీపర్ రైళ్లలో, కోచ్ కేటగిరీల ఆధారంగా అత్యవసర కోటా టికెట్లను అందించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

Advertisement

⦿ ఈ కోటా కింద విడుదల చేసే టికెట్ల సంఖ్య సాధారణ రోజులతో పోల్చితే, వీకెండ్స్ లో పెరగనున్నాయి.

⦿ ఫస్ట్ AC: సాధారణ రోజులలో 4 సీట్లు, వారాంతాల్లో 6 సీట్లు అందుబాటులో ఉంటాయి.

⦿ సెకండ్ AC: సాధారణ రోజులలో 20 సీట్లు, వారాంతాల్లో 30 టికెట్లు అందుబాటులో ఉంటాయి.

⦿ థర్డ్ AC: సాధారణ రోజులలో 24 సీట్లు, వారాంతాల్లో 42 సీట్లు అందుబాటులో ఉంటాయి.

ఈ కోటాలను ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో లేదంటే, బుకింగ్ ముగిసే తేదీకి ముందు, ఏది ముందు అయితే అది రిజర్వ్ చేసుకోవచ్చు.

డిమాండ్ ఆధారంగా కోటా సర్దుబాటు చేసుకోవచ్చు!

జోనల్ రైల్వేలు కూడా అత్యవసర కోటాను సమీక్షించడానికి అవకాశం ఉంటుందని భారతీయ రైల్వే తెలిపింది.  ఇతర మెయిల్, ఎక్స్‌ ప్రెస్ రైళ్ల మాదిరిగానే, జోనల్ రైల్వేలు డిమాండ్ శాంపిల్స్, సీట్ల లభ్యత ఆధారంగా ఈ రైళ్లలో స్థిర అత్యవసర కోటాను కాలానుగుణంగా సమీక్షించవచ్చని, అందుకు అనుగుణంగా అవసరమైన సర్దుబాట్లు చేయవచ్చని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×