DSC Irregularities: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో సిఆర్ సి క్లబ్లో చిర్ల జగ్గిరెడ్డి అధ్యక్షతన జరిగిన వైసిపి జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. నందిని పంది పందిని నంది చేసే వాళ్ళు ఈ మీడియా వాళ్ళు అంటూ టిడిపికి అనుకూల పత్రికలు చూపిస్తూ టెట్ స్కోర్ పెంచుకోవడానికి ఎన్నిసార్లు అయినా పరీక్షలు రాయచ్చు అంట. మేము అడుగుతున్నది ఏంటి టెట్ పరీక్షలు రాయకుండా ఉద్యోగం ఇవ్వొచ్చా ఇవ్వకూడదా? కర్నూల్లో జరిగింది ఇదే కదా అది తప్పు కాదా అని అడుగుతున్నాంమని అన్నారు.
స్పోర్ట్స్ శాఖలో తగాదాలు వచ్చి ఆ తగువుల వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయంట మా వల్ల కాదు అంట నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్లు జన్యు నా కాదా దానిమీద ఎంక్వైరీ చేద్దామని, ఇంకో పేపర్ చూపిస్తూ దీనిపై మాట్లాడిన వారి మీద చర్యలు తీసుకుంటాం అంటే ఏం చేస్తారు అరెస్టు చేస్తారా కేసులు పెడతారా దమ్ముంటే పెట్టండని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. స్పోర్ట్స్ కోటలో తప్పులు జరిగాయి అవకతవకలు జరిగాయి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పరీక్ష రాయకపోయినా సరే ఉద్యోగం ఇచ్చారని అన్నారు. డీఎస్సీ ఉద్యోగాలను నువ్వు లచ్చ నువ్వు లచ్చ నువ్వు కొంటావా అంటూ అమ్ముకున్నారని అన్నారు. పెద్ద పెద్ద క్లబ్బుల్లో బ్రిడ్జి కోర్స్ అని పేకాట ఆడతారు. పేకాటలో సెలెక్ట్ అయితే ఉద్యోగాలు ఇస్తారని అన్నారు.
నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. పప్పు ఉప్పు నూనెల ధరలు పెరిగితే సామాన్యుడు ఏం తినాలని అన్నారు. స్థానిక సంస్థల పోటీల లో మన పార్టీ గెలుపు దిశగా ప్రయత్నించాలని అందుకు నియోజకవర్గలా వారీగా సమావేశాలు నిర్వహించాలని అనంనారు. పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి ఐడి కార్డు ఉంటుంది. ఈ ఐడి కార్డు ఉన్న ప్రతి నాయకుడు కార్యకర్తకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత గౌరవం మర్యాదలు దక్కుతాయో చూపిస్తామని అన్నారు. ఆక్వా రైతుల తరఫున మంత్రి బొత్సకు రైతులు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశంలో చిర్ల జగ్గరెడ్డి మాట్లాడుతూ విద్యావంతులను అవమానపరుస్తూ అర్హతలు లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇస్తే రేపటి తరాల పిల్లల భవిష్యత్తును లోకేష్ పాడు చేస్తున్నాడు మెగా డీఎస్సీ ని దగాడీఎస్సీగా చేసినటువంటి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Also read: మరో మల్టీప్లెక్స్ ప్లానింగ్ లో రౌడీ హీరో..విస్తరిస్తున్న సినీ సామ్రాజ్యం!