OTT Movie : ఎంటర్టైన్మెంట్ అంటే మొదటగా గుర్తుకు వచ్చేది సినిమాలు. ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో కొత్త సినిమాలతో పాటు పాతవి కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. తెలుగులో వచ్చిన అడవి రాముడు ఎంతలా బాక్సాఫీస్ ను షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. అటువంటి అడవి మనిషి కాన్సెప్ట్ తో 1962లో ఒక హాలీవుడ్ మూవీ థియేటర్లలో హల్చల్ చేసింది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు “ఈఘ” (Eegah). ఒక అడవి మనిషికి అందమైన అమ్మాయి దొరికితే ఎలా ఉంటుందో ఈ మూవీ స్టోరీ లో తెలుసుకుందాం. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
సారా అనే అమ్మాయి ఒక పార్టీకి వెళ్తూ ఉంటుంది. దారి మధ్యలో కారు ట్రబుల్ ఇవ్వడంతో కాసేపు అక్కడే ఆగి పోతుంది. ఆ ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో కాస్త భయపడుతుంది. ఇంతలో అక్కడికి ఏడు అడుగులు ఉన్న అడవి మనిషి సారా దగ్గరకు వస్తాడు. ఆమెను విచిత్రంగా చూస్తూ కట్టితో కొట్టబోతాడు. ఇంతలో సారాని వెనకనుంచి ఫాలో అవుతున్న బాయ్ ఫ్రెండ్ ను చూసి అడవి మనిషి పారిపోతాడు. ఇంటికి వచ్చినాక సారా ఈ విషయం తండ్రికి చెప్తుంది. తండ్రి అతన్ని పట్టుకొని ప్రపంచానికి పరిచయం చేద్దామనుకుంటాడు. ఈ క్రమంలోనే అతడు ఉన్న ప్రాంతానికి వీళ్లు మళ్లీ వెళ్తారు. ఆ అడవి మనిషి అడుగులను గుర్తిస్తూ గుహలో దాక్కున్నాడని కనుక్కుంటారు. ఈలోగా సారా తండ్రిని అడవి మనిషి ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మళ్లీ వచ్చి సారాని కూడా ఎత్తుకొని పోతాడు. గుహలో వీళ్ళిద్దరిని ఉంచి వాళ్లకు తినడానికి ఆహారం ఇస్తాడు. అడవి మనిషి వయసులో ఉండటం తో తనకు కావాల్సింది సారా ద్వారా తీర్చుకోవచ్చని అనుకుంటాడు. ఆమెని అక్కడే బలవంతం చేయబోతాడు.
తండ్రి ముందు ఇటువంటి పని తప్పని చెప్పే ప్రయత్నం చేస్తుంది. బయటికి వెళ్దామని అతనికి అర్థమయ్యేలా చెప్తుంది. బయటికి వెళ్ళాక ఆమెపై అఘాయిత్యం చేయబోతుండగా తండ్రి అడ్డుపడతాడు. అతడు సారా తండ్రిని కొట్టడంతో అక్కడే పడిపోతాడు. సారా బాయ్ ఫ్రెండ్ అక్కడికి వచ్చి వాళ్ళను కాపాడి కారులో సిటీకి తీసుకువెళ్తాడు. అడవి మనిషి కూడా వీళ్లను వెంబడిస్తూ సిటీకి వెళ్తాడు. ఎందుకంటే సారాను మళ్ళీ అతడు వెనక్కు తెచ్చి అతనిలో రగులుతున్న అలజడిని తగ్గించుకోవాలనుకుంటాడు. చివరికి సిటీలో సారాను ఈ అడవి మనిషి కలుస్తాడా? తనలో పరుగులు పెడుతున్న కోరికలను తీర్చుకుంటాడా? వీళ్ళ చేతిలో అడవిమనిషి బలి అవుతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “ఈఘ” (Eegah) అనే ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.