IRCTC Tour Packages: భారత దేశపు సంప్రదాయాల గౌరవాన్ని, శివ తత్త్వాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి తెలియజేసే పవిత్ర ప్రతిరూపం జ్యోతిర్లింగాలు.. శివుని అత్యద్భుతమైన రూపం జ్యోతిర్లింగ దర్శనం ఒకసారి జీవితంలో తప్పక అనుభవించాలని కోట్లాది భక్తులు విశ్వసిస్తారు. అలాంటి భక్తుల కోసం ఐఆర్‌సిటిసి ఆధ్వరంలో నిర్వహిస్తున్న అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక యాత్ర భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ ద్వారా “జ్యోతిర్లింగ దర్శన్ విత్ అక్షరధామ్ మందిర్”. 8 రాత్రులు, 9 రోజుల పవిత్ర ప్రయాణం, భాగల్పూర్ నుండి ప్రారంభమై ఉజ్జయిని నుండి సోమనాథ్ వరకు, ద్వారకాధీశ్ నుండి అహ్మదాబాద్ అక్షరధామ్ వరకు విశ్వాసానికి వెలుగు చూపించే ఈ యాత్ర, భక్తులు జీవితాంతం గుర్తుంచుకునే ఆధ్యాత్మిక అనుభూతిని అందించే ప్రమాణం.
ప్రతీ రోజూ కొత్త యాత్ర
భారత గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో ప్రయాణం అంటే సాధారణ రైలు ప్రయాణం కాదు. దేవాలయాల మహత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించే ఒక పవిత్రమైన పర్వం. ప్రతీ రోజూ కొత్త యాత్ర, కొత్త ఆలయం, కొత్త భక్తి అనుభవం. రైలులో వసతి, ఆహారం, భద్రత, దర్శన ఏర్పాట్లతో పాటు ట్రైన్ లోపలే సంపూర్ణ భక్తి వాతావరణాన్ని సృష్టించడం ఈ ప్రత్యేక యాత్ర లక్ష్యం. భక్తులు ఏది గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా, రైల్వే అధికారులు అన్నీ నిర్వహించడంతో, ప్రయాణం పూర్తిగా ఆధ్యాత్మికతకే అంకితం అవుతుంది.
అరుదైన అవకాశం
ఈ యాత్రలో మొదటి ముఖ్యమైనది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. కాళభైరవుని శక్తి పుణ్యభూమిగా పేరుగాంచిన ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇక్కడ మహాకాళేశ్వరుడి భస్మాభిషేకం దర్శనం అనుభవించడం జీవితంలో దేవదాన్ లాంటిది. భక్తులు వేల కిలోమీటర్లు ప్రయాణించే ఆలయం, ఈ ఆధ్యాత్మిక ట్రైన్ ప్రయాణంలో తొలి అరుదైన అవకాశం.
సోమనాథ్ జ్యోతిర్లింగం
తర్వాతి గమ్యం సోమనాథ్ జ్యోతిర్లింగం, శివుని శక్తి ఆది రూపంగా ప్రసిద్ధి పొందిన హిస్టారికల్ ఆలయం. శతాబ్దాల కాలంలో ఎన్నో దాడులు ఎదురైనా, ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, ప్రతి సారి పునర్నిర్మాణం చెంది ధర్మానికి మళ్లీ వెలుగు నిచ్చింది. సోమనాథ్ సముద్రపు అలల ధ్వనిలో “ఓం నమః శివాయ” నినాదం వినిపిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. శివుని అత్యంత శక్తిశాలి రూపాన్ని దర్శించే అవకాశం ఈ యాత్రలో లభించడం ప్రత్యేకత.
Also Read: Redmi Note 14 5G: విద్యార్థులు, ఉద్యోగులు కోసం బెస్ట్ చాయిస్.. రెడ్మి నోట్ 14 5G సేల్ ప్రారంభం
ద్వారకాధీశ్ శ్రీకృష్ణ ఆలయం
తరువాత ద్వారకాధీశ్ శ్రీకృష్ణ ఆలయం, చారిత్రక నగరమైన ద్వారకలో భగవాన్ శ్రీకృష్ణుడు పాలించిన పాత యుగపు ధార్మిక మహానగరం. అక్షయమైన సంపద, అధ్యాత్మిక రాజధాని, వేల ఏళ్ల చరిత్రను హృదయానికి హత్తుకునే తీర్థయాత్రగా ఈ ప్రయాణంలో అనుభవించవచ్చు. సముద్రతీరంలో నిలుచున్న ఈ ఆలయం ప్రతి యాత్రికుడికి ప్రశాంతత, ధ్యానం, విశ్వాసానికి శక్తినిస్తుంది.
అక్షర్ధామ్ మందిర్
చివరగా అహ్మదాబాద్ అక్షర్ధామ్ మందిర్, ఆధునిక భారతదేశ ఆధ్యాత్మిక అద్భుతం. శిల్పకళ, శాంతి, సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు ఉదాహరణ. దేవతా విగ్రహాలు, జలధారల అద్భుత లైట్, సౌండ్ ప్రదర్శన, మానవతా సందేశాన్ని మేల్కొలిపే ఆధ్యాత్మిక వాతావరణం ఈ వైభవాన్ని ప్రపంచ స్థాయి తీర్థయాత్రగా నిలబెడుతుంది.
యాత్ర ఎప్పుడు ప్రారంభం.. ప్యాకేజీ వివరాలు
ఈ పుణ్య యాత్ర 11.03.2026న ప్రారంభమవుతుంది. ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులు దేవుని దరిదాపుల్లో ఆత్మశాంతిని అనుభవించే దైవ దర్శనం. ఒక్కొక్క భక్తునికి రూ.18,850 ప్రారంభ ధర మాత్రమే. రైలు వసతి, భోజనం, భద్రత, దర్శనం అన్నీ కలిపి అత్యంత తక్కువ ధరలో లభించడం ఈ యాత్రను అందరికీ అందుబాటులోకి తెచ్చింది. కుటుంబాలతో, వయో వృద్దులుతో, స్నేహితులతో వెళ్లే భక్తులకు ఈ ప్రత్యేక టూర్ ట్రైన్ మహాదేవుని ఆశీస్సులతో నిండిన ఆధ్యాత్మిక ప్రయాణం అవుతుంది.
సంప్రదించడం ఎలా ?
వివరాలు, బుకింగ్ సౌకర్యం IRCTC Bharat Gaurav అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. బుకింగ్ సంబంధిత ఏ ప్రశ్నలు ఉన్నా ఐఆర్‌సిటిసి టోల్ ఫ్రీ నంబర్ 1800-111-139 ద్వారా సంప్రదించవచ్చు. అలాగే రైలు యాత్ర సహాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 139, టూరిస్ట్ సపోర్ట్ కోసం 9701370681 కూడా అందుబాటులో ఉంది. ఈ పవిత్ర ప్రయాణం మీ జీవితంలో శాశ్వతమైన దైవ అనుభూతిని అందిస్తుందని విశ్వసిస్తూ, మహాకాళేశ్వరుడు, సోమనాథ్, ద్వారకాధీశ్, అక్షర్ధామ్ దైవ కరుణలతో ఈ యాత్ర మీ జీవితానికి కొత్త వెలుగును తీసుకురావాలని ఆకాంక్ష. సమస్యల నుండి దూరంగా భగవంతుని సన్నిధిలో మనసుకు శాంతి, ఆత్మకు విలువ ఇచ్చే ఆధ్యాత్మిక యాత్ర ఇది.