E-Paper
Advertisement

Pawan Kalyan: మాట పవన్‌ది.. మంట బీజేపీకి.. ఇప్పుడెలా?

Pawan Kalyan: మాట పవన్‌ది.. మంట బీజేపీకి.. ఇప్పుడెలా?
Advertisement

Telangana Politics: తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం తారాస్థాయికి చేరింది. విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పటివరకు నోరు మెదపలేదు. ఎందుకు సైలెంట్‌‌గా ఉన్నారు? ఒకవేళ ఖండిస్తే.. ఇబ్బందులు వస్తాయని భావిస్తున్నారా? అందుకే మౌనం వహిస్తున్నారా? అవుననే అంటున్నారు కొందరు నేతలు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలో దుమారం

Advertisement

రాజకీయ పార్టీల అధినేతలు జాగ్రత్తగా మాటలు ఆడాలి. ఏమాత్రం నోరు జారినా తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా బలంగా ఉన్న జాగ్రత్తగా మాట్లాడాలి.  మనం ఏం మాట్లాడిన పదే పదే ట్రోల్ చేస్తూనే ఉంటారు నెటిజన్స్. అందులోనూ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నవాళ్లు మరింత జాగ్రత్త అవసరం. లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితి అలాగే తయారైంది.

రాజోలులో కొబ్బరి రైతులతో సమావేశం సందర్భాగా తెలంగాణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వరుసగా రియాక్ట్ అవుతున్నారు. తెలంగాణ బీజేపీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు ఖండించిన సందర్భం లేదు. మిగతా నేతలు మాట్లాడకపోయినా, కీలక నేతలు స్టేట్‌మెంట్ ఇస్తే బాగుండేదని అంటున్నారు.  తెలంగాణ ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Advertisement

మౌనంగా తెలంగాణ బీజేపీ, డ్యామేజ్ తప్పదా?

బీజేపీ ఎందుకు సైలెంట్‌గా ఉందంటూ సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్.. ఓవైపు సినిమాలు చేస్తున్నారు. మరోవైపు రాజకీయాలు చురుగ్గా ఉన్నారు. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మాట్లాడిన ప్రతీ మాటను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు.

అందులోనూ ప్రభుత్వం ఉన్నతమైన పదవిలో ఉన్నారు. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా దాని పర్యవసానాలు దారుణంగా ఉంటాయి. ఈ విషయం జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది కూడా. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ పార్టీలు కూటమిగా ఉన్నాయి. కేంద్రంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తోంది కూడా.

ALSO READ: పవన్ క్షమాపణలు చెప్పాల్సిందే.. లేకుంటే సినిమాలు ఆడనివ్వం-కోమటిరెడ్డి

మొన్నటికి మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి ఓపెన్‌గా మద్దతు ఇచ్చింది జనసేన. అయినా సరే పవన్ ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదని అంటున్నారు.  బహుశా దీనిపై ఎవరూ నోరు మెదపవద్దని పార్టీ నుంచి నేతలకు ఏమైనా సంకేతాలు వెళ్లాయా?  అంటూ సగటు మానవులు చర్చించుకోవడం మొదలైంది. ఎంత ఆలస్యం చేస్తే ఇబ్బందులు తప్పవని తెలంగాణ బీజేపీలోని కింది స్థాయి నేతల గుసగుసలు పెట్టేసుకుంటున్నారు.  రేపో మాపో పార్టీ నుంచి ప్రకటన రావచ్చని మరికొందరు అంటున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×