Indian Railways General Coaches: తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చాలా మంది రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సుదూర ప్రాంతాలకు వెళ్లే వాళ్లు ట్రైన్ లో జర్నీ చేసేందుకు మొగ్గు చూపుతారు. కానీ, సీట్ల కొరత, రిజర్వేష్ కు పెద్ద సంఖ్యలో వెయిటింగ్ ఉండటంతో చాలా మంది రైలు ప్రయాణం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఇకపై ప్రయాణీకులకు పెద్ద సంఖ్యలో సీట్లు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. జనరల్ కోచ్ ల సంఖ్య భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది.
నవంబర్ చివరి నాటికి 1000 జనరల్ కోచ్ లు
దేశ వ్యాప్తంగా 370 రైళ్లకు వెయ్యి అదనపు జనరల్ సెకెండ్ క్లాస్ కోచ్ లను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. నవంబర్ చివరి నాటికి అదనపు జనరల్ కోచ్ లను యాడ్ చేస్తామని రైల్వే సంస్థ వెల్లడించింది. మూడు నెలల్లో 600 జనరల్ కోచ్ లను రైళ్లు యాడ్ చేసినట్లు చెప్పింది. దీని ద్వారా రోజూ లక్ష మంది ప్రయాణీకులు జనరల్ కోచ్ లో ప్రయాణించే అవకాశం కలిగిందన్నారు. వచ్చే 2 సంవత్సరాలలో నాన్ ఏసీ కేటగిరీకి చెందిన 10 వేలకు పైగా అదనపు జనరల్ కోచ్ లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు రైల్వే సంస్థ తెలిపింది. సాధారణ ప్రయాణీకులకు మెరుగైన సేవలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది.
రైలు ప్రయాణానికి సంబంధించి సామాన్య ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే రైల్వే సంస్థ వారి కోసం మరిన్ని సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నది. గత మూడు నెలల్లో పలు రైళ్లలో జనరల్ కేటగిరీకి చెందిన 600 అదనపు కోచ్ లను యాడ్ చేసింది. ఈ కోచ్ లన్నీ సాధారణ రైళ్లకు యాడ్ చేయడంతో ప్రయాణీకులకు అదనపు సీట్లు అందుబాటులోకి వచ్చాయి. సీట్ల కొరత అనేది తగ్గింది. ఈ నెల చివరి నాటికి సుమారు 370 రైళ్లకు 1000కి పైగా జనరల్ కోచ్ లను జోడించనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.
వచ్చే 2 ఏండ్లలో 10 వేల జనరల్ కోచ్ లు ఏర్పాట్లు
సరికొత్త జనరల్ కోచ్ లు అందుబాటులోకి వస్తే రోజుకు అదనంగా లక్ష మంది సామాన్య ప్రయాణీకులు ట్రైన్ జర్నీ చేసే అవకాశం ఉంటుంది. వచ్చే రెండు సంవత్సరాలలో రైల్వే సంస్థ పెద్ద సంఖ్యలో నాన్ ఏసీ కోచ్ లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నది. సాధారణ ప్రయాణీకులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే శాఖ భావిస్తుందని రైల్వే బోర్డు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ వెల్లడించారు. రైలు ప్రయాణం చేసే వారికి ఎక్కువ మంది సామాన్య ప్రయాణీకులే ఉన్నారని, వారికి అదనపు సౌకర్యాలు కల్పించే విషయంపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు. వచ్చే రెండు సవత్సరాల్లో 10 వేలకు పైగా నాన్ ఏసీ జనరల్ బోగీలను రైళ్లలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. వాటిలో 6 వేల జనరల్ కోచ్ లు కాగా, మిగతావి స్లీపర్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దిలీప్ తెలిపారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రోజూ 8 లక్షల మంది ప్రయాణీకులు జనరల్ క్లాస్ లో ప్రయాణించే అవకాశం ఉంటుందన్నారు.
Read Also: ట్రైన్ జర్నీ చేస్తూనే నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?