IRCTC budget tour packages: చల్లని గాలులు తాకే ఒక డ్రీమ్ ట్రిప్ చేయాలని ఎప్పుడైనా అనిపించిందా? పర్వతాల మధ్య మబ్బులు కమ్ముకున్న వింత సన్నివేశాలు, గ్రీన్ టీ తోటల వాసన, అడవుల్లో జంతువుల కేరింతలు అన్నీ కలగలసిన అనుభవం ఇస్తున్న ఓ ప్రత్యేక ట్రిప్ ఇప్పుడు రెడీగా ఉంది. ఒకసారి బయలుదేరితే, ప్రతి రోజూ కొత్త అనుభవాలతో గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలతో నిండిపోతుంది. ట్రైన్ ప్రయాణం మొదలుకొని హిల్ స్టేషన్ హాలిడే, వైల్డ్‌లైఫ్ సఫారీ వరకు IRCTC అదిరే ప్యాకేజ్ తో వచ్చింది. అసలు ఈ ప్యాకేజ్ ఎందుకు ఇంత స్పెషల్‌గా ఉందో ఒక్కసారి తెలుసుకుంటే, వెంటనే బ్యాగ్ సర్దేస్తారు.
ఎవరికైనా కాస్త ఖాళీ టైమ్ దొరికితే.. ఒక చల్లని హిల్ స్టేషన్ ట్రిప్ వెళ్లి రావాలని అనిపిస్తుంది. అలాంటి కలల ట్రిప్ కోసం రెడీ అయిన ప్రత్యేక ప్యాకేజ్ ను IRCTC తీసుకువచ్చింది. చెన్నై – ఊటీ – ముదుమలై – చెన్నై ఇలా ఈ టూర్ సాగుతుంది. 4 రాత్రులు, 5 రోజులు గుండెల్లో నిలిచిపోయే జ్ఞాపకాలతో నిండిన ఈ ట్రిప్ ప్రతి గురువారం చెన్నై సెంట్రల్ నుండి స్టార్ట్ అవుతుంది. రాబోయే డేట్ ఆఫ్ జర్నీ 31 జూలై 2025.
❂ ఊటీ.. హిల్ స్టేషన్ల రాణి
ఊటీ అంటే నీలగిరి పర్వతాల సొగసేనని అందరికీ తెలుసు. 2,240 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ హిల్ స్టేషన్ గ్రీన్ టీ తోటలు, చల్లని వాతావరణం, మిస్టీ పర్వతాలతో మనసును మంత్రముగ్ధం చేస్తుంది. ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీకి సమ్మర్ క్యాపిటల్‌గా ఉన్న ఊటీ ఇప్పటికీ అదే కూల్ ఆకర్షణను నిలబెట్టుకుంది. బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్, దొడ్డబెట్ట పీక్, రోజ్ గార్డెన్ లాంటి ప్రదేశాలు ప్రతి టూరిస్ట్‌ను ఉత్సాహపరుస్తాయి.
❂ కూనూర్లో వెరీ స్పెషల్
కూనూరు చేరుకున్న వెంటనే టీ తోటల్లో నడక, టీ ఫ్యాక్టరీలో ఫ్రెష్ టీ టేస్ట్ అనుభవం మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. సిమ్స్ పార్క్ అందమైన పూలతో మెరిసిపోతుంటే, డాల్ఫిన్స్ నోస్ వ్యూ పాయింట్ నుంచి పర్వతాల సోయగం మైమరిపిస్తుంది.
Also Read: Vande Bharat vs Amrit Bharat: టికెట్ రేట్లలో షాక్.. వందే భారత్, అమృత్ భారత్ ధరల తేడా తెలుసా!
❂ ముదుమలై అడవుల థ్రిల్
మూడో స్టాప్ ముదుమలై టైగర్ రిజర్వ్. ఇక్కడ అడవి సఫారీ అంటే నిజంగా ఒక అడ్వెంచర్. ఏనుగుల గుంపులు, చిరుతలు, జింకలు, అరుదైన పక్షులు, ఇంకా ఎన్నో వింత జంతువులను ఇక్కడే చూడవచ్చు. నేచర్ లవర్స్‌కు ఇది ఒక మిస్ కాకూడని ఎక్స్పీరియన్స్.
❂ ప్యాకేజీ సౌకర్యాలు
ఈ ప్యాకేజీలో అన్ని అవసరమైన సౌకర్యాలు ఉంటాయి. చెన్నై నుండి తిరిగి వచ్చే వరకు ట్రైన్ టికెట్లు, ఊటీ, కూనూరు, ముదుమలై లోకల్ ట్రావెల్ కోసం బస్ సౌకర్యం, వినయగ ఇన్ లేదా ప్రీతీ క్లాసిక్ టవర్ వంటి హోటళ్లలో వసతి, అలాగే ఇన్షూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ట్రిప్‌ను ఎంజాయ్ చేయడమే.
❂ పర్సుకు తగిన బడ్జెట్
ఈ సూపర్ ప్యాకేజ్ ధర రూ. 8,980 నుండి ప్రారంభమవుతుంది. ముగ్గురి కోసం సెడాన్ కారు, 4 నుండి 6 మంది కోసం ఇన్నోవా కారు సౌకర్యం, సింగిల్, ట్విన్ లేదా ట్రిపుల్ షేరింగ్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరకు ఇంత సౌకర్యం మరెక్కడా దొరకడం అరుదు.
❂ ట్రైన్ ట్రిప్.. ఓల్డ్ స్కూల్ ఫన్
నీలగిరి మౌంటెన్ రైల్వే (టాయ్ ట్రైన్) అనుభవం ఈ ప్యాకేజీలో హైలైట్. కొండ చరియల మీదుగా వంకరల మార్గంలో గ్రీన్ వ్యాలీల మధ్య ప్రయాణం.. ఇది లైఫ్‌టైమ్ మెమరీ.
❂ ట్రిప్ ఎందుకు స్పెషల్?
ఒక్క ప్యాకేజీతో హిల్ స్టేషన్ సౌందర్యం, వైల్డ్‌లైఫ్ థ్రిల్, పల్లె వాతావరణం అన్నీ కలగలిపి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రొటీన్ లైఫ్ ను పక్కన పెట్టి, ఈ 5 రోజులు పూర్తిగా నేచర్‌తో గడపడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఊటీ క్వీన్ ఆఫ్ హిల్ స్టేషన్స్ అని పిలవబడటానికి కారణం ఈ ట్రిప్‌లోనే తెలుస్తుంది. ముదుమలై అడవుల గర్జనలు, కూనూర్లోని టీ వాసనలు, ఊటీ చల్లని గాలులు ఇవన్నీ మీ మనసులో శాశ్వత జ్ఞాపకాలు మిగిలిపోతాయి. మరెందుకు ఆలస్యం.. IRCTC తెచ్చిన ఈ స్పెషల్ ప్యాకేజ్ ను మిస్ చేసుకోవద్దు.