E-Paper
Advertisement

Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

Road Encroachments: సర్కారు భూమిలో అక్రమ గోడ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!
Advertisement

Road Encroachments: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట్ మున్సిపాలిటీ 4వ వార్డు పరిధిలోని సర్వే నంబర్లు 374, 375లో ఉన్న 22 అడుగుల నక్షా (గొలుసు) రోడ్డుపై ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్బర్జపేట నుంచి రాజ్‌బొల్లారం గ్రామానికి వెళ్లే ఈ నక్షా రోడ్డు గ్రామానికి అత్యంత కీలకమైన మార్గమని వారు పేర్కొంటున్నారు.

అక్రమంగా నిర్మాణం..

స్థానికుల ఆరోపణల ప్రకారం రోడ్డు స్థలంలో గోడ నిర్మాణం చేపట్టి ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ విషయమై గతంలోనే మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: మనుషులను బంగారంగా మార్చే శాపం… ఓటీటీలో దుమ్మురేపుతున్న తెలుగు సినిమా

గ్రామస్ధులు డిమాండ్..

ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న 22 అడుగుల నక్షా రోడ్డును పరిరక్షించి, వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలను తొలగించాలని గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేశారు. ఆలస్యం చేస్తే ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజు, ప్రదీప్ రెడ్డి, సుధాకర్, బాలరాజు, వెంకటేష్, రవి, రాము, వీరేశ్, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also read: త‌న శిష్యుల‌కే అవ‌కాశాలు ఇచ్చి, టీమిండియాను నాశ‌నం చేస్తున్నాడు!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×