E-Paper
Advertisement

కొత్త IRCTC వెబ్‌ సైట్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

కొత్త IRCTC వెబ్‌ సైట్ వచ్చేసింది.. దీని ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Advertisement

IRCTC Beta Website Launch: రైలు టికెట్లను ఆన్‌ లైన్‌ లో బుక్ చేసుకునే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. IRCTC కొత్త బీటా వెబ్‌ సైట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్, వేగవంతమైన సర్వీసులు, సులభమైన టికెట్ బుకింగ్ ప్రక్రియతో ఈ వెబ్‌ సైట్‌ ను రూపొందించారు. వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా మరిన్ని అప్ డేట్స్ తో త్వరలో పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. గత నెలలో జైపూర్‌ లోని మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త IRCTC వెబ్‌ సైట్‌ ను జూలై మధ్యలో అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. చెప్పినట్లుగానే ఇప్పుడు బీటా వెర్షన్‌ను ప్రయాణికుల కోసం విడుదల చేశారు.

ఇంతకీ ఏంటీ కొత్త వెబ్ సైట్ ప్రత్యేకతలు

IRCTC బీటా వెబ్‌ సైట్‌ ను ఉపయోగించే వారు కొత్త డిజైన్‌ తో పాటు కొత్త ఫీచర్లను కూడా పొందే అవకాశం ఉంది. అలాగే వెబ్‌ సైట్ పనితీరు, సౌలభ్యం, యూజర్ ఎక్స్ పీరియెన్స్ గురించి తమ అభిప్రాయాలను తెలియజేయడానికి అవకాశం కల్పించారు. ఆ సూచనల ఆధారంగా తుది వెర్షన్‌ లో అవసరమైన మార్పులు చేయనున్నారు. IRCTC వెబ్‌ సైట్ మొదటిసారి 2002లో ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ పోర్టల్ ద్వారా ప్రతి రోజు సగటున 14.5 లక్షలకుపైగా రైలు టికెట్లు బుక్ అవుతున్నాయి. దేశంలో అత్యధికంగా ఉపయోగించే ఆన్‌ లైన్ టికెటింగ్ ప్లాట్‌ ఫామ్‌ లలో ఒకటిగా కొనసాగుతోంది. పెరుగుతున్న వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వెబ్‌ సైట్‌ ను మరింత వేగంగా, సులభంగా ఉపయోగించేలా రూపొందించారు.

బీటా వెబ్ సైట్ లో కీలక మార్పులు

Advertisement

కొత్త బీటా వెబ్‌ సైట్‌ లో పలు కీలక మార్పులు చేశారు. ముందుగా టికెట్ బుక్ చేసే సమయంలో తరచూ ఇబ్బంది పెట్టే అనవసరమైన క్యాప్చాలను తగ్గించారు. అలాగే అవసరం లేని పాప్ అప్‌లు,  గ్రాఫిక్స్‌ ను తొలగించారు. దీంతో వెబ్‌ సైట్ మరింత క్లీన్ గా, ఈజీగా కనిపిస్తుంది.

వేగవంతమైన టికెట్ బుకింగ్

ఇక సీట్ల లభ్యత విషయంలో కూడా మార్పులు చేశారు. అన్ని క్లాస్ లలో సీట్లు ఉన్నాయా? లేదా? అనే సమాచారం ఒకే స్క్రీన్‌లో స్పష్టంగా కనిపించేలా రూపొందించారు. దీంతో ప్రయాణికులు సులభంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. టికెట్ బుకింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేశారు. గతంతో పోలిస్తే బుకింగ్ పూర్తి చేయడానికి అవసరమైన స్టెప్స్ ను తగ్గించారు. దీంతో తక్కువ సమయంలోనే టికెట్ బుక్ చేసుకోవచ్చు. అలాగే తరచూ ప్రయాణించే వారి కోసం ప్రయాణికుల వివరాలను సేవ్ చేసే సదుపాయం కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రతిసారి వివరాలు ఎంటర్ చేయాల్సిన  అవసరం ఉండదు. రీ-బుకింగ్ కూడా చాలా సులభంగా పూర్తవుతుంది.

Advertisement

ప్రస్తుతం బీటా వెర్షన్‌ ను ఉపయోగించే ప్రయాణికులు తమ అభిప్రాయాలను తెలియజేస్తే, వాటి ఆధారంగా సర్వీసులను  మరింత మెరుగుపరచాలని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో భవిష్యత్తులో టికెట్ బుకింగ్ మరింత వేగంగా, సులభంగా, ఇబ్బందులు లేకుండా జరిగే అవకాశం ఉంది.

Read Also: విశాఖ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు!

Related News

మనుషులు లేరు.. కేవలం బొమ్మలు మాత్రమే బతికే వింత ఊరు.. ఎక్కడుందో తెలుసా?

కుక్క తోక వంకరంటారు.. అసలు తోకే లేకపోతే? ప్రపంచంలోనే ఈ వింతైన డాగ్స్ గురించి తెలుసా?

భారతీయ పర్యాటకులకు గుడ్ న్యూస్.. వీసా లేకుండానే థాయిలాండ్ టూర్!

నీటితో నడిచే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి.. ఈ రైలు ప్రత్యేకతలు ఇవే

అందమైన నీలగిరి.. నల్లగొండగా ఎలా మారింది? చరిత్ర చెప్పే అసలు నిజం ఇదే!

వాట్ ఏ ఐడియా సార్ జీ.. భార్యలు షాపింగ్ చేస్తుంటే భర్తలు చేపలు పట్టొచ్చు.. ఎక్కడో తెలుసా?

రథయాత్ర భక్తులకు గుడ్ న్యూస్.. పూరీకి ప్రత్యేక రైళ్లు వచ్చేశాయ్!

Big Stories

Advertisement
×