BigTV English

OTT Movie : కోరికలు తీర్చుకోవడానికి అబ్బాయితో అలాంటి పని చేసే అమ్మాయి

OTT Movie : కోరికలు తీర్చుకోవడానికి అబ్బాయితో అలాంటి పని చేసే అమ్మాయి

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో రొమాంటిక్ మూవీస్ కు ఉన్న క్రేజ్ ఒక రేంజ్ లో ఉంటుంది. అందులోనూ మలయాళం రొమాంటిక్ మూవీస్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో కుర్రకారును రెచ్చగొట్టిన ఒక మూవీ ప్రస్తుతం ఓటిటి లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


హెచ్ ఆర్. ఓటిటి

ఇప్పుడు మనం చెప్పుకోబోయే మలయాళం మూవీ పేరు “నీరజ” (Neeraja). ఒక ప్రమాదంలో భర్తను కోల్పోయిన భార్య తన కోరికలను తీర్చుకొనే ప్రయత్నం లో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం ఓటిటి ఫ్లాట్ ఫామ్ హెచ్ ఆర్. ఓటిటి (HR.OTT) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

నీరజ ఒక సాఫ్ట్ వేర్  కంపెనీలో పనిచేస్తూ ఉంటుంది.  ఒక కారు ప్రమాదంలో నీరజ తన భర్తని కోల్పోతుంది. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తారు. అయితే నీరజ కు భర్త ఎప్పుడూ గుర్తుకు వస్తుండటంతో పెళ్లికి అంగీకరించదు. నీరజ వయసులో ఉండటంతో కోరికలను అదుపులో ఉంచుకోవడం కష్టంగా మారుతుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో కోరికలను తీర్చే వస్తువులను ఆర్డర్ చేసుకుంటుంది. ఆమెకు కోరికలు ఎక్కువైనప్పుడు వాటితో సంతృప్తి పడుతూ ఉంటుంది. ఒకసారి డేటింగ్ యాప్ లో ఒక వ్యక్తిని పరిచయం చేసుకుని, అతనిని ఇంటికి ఆహ్వానిస్తుంది. కేవలం కోరిక తీర్చడానికి మాత్రమే మన మధ్య సంబంధం ఉంటుందని చెప్తుంది. అయితే ఆమె మనసులో ఇంకా తన భర్త ఉన్నాడని తెలుసుకున్న అతను, ఈ పని నేను చేయలేనని వెళ్లిపోతాడు. నీరజ డిసప్పాయింట్ అవుతుంది. ఈ క్రమంలో ఒకరోజు పార్కులో సురేష్ అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో తన ఫీలింగ్స్ పంచుకోవాలనుకుంటుంది.ఇది ఇలా ఉంటే సురేష్ భార్య పల్లెటూరు నుంచి రావడంతో ఆమెను అతడు అంతగా ఇష్టపడడు.

ఆమె మాత్రం భర్త ప్రేమగా ఎప్పుడు మాట్లాడతాడా అని ఎదురుచూస్తుంది. ఒకరోజు సురేష్ తో నా కోరికలను నువ్వు తీర్చగలవా అని మెసేజ్ చేస్తుంది నీరజ. దీనికి అతడు ఆమెను తప్పుగా అర్థం చేసుకుని, ఆమె క్యారెక్టర్ పై అనుమానం పెంచుకుంటాడు. ఒకసారి నీరజ తను ఎందుకు సురేష్ తో అలా మెసేజ్ చేసిందో అతనికి అర్థం అయ్యేలా వివరిస్తుంది. చివరికి నీరజ ప్రపోజల్ సురేష్ యాక్సెప్ట్ చేస్తాడా? సురేష్ తన భార్యకు నిజమైన ప్రేమను పంచుతాడా? నీరజ మళ్లీ పెళ్లి చేసుకుంటుందా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే హెచ్ ఆర్. ఓటిటి (HR.OTT) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “నీరజ” (Neeraja) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి. ఈ రొమాంటిక్ మూవీని ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి. రొమాంటిక్ మూవీ లవర్స్ కు కావాల్సిన మసాలా ఇందులో ఉంటుంది. ఆలశ్యం చేయకుండా ఈ మూవీపై ఓ లుక్ వేయండి.

 

Related News

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

OTT Movie : మనిషి మాంసాన్ని ఎగబడి తినే గ్రామం… ఈ భార్యాభర్తల యాపారం తెలిస్తే గుండె గుభేల్

Big Stories

×