Aamirkhan: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటుడు అమీర్ ఖాన్ (Aamir khan)ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఒక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న అమీర్ ఖాన్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) తో కలిసి సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) క్రియేట్ చేసిన ఈయన అద్భుతమైన సినిమాలను చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. అయితే ఈ LCU లోకి అమీర్ ఖాన్ కూడా ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోకి అమీర్ ఖాన్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ నటుడిగా కొనసాగుతున్న అమీర్ ఖాన్ తన నిర్మాణ సంస్థలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అమీర్ ఖాన్ “సితారే జమీన్ పర్ “అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్న అమీర్ ఖాన్ తన తదుపరి సినిమాల గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అదేవిధంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు తెలియజేశారు.
సూపర్ హీరో సినిమా…
లోకేష్ LCU లోకి ఎంట్రీ ఇచ్చి తనతో కలిసి ఓ సూపర్ హీరో సినిమాని చేయాలని అనుకుంటున్నాను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చర్చలు అన్నీ కూడా ముగిసాయని, ఈ సినిమాని 2026 ద్వితీయార్థం నుంచి సెట్స్ పైకి తీసుకు వెళ్తున్నట్లు అమీర్ ఖాన్ వెల్లడించారు. ఈ సినిమా భారీ యాక్షన్ సినిమాగా, ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అమీర్ ఖాన్ తెలిపారు. ఇక అమీర్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే వరుస ప్రాజెక్టులతో ఈయన బిజీగా ఉన్నారు. ఈ సినిమాలతో పాటు తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం సినిమాని కూడా చేయాలని, ఆ సినిమా చేస్తూ చనిపోయిన నాకు ఎలాంటి బాధ ఉండదని, అదే నా ఆఖరి చిత్రం కూడా కావచ్చు అంటూ ఇటీవల షాకింగ్ విషయాలను అమీర్ ఖాన్ బయటపెట్టారు.
“#LokeshKanagaraj and I are working on a film in the superhero genre. It’s a large-scale action film and will go on floors in the second half of 2026.” https://t.co/XQ3kjG7lKO
— Gulte (@GulteOfficial) June 5, 2025
ఇక లోకేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం లోకేష్ వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా “కూలి” సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి అయిన అనంతరమే అమీర్ ఖాన్ సూపర్ హీరో సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది . మరి సూపర్ హీరో సినిమా కథ ఎలా ఉండబోతోంది? ఈ సినిమాలో ఎవరు నటించబోతున్నారనే విషయాలపై ఎంతో ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ఇక లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రస్తుతం రాఘవ లారెన్స్ బెంజ్ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. లోకేష్ కార్తి హీరోగా నటించిన ఖైదీ సినిమాతో తన సినిమా యూనివర్స్ క్రియేట్ చేశారు. విక్రమ్ సినిమాని ఖైదీతో లింక్ చేస్తూ చివరిలో రోలెక్స్ పాత్రతో సూర్యను కూడా ఈ యూనివర్స్ లోకి భాగం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు లోకేష్ తో అమీర్ ఖాన్ భాగస్వామ్యం కావటం మరింత ఆసక్తిని కలిగిస్తుంది.