E-Paper
Advertisement

మాన్సూన్ గోవా ట్రిప్.. అస్సలు మిస్ కాకూడని 7 క్రేజీ స్పాట్స్ ఇవే!

మాన్సూన్ గోవా ట్రిప్.. అస్సలు మిస్ కాకూడని 7 క్రేజీ స్పాట్స్ ఇవే!
Advertisement

Goa Monsoon Travel Guide: వర్షాకాలం వస్తే గోవా మరింత అందంగా మారిపోతుంది. సాధారణంగా బీచ్‌ లకు పాపులర్ అయిన ఈ రాష్ట్రం, వానల సమయంలో పచ్చని ప్రకృతి, పొగమంచు, జలపాతాలతో సందర్శకులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులకు, ఫోటోగ్రఫీ ఇష్టపడేవారికి, ప్రశాంతమైన టూర్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి గోవా ఈ సీజన్‌ లో మరింత ప్రత్యేకంగా ఉంటుంది. ఒకవేళ ఈ వర్షాకాలంలో గోవా టూర్ ప్లాన్ చేస్తుంటే, అక్కడ తప్పకుండా ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిన 7 స్పెషల్ ప్లేసెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

దూధ్‌ సాగర్ జలపాతం

వర్షాకాలంలో గోవాలో ఎక్కువ మంది పర్యాటకులు వెళ్లే ప్రదేశాల్లో దూధ్‌ సాగర్ జలపాతం మొదటి స్థానంలో ఉంటుంది. మాండోవి నదిపై ఉన్న ఈ నాలుగు పాయల జలపాతం వర్షాల సమయంలో భారీగా ప్రవహిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. కులేం నుంచి ఈ ప్రాంతానికి చేరుకోవచ్చు.

సావో జోవావో ఫెస్టివల్

Advertisement

ప్రతి ఏడాది వర్షాకాలంలో జరిగే సావో జోవావో ఫెస్టివల్ గోవా ప్రత్యేకతల్లో ఒకటి. ఈ సందర్భంగా స్థానికులు రంగురంగుల పూలు, పండ్లతో చేసిన కిరీటాలు ధరించి ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. వర్షాలకు కృతజ్ఞతగా బావులు, చెరువుల్లోకి దూకడం ఈ పండుగలో స్పెషల్ అట్రాక్షన్.

చోర్లా ఘాట్ అందాలు

గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న చోర్లా ఘాట్ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది. పచ్చని అడవులు, పొగమంచుతో కప్పుకున్న కొండలు, చిన్న చిన్న జలపాతాలు ఈ ప్రాంతాన్ని ప్రకృతి స్వర్గంలా మార్చేస్తాయి. రోడ్ ట్రిప్ చేయాలనుకునేవారికి ఇదో బెస్ట్ ప్లేస్.

ఫొంటైన్హాస్‌ లో వాకింగ్  

Advertisement

పంజిమ్‌ లోని చారిత్రాత్మక ఫొంటైన్హాస్ ప్రాంతం వర్షాల సమయంలో మరింతగా ఆకట్టుకుంటుంది. పోర్చుగీస్ స్టైల్ లో నిర్మించిన రంగురంగుల ఇళ్లు, తడిసిన రాతి వీధులు ఫోటోగ్రఫీకి అనుకూలంగా ఉంటాయి.

నేత్రవాలి సరస్సు

దక్షిణ గోవాలోని నేత్రవాలి అభయారణ్యం ప్రకృతి ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ బుడగలు వచ్చే సరస్సు. ఈ సరస్సులో సహజంగానే నీటిలో బుడగలు పైకి రావడం సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చుట్టూ ఉన్న అడవులు, చిన్న జలపాతాలు ఈ ప్రాంతానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి.

కాబోడి రామా కోట

చరిత్రను ఇష్టపడేవారు కనకోనాలోని కాబోడి రామా కోటను తప్పకుండా చూడాలి. కొండపై ఉన్న ఈ కోట నుంచి అరేబియా సముద్రం, పచ్చని కొండల అందాలు ఒకేసారి కనిపిస్తాయి. వర్షాకాలంలో ఈ దృశ్యాలు మరింత అందంగా ఉంటాయి.

ప్రశాంతమైన బీచ్‌ లు

వర్షాకాలంలో సముద్రం ఉధృతంగా ఉండటంతో స్విమింగ్ కు పర్మీషన్ ఉండకపోవచ్చు. అయినప్పటికీ పలోలెం, అగోండా, బట ర్‌ఫ్లై బీచ్ లాంటి ప్రాంతాలు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. సముద్ర అలలను చూస్తూ వేడి టీ తాగుతూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఇవి మంచి ప్రదేశాలు. వర్షాకాలంలో పచ్చని ప్రకృతి, అద్భుతమైన జలపాతాలు, ప్రత్యేకమైన పండుగలు, చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రశాంతమైన బీచ్‌ లు కలిసి గోవా టూర్ ను మర్చిపోలేని ఎక్స్ పీరియెన్స్ అందిస్తుంది.

Read Also: వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

Related News

వర్షాకాలంలో మేఘాలయకు వెళ్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు!

ఇండియన్ బుల్లెట్ రైలు లాంచ్ డేట్ ఫిక్స్.. స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

రైలు బోగీలో పూజలు.. అసలు రైల్వేలో ఏమి జరుగుతోంది?

అడవిలో రైలు ప్రయాణం.. ప్రకృతి ప్రేమికులకు స్పెషల్ సఫారీ ట్రైన్

భారీగా తగ్గిన దుబాయ్, అబుధాబి విమాన టికెట్లు.. ఇండియా నుంచి రిటర్న్ టికెట్ రూ.27000

మీ బైక్‌లో E20 పెట్రోల్ కొట్టిస్తున్నారా? ఈ నిజాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!

కప్పలకు అండర్‌ పాస్‌ లు నిర్మిస్తున్న ఫ్రాన్స్.. భలే ఐడియా గురూ!

Big Stories

Advertisement
×