E-Paper
Advertisement

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..

ఇండియన్ బుల్లెట్ రైల్ రెడీ.. ఇక పట్టాలు ఎక్కుడే తరువాయి..
Advertisement

Indian  Bullet Train Body Frame Ready: భారతదేశంలోనే బుల్లెట్ రైలును తయారు చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. దేశంలో తొలిసారిగా స్వదేశీ హైస్పీడ్ రైలు కోసం తయారు చేస్తున్న బాడీ ఫ్రేమ్ సిద్ధమైనట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 2027 మే లేదంటే జూన్‌లో ఈ రైలును పట్టాలపైకి తీసుకొచ్చి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

బాడీ ఫ్రేమ్ తయారీ పూర్తి

గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ‘నమో ఫర్ వికసిత్ భారత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. స్వదేశీ బుల్లెట్ రైలు బాడీ ఫ్రేమ్ ఇటీవలే పూర్తయిందని, ప్రస్తుతం దానికి సంబంధించిన పరీక్షలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాథమిక పరీక్షలు పూర్తైన తర్వాత రైలును పట్టాలపై నడిపించి మరింత విస్తృతంగా పరీక్షించనున్నారు. 2027 మే లేదంటే జూన్ నాటికి భారతదేశ సొంత బుల్లెట్ రైలు ట్రాక్ టెస్టులకు సిద్ధమవుతుందని మంత్రి వెల్లడించారు.

గంటన్నరలో వడోదర నుంచి ముంబైకి!

Advertisement

స్వదేశీ హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గే అవకాశం ఉంది. వడోదర నుంచి ముంబై మధ్య దూరాన్ని సుమారు గంటన్నరలో చేరుకునేలా ఈ రైలు వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. పరీక్షల దశలో రైలు పనితీరు, భద్రత, వేగం వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రెండు నుంచి నాలుగు నెలల పాటు పరీక్షలు నిర్వహించిన తర్వాత రైలును సేవల్లోకి తీసుకురావడానికి అవసరమైన తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు మంత్రి చెప్పారు.

ముంబై–అహ్మదాబాద్ కారిడార్!

దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్. ఈ మార్గంలో పనులు వేగంగా సాగుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్–బిలిమోరా మధ్య తొలి కార్యాచరణ విభాగాన్ని వచ్చే ఏడాది ప్రారంభించే అవకాశం ఉందని గతంలో రైల్వే మంత్రి వెల్లడించారు. మొత్తం కారిడార్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. మిగిలిన మార్గాలను కూడా దశలవారీగా అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

ఫ్రైట్ కారిడార్‌పైనా దృష్టి

Advertisement

వడోదర కార్యక్రమంలో వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌కు సంబంధించిన కీలక విభాగాలతో పాటు పలు రైల్వే, రహదారి ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. దాద్రి నుంచి జేఎన్‌పీటీ వరకు విస్తరించే ప్రత్యేక సరుకు రవాణా మార్గం దేశంలో సరుకు రవాణా వేగాన్ని పెంచడంలో కీలకంగా ఉంటుందని మంత్రి చెప్పారు. నిధులు, రూపకల్పన, భూసేకరణ వంటి సమస్యలను పరిష్కరించడంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయని వివరించారు.

Read Also: ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

Tags

Related News

భూగర్భంలో వింత నగరం.. ఏకంగా 20 వేల మంది హ్యాపీగా ఉండొచ్చు.. ఇంతకి ఎక్కడుందో తెలుసా?

భోగాపురం నుంచి అంతర్జాతీయ సర్వీసులు, అక్టోబర్ 27 నుంచి మరొక దేశానికి, వారానికి రెండు సార్లు

శ్రీకృష్ణుడి ద్వారకా తరహాలో.. సముద్ర గర్భంలో దాగి ఉన్న.. టాప్-5 ప్రాచీన నగరాలు ఇవే!

నాగార్జునసాగర్ టూర్ ఇక మరింత థ్రిల్లింగ్.. సరికొత్త అడ్వెంచర్ స్పాట్ గా ఎత్తిపోతల జలపాతం!

ఓరి దేవుడా.. కుక్కను వెతుక్కుంటూ వెళ్తే.. 17 వేల ఏళ్ల నాటి అద్భుతాలు బయటపడ్డాయ్!

ఉప్పునీటి సరస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లిన వందే భారత్.. చూస్తే కళ్ళు చెదిరి పోవాల్సిందే!

అడవిలో పారేసిన 12 టన్నుల నారింజ వ్యర్థాలు.. 15 ఏళ్ల తర్వాత జరిగింది చూసి.. యావత్ ప్రపంచమే షాక్!

Big Stories

Advertisement
×