Hyderabad to Arunachalam: హైదరాబాద్ నుంచి అరుణాచలం వెళ్లాలంటే వారినికి రెండు లేదా మూడు సార్లు రైలు సదుపాయం ఉంటుంది. నార్మల్ సమయంలో వెళ్లాలంటే కాసింత ఇబ్బందిపడాల్సిందే. తాజాగా ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీ( ARUNACHALA MOKSHA YATRA)ని వెల్లడించింది. అయితే ప్యాకేజ్ టూర్‌ని హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తుంది.
జూన్ 12న అందుబాటులో ఉండనుంది. ఐదురోజుల టూర్ అన్నమాట. అందులో నాలుగు రాత్రులు ఉంటాయి. ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా కాణిపాకం మీదుగా అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. ఇక రైలు షెడ్యూల్ విషయానికొద్దాం. కాచిగూడ రైల్వే స్టేషన్ సాయంత్రం 5 గంటలకు ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు పుదిచ్చేరి స్టేషన్‌కు చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు.
అరబిందో ఆశ్రమం, ప్యారడైజ్ బీచ్‌ను సందర్శించి రాత్రి పుదిచ్చేరిలో బస చేస్తారు. మరుసటి రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత అరుణాచలం బయలు దేరుతారు. అక్కడ చేరుకున్న తర్వాత హోటల్‌లో చెకిన్ అవుతారు. అక్కడ అరుణాచలేశ్వరుడిని దర్శించుకుని, రాత్రికి తిరువన్నామలైలో స్టే చేయనున్నారు.
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత కాంచీపురం వెళ్తారు. అక్కడ కామాక్షి ఆలయం, ఏకాంబేశ్వర దేవాలయాలను దర్శించుకుంటారు. అక్కడ్నుంచి చెంగల్ పట్టు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయదేరుతారు. రాత్రంతా జర్నీ ఉండి ఉదయం 7.50 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటారు.
ALSO READ: ప్రపంచంలో ఎత్తైన రైల్వే బ్రిడ్జి, ప్రధాని మోదీ ఓపెనింగ్
అక్కడితే టూర్ ప్యాకేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీ ధరలు కంఫర్ట్ క్లాస్(త్రీ టైర్ ఏసీ)లో ట్విన్ షేరింగ్ కు రూ. 20 వేలు పైమాట. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15610 గా ఉండనుంది. స్టాండర్ట్ క్లాస్(స్లీపర్ క్లాస్)లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13,460 , ట్విన్ షేరింగ్ కు రూ. 17,910గా నిర్ణయించింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి. ఈ ప్యాకేజీకి ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.