Russia Earthquake: ప్రపంచ వ్యాప్తంగా భూకంపాలు మూమెంట్ చురుగ్గా కదులుతోంది. కనీసం వారానికి ఒక్క ప్రాంతంలో భూకంపాలు ఏర్పడుతున్నాయి. తాజాగా రష్యాను భారీ భూకంపం కుదిపేసింది. రిక్టర్ స్కేలుపై 7.0గా నమోదు అయ్యింది. అయితే దీని కారణంగా ఎలాంటి సునామీ ముప్పులేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.0గా నమోదు అయ్యింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్- EMSC వెల్లడించింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 9.05 గంటలకు 152 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ భూకంప తీవ్రతను 7.0గా పేర్కొంది.
రష్యాలోని విల్యుచిన్స్క్కు నైరుతి దిశలో సుమారు 123 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించింది. పెట్రోపావ్లోవ్స్క్ – కామ్చాట్స్కీ నగరానికి దక్షిణ-నైరుతి దిశలో 146 కిలోమీటర్లు, ఓజెర్నోవ్స్కీకి ఉత్తర-ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. భూకంపం వల్ల సునామీ ముప్పు లేదని, ఎలాంటి హెచ్చరిక, జారీ చేయలేదని ఆ సంస్థ తెలిపింది.
పసిఫిక్ మహా సముద్రం చుట్టూ విస్తరించింది రింగ్ ఆఫ్ ఫైర్. ఆ ప్రాంతానికి సమీపంలో కమ్చట్కా ద్వీపకల్పం ఉంది. ఈ ప్రాంతంలో టెక్టానిక్ పలకల కదలికల తరచూ జరుగుతుంటాయి. ఈ కారణంగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతేడాది జులైలో ఈ ప్రాంత సమీపంలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం ఏర్పడింది. తాజా రష్యాలో సంభవించిందిన భూకంపానికి సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు వెలువడలేదు.
ALSO READ: బలవంతంగా డ్రగ్స్ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన
NHK న్యూస్ ప్రకారం.. అత్యంత శక్తివంతమైన భూకంపం సంభవించే అవకాశం ఉందని సూచన తర్వాత జపాన్ వాతావరణ సంస్థ అత్యవసర భూకంప హెచ్చరికను జారీ చేసింది. హోక్కైడో, తోహోకు, కాంటోలోని కొన్ని ప్రాంతాలలో గరిష్ట స్థాయిలో భూకంప ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేయబడింది. అంచనా వేసిన దానికంటే భూకంపం బలహీనంగా ఉందని తేలడంతో ఆ సంస్థ భూకంపం హెచ్చరికను ఉపసంహరించుకుంది.