E-Paper
Advertisement

అక్కడ హోటళ్లకు ఉద్యోగులు దొరక్క.. రోబోలతో పని కానిచ్చేస్తున్నారు!

అక్కడ హోటళ్లకు ఉద్యోగులు దొరక్క.. రోబోలతో పని కానిచ్చేస్తున్నారు!
Advertisement

Hotel Staff Shortage: జపాన్‌ లో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, అక్కడి హోటళ్లు, రిసార్ట్‌ లు, ఇతర స్టే ప్లేసెస్ తీవ్రమైన ఉద్యోగుల కొరతను ఎదుర్కొంటున్నాయి. తాజాగా అక్కడి ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, దేశంలోని 70 శాతానికి పైగా హోటల్స్ సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నాయి. పర్యాటకులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నాయి.

ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం జపాన్ లో ఈ సమస్య ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు అర్థం అవుతోంది. ఉద్యోగుల కొరత కారణంగా ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది మీద ఎక్కువ పని భారం పెరుగుతోందని, దాంతో చాలామంది ఉద్యోగాలను వదిలి వెళ్లే పరిస్థితి ఏర్పడుతోందని నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, కొనసాగితే పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఎందుకు ఈ పరిస్థితి తలెత్తింది?

Advertisement

ఈ ఏడాది డిసెంబర్, జనవరి మధ్య ప్రభుత్వం 522 హోటళ్లు, స్టే సెంటర్స్ మీద ప్రభుత్వం సర్వే నిర్వహించింది. అందులో 72.2 శాతం సంస్థలు తమకు ఉద్యోగుల కొరత ఉందని తెలిపాయి. ముఖ్యంగా సెలవుల సీజన్, పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో ఈ సమస్య మరింత తీవ్రమవుతోందని వెల్లడించాయి. ఈ సమస్యకు ప్రధాన కారణాల్లో ఒకటి జపాన్‌ లో జనాభా తగ్గిపోవడం. అక్కడ జననాల రేటు క్రమంగా పడిపోతుండగా, వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. దీంతో పని చేసే వయస్సులో ఉన్న వారి సంఖ్య తగ్గుతోంది. మరోవైపు తయారీ రంగంతో పోలిస్తే హోటళ్లు, సేవారంగంలో జీతాలు తక్కువగా ఉండటంతో యువత ఈ రంగంపై ఆసక్తి చూపడం లేదు.

రోబోట్లపై ఆధారపడుతున్న హోటళ్లు

ఇప్పటివరకు కఠినమైన వలస విధానాలు అమలు చేసిన జపాన్, ప్రస్తుతం విదేశీ కార్మికులకు కొంత మేర అవకాశాలు కల్పిస్తోంది. అయినప్పటికీ, ఉద్యోగుల కొరత పూర్తిగా తీరడం లేదు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, హోటళ్లు మరింతగా సాంకేతికతను వినియోగించాలని ప్రభుత్వం సూచించింది. ఆటోమేటిక్ చెక్ ఇన్ వ్యవస్థలు, రోబోట్ల ద్వారా ఫుడ్ సర్వీస్, డిజిటల్ సర్వీసులు చేయిస్తున్నారు. ఇలా చేస్తే ఉద్యోగులపై భారం తగ్గడంతో పాటు, సేవల నాణ్యత కూడా మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మెరుగైన సేవలు అందితే పర్యాటకుల సంఖ్య పెరిగి, హోటళ్ల ఆదాయం కూడా పెరుగుతుంది. ఆ అదనపు ఆదాయంతో ఉద్యోగులకు మెరుగైన వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాదు, జపాన్ కరెన్సీ యెన్ విలువ అమెరికా డాలర్‌ తో పోలిస్తే బలహీనపడటంతో విదేశీ పర్యాటకులకు జపాన్ పర్యటన చౌకగా మారింది. దీంతో గత కొంతకాలంగా విదేశీ సందర్శకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. 2030 నాటికి విదేశీ పర్యాటకుల సంఖ్యను 6 కోట్లకు పెంచాలని జపాన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ముందుగా ఉద్యోగుల కొరత సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Read Also: 15 నిమిషాల ఓవర్‌ టైమ్‌ కూ జీతం.. ఆ దేశంలో జాబ్ ఇంత బాగుంటుందా?

Related News

హిమాలయాల్లో రైల్వే అద్భుతం.. 2029 నాటికి మంచు కొండలను చీల్చుకుంటూ రైలు ప్రయాణం!

ఇండియన్ రైల్వేలో రారాజు.. ఈ ట్రైన్ వస్తే మిగతావన్నీ పక్కకు వెళ్లాల్సిందే!

అందాల రాణి క్లియోపాత్రా ఎలా చనిపోయింది? ఇప్పటికీ మిస్టరీనే!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

500 ఏళ్ల నాటి సమాధి తెరవగానే వరుస మరణాలు.. రాజు శాపమే ప్రాణాలు తీసిందా?

బ్రిటిష్ ఇంజనీరింగ్ అద్భుతాలు.. దేశానికే గర్వకారణమైన 7 వింటేజ్ రైల్వే స్టేషన్లు!

ప్రపంచంలోనే అత్యంత అందమైన స్మశానవాటిక, ఇక్కడ సమాధులు కూడా కళాఖండాలే!

మాజీ ప్రేమికులు కలిసే స్పెషల్ మార్కెట్.. భార్యలే ‘వెళ్లి రా’ అంటారట!

Big Stories

Advertisement
×