Kalyan Ram: నందమూరి మరో హీరో కళ్యాణ్ రామ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఎప్పటికప్పుడు వినూత్నమైన కథలతో ప్రేక్షకులను అలరించే ఈయన.. అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంటూ ఉంటారు. ఒకవైపు నటనతో.. మరొకవైపు నిర్మాణంలో భాగస్వామ్యం అవుతూ బిజీగా మారారు కళ్యాణ్ రామ్. ఇక అలాంటి ఈయన మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్లు వార్తలు రాగా..త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గీతాగోవిందం, సర్కారు వారి పాట వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు పరశురాంతో నందమూరి కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పరుశురాం చెప్పిన కథను కళ్యాణ్ రామ్ మెచ్చుకున్నారని.. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అన్నీ కుదిరితే ఈ క్రేజీ ప్రాజెక్టును ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రానుందట. ఒకవేళ అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గనుక ఈ సినిమా పై అంచనాలు భారీగా పీక్స్ కి చేరుతాయనడంలో సందేహం లేదు.
also read:గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న రవితేజ వారసుడు.. తొలి సినిమా రిలీజ్ డేట్ లాక్!
నిజానికి నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో కళ్యాణ్ రామ్ జర్నీ చాలా భిన్నంగా సాగింది. కెరియర్ ప్రారంభం నుంచే ఒకే తరహా కథలకు పరిమితం కాకుండా యాక్షన్, ఫాంటసీ , థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా ఇలా విభిన్నమైన జానర్ లలో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక అలాంటి ఈయన ఈమధ్య తీసుకునే నిర్ణయాలు తరచూ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. వాస్తవానికి బింబిసారా సినిమాతో కెరియర్ లో గుర్తుండిపోయే విజయాన్ని అందుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ స్థాయి విజయం మళ్ళీ పడలేదు. మరొకవైపు దిల్ రాజు నిర్మాణంలో అంటున్నారు.. అయితే ఆయన కథలను నమ్మి సినిమాలు నిర్మించే నిర్మాతగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. హీరో ఇమేజ్ కి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడం.. సినిమాకు అవసరమైన నిర్మాణ విలువలు అందించడంలో ఆయన ఎప్పుడూ ముందే ఉంటారు. అందుకే దిల్ రాజు బ్యానర్ లో సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ అన్ని నిజమయి ఈ కాంబో హిట్ అయితే మాత్రం కచ్చితంగా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరొకవైపు కళ్యాణ్ రామ్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో పటాస్ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అనిల్ రావిపూడి కి తొలి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. ఇక తనకు దర్శకుడిగా అవకాశాన్నిచ్చిన నందమూరి హీరోని దృష్టిలో పెట్టుకొని ఆయనకు తగ్గట్టుగా ఒక ప్రత్యేకమైన పాత్రను అనిల్ రావిపూడి తయారు చేశారట. పైగా ఇటీవల ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచారు అనిల్ రావిపూడి. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ మెయిన్ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే అలాగే కీర్తి సురేష్, కృతి శెట్టి లు కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అప్పుడే ప్రకటించారు.