E-Paper
Advertisement

తమిళనాట పాత రాజకీయ పార్టీల్లో వణుకు మొదలు.. జెన్ జెడ్ ఎఫెక్ట్, అన్నామలై 24 గంటల్లో సరికొత్త రికార్డు

తమిళనాట పాత రాజకీయ పార్టీల్లో వణుకు మొదలు..  జెన్ జెడ్ ఎఫెక్ట్, అన్నామలై 24 గంటల్లో సరికొత్త రికార్డు
Advertisement

Tamilnadu Politics: తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. పాత పార్టీల్లో అప్పుడే గుబులు మొదలయ్యాయి. కొత్త పార్టీలు దూకుడుతో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో పడ్డారు రాజకీయ పార్టీల నేతలు. ఒక విధంగా చెప్పాలంటే తమిళనాడుపై ‘జెన్ జెడ్’ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. అర దశాబ్దం నాటి రాజకీయ పార్టీలతో అక్కడి ప్రజలు విసిగిపోయారు. ఫలితంగా కొత్త పార్టీలపై ఫోకస్ చేశారు. తాజాగా బీజేపీ నుంచి బయటకు వచ్చిన 24 గంటల్లోపు అన్నామలైతో 14 లక్షల మంది జత కట్టారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు.

తమిళనాట పాత రాజకీయ పార్టీల్లో వణుకు మొదలు

Advertisement

తమిళనాడులో ద్రవిడ రాజకీయ పార్టీల పునాదులు కదులుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీవీకే ప్రభంజనం ద్వారా ఆ విషయం నిరూపించారు తంబీలు.  బీజేపీకి గుడ్ బై చెప్పేసిన అన్నామలై, కేవలం 24 గంటల్లో మరొక రికార్డు సాధించారు.  మరుసటి రోజు తన విశ్వరూపాన్ని చూపించారు ఆయన.  ‘వి ద లీడర్స్‘ పేరుతో సరికొత్త ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే అదొక రాజకీయ వేదిక. దాన్ని ప్రారంభించిన 24 గంటల్లో దాదాపు 14 లక్షల మంది వలంటీర్లుగా అందులో చేరారు. దీన్ని బట్టి తమిళ తంబీల్లో అన్నామలై పట్ల ప్రజాభిమానం ఏ స్థాయిలో ఉందో నిరూపితమైంది.

జరుగుతున్న పరిణామాలను గమనించిన ద్రవిడ పార్టీల అధినేతలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇటు విజయ్ పార్టీ.. అటు అన్నామలై దూకుడు ప్రదర్శిస్తే మన పనైపోయినట్టేనన్న చర్చ అప్పుడే తమిళనాడు మొదలైంది. ఎందుకంటే సినీ కెరీర్ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి విజయ్‌. ప్రజలను ఆకట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

Advertisement

జెన్ జెడ్ ఎఫెక్ట్, అన్నామలై 24 గంటల్లో సరికొత్త రికార్డు

రేపో మాపో పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు అన్నామలై. తాను ఏంటో గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో చేసి చూపించారు. తమిళనాడులో బీజేపీకి ఓ ఊపు తీసుకొచ్చారు. అన్నామలై రాకముందు కేవలం బీజేపీ ఓట్ల శాతం మూడున్నర కాగా, ఆయన వచ్చిన గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో 11 శాతానికి పైగానే తీసుకెళ్లారు. అదంతా బీజేపీ తన ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఫలితంగా మొన్నటి అసెంబ్లీ సైలెంట్ అయ్యారు మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై.

2031 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పకనే చెప్పారు అన్నామలై. కేవలం సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారాయన.  ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు కూడా. ఆయన ప్రకటనకు ముందు స్వచ్ఛంధ సంస్థలో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా ఊహించని రీతిలో పెరిగిపోయింది. మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి సుమారు 17 వేలుగా ఉన్న ఆ సంస్థ సభ్యుల సంఖ్య, అన్నామలై ప్రకటన తర్వాత అనూహ్యంగా దాదాపు 14 లక్షలకు చేరింది. అన్నామలై వ్యవహారంపై డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ALSO READ: సామాన్యుడి జేబుకు చిల్లు.. పెరిగిన గ్యాస్ సిలెండర్ ధరలు, ఎంతంటే

Related News

Education Bandh: ‘నీట్’ లీకేజీపై విరుచుకుపడ్డ విద్యార్థి లోకం.. జులై 24న విద్యాసంస్థల బంద్!

Rajnath Singh: ఢిల్లీ నిరసనలపై రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు.. ఎమన్నారంటే?

Delhi Metro: దిల్లీ మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్.. భద్రతా కారణాలతో 16 స్టేషన్లు మూసివేత!

సమయం వృథా.. వీడియోలు చూసే టైమ్ లేదు, విచారణకు నో చెప్పిన సుప్రీంకోర్టు

ఆ వాహనదారులకు రిలీఫ్.. ఆ యాప్ ద్వారా రాజ్‌మార్గ్, ఏ విధంగా చేయాలంటే..

NEET లీకేజీ పై పోరుబాట.. రాహుల్ ముక్కు నుంచి రక్తం.. రంగంలోకి దిగిన సోనియా!

భార్య-పిల్లల నోటికి ప్లాస్టర్‌ అంటించి, ఆ తర్వాత వ్యాపార‌వేత్త ఆత్మహత్య, వెలుగులోకి షాకింగ్ నిజాలు

NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!

Big Stories

Advertisement
×