Indian Railways Useful Numbers: రైలు ప్రయాణం చేసే వాళ్లు భారతీయ రైల్వే సంస్థ అందిస్తున్న పలు రకాల సేవలను ఉపయోగించుకుని తమ జర్నీని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు. అలాంటి కొన్ని టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. సాధారణంగా రైలు ప్రయాణం చేసేవాళ్లు మూడు నెంబర్లను కచ్చితంగా తమ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి. ఇంతకీ ఆ నెంబర్లు ఏంటి? వాటితో కలిగే లాభం ఏంటి? అనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే ప్రయాణీకులకు ఉపయోగపడే ముఖ్యమైన 3 నెంబర్లు
⦿ 8750001323
రైల్వే ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడే నెంబర్ ఇది. ఈ నెంబర్ సాయంతో రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో మన సీట్లో కూర్చొని నచ్చిన రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆ ఫుడ్ డైరెక్ట్ గా మన సీటు దగ్గరికే వస్తుంది. ఈ నెంబర్ IRCTC ఈ క్యాటరింగ్ వాళ్లది. ఈ నెంబర్ ను సేవ్ చేసుకుని వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టాలి. మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ను క్లిక్ చేయగానే వేరొక వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ PNR నంబర్ ను అడుగుతుంది. ఎంటర్ చేయాలి. వెంటనే.. తర్వాతి స్టేషన్ సమీపంలోని బెస్ట్ రెస్టారెంట్ల వివరాలు చూపిస్తుంది. మీకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. నెక్ట్స్ స్టేషన్ లో రైలు ఆగగానే ఆ ఫుడ్ నేరుగా మీ సీటు దగ్గరికే వచ్చేస్తుంది. హాయిగా తింటూ జర్నీ కంటిన్యూ చెయ్యొచ్చు!
⦿ 9881193322
రైలు టికెట్ స్టేటస్ గురించి ఈ నెంబర్ కంప్లీట్ వివరాలను అందిస్తుంది. ఈ నెంబర్ ను మీ మోబైల్ లో సేవ్ చేసుకుని..వాట్సాప్ లో మీ PNR నెంబర్ ను పంపించండి. మీ టికెట్ స్టేటస్ ను చూపిస్తుంది. ఒకవేళ మీరు వెయిటింగ్ లిస్టు టికెట్ ను బుక్ చేసుకుంటే.. ప్రస్తుతం వెయిటింగ్ లిస్టు నెంబర్ ఎంత? అనేది చెప్తుంది. ఒకవేళ RAC టికెట్ ను బుక్ చేసుకుంటే? ప్రస్తుతం దాని స్టేటస్ ఏంటి? అనేది చూపిస్తుంది. ఒకవేళ మీ టికెట్ కన్ఫార్మ్ అయితే, సీట్ నెంబర్ ఎంత? ఏ కోచ్? లాంటి పూర్తి వివరాలను సింపుల్ గా మన ఫోన్ లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
Read Also:రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ రూల్స్ కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
⦿ 139
రైల్వే ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికీ తెలియాల్సిన ముఖ్యమైన నెంబర్ 139. ఇది రైల్వే మదత్ నెంబర్. మెడికల్ ఎమర్జెన్సీ, సెక్యూరిటీ సమస్యలు, లేదంటే మీ బెర్త్, కోచ్ లో పరిశుభ్రంగా లేకపోయినా వెంటనే ఈ నెంబర్ కు కాల్ చేయాలి. విషయం చెప్పాలి. వెంటనే సంబంధింత సిబ్బంది వచ్చి మీ సమస్యను సాల్వ్ చేస్తారు. మీరు హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది.
Read Also: రైల్లో వాటర్ బాటిల్ అలా అమ్ముతున్నారా? వెంటనే ఇలా కంప్లైట్ చేయండి!