BigTV English

Kashmir Rail Link: ప్రధాని చేతుల మీదుగా జమ్మూ రైల్వే డివిజన్‌ ప్రారంభం, కాశ్మీర్ లో మరింత పెరగనున్న రైల్వే కనెక్టివిటీ!

Kashmir Rail Link: ప్రధాని చేతుల మీదుగా జమ్మూ రైల్వే డివిజన్‌ ప్రారంభం, కాశ్మీర్ లో మరింత పెరగనున్న రైల్వే కనెక్టివిటీ!

Indian Railways: కేంద్ర ప్రభుత్వం జమ్మూకాశ్మీర్ లో రైల్వే కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతున్నది. ఓవైపు ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ ను నిర్మించడంతో పాటు మరోవైపు జమ్మూ రైల్వే డివిజన్ ను ప్రారంభించబోతున్నది. కొత్తగా ఏర్పాటు చేసిన జమ్మూ రైల్వే డివిజన్‌ను జనవరి 6న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌ లోని కొన్ని ప్రాంతాల్లో రైలు కనెక్టివిటీని మెరుగుపరచడంలో ఈ రైల్వే డివిజన్ కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుతం కాశ్మీర్ లో సంగల్దాన్- బారాముల్లా వరకే రైల్వే కనెక్టివిటీ ఉంది. ఇకపై ఈ రైల్వే కనెక్టివిటీ మరింత విస్తరించనుంది.


హైటెక్ సౌకర్యాలతో జమ్మూ రైల్వే డివిజన్‌ ఏర్పాటు  

రైల్వే అధికారులు ఇప్పటికే జమ్మూ రైల్వే డివిజన్ ఫిరోజ్‌ పూర్ డివిజన్ నుంచి వేరు చేశారు. జమ్మూ రైల్వే డివిజన్ లో హైటెక్ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలు,  టన్నెల్స్, బ్రిడ్జిలతో సహా అత్యాధునిక సౌకర్యాలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో ఈ రైల్వే డివిజన్ ను తీర్చిదిద్దారు. జమ్మూ రైల్వే డివిజన్ ప్రారంభం తర్వాత  జమ్మూకాశ్మీర్ ప్రాంతం అంతటా సురక్షితమైన, సమర్థవంతమైన రైల్వే కార్యకలాపాలు కొనసాగనున్నాయి.


డిపెండెన్సీని తగ్గి, కనెక్టివిటీ పెరిగే అవకాశం    

జమ్మూ రైల్వే డివిజన్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్‌లోని పఠాన్‌ కోట్ ఫిరోజ్‌ పూర్ డివిజన్‌ లో భాగంగా ఉంది. ఇకపై జమ్మూ రైల్వే డివిజన్ అందుబాటులోకి వస్తే, ప్రాంతీయ కనెక్టివిటీ మరింత పెరగనుంది. జమ్మూకాశ్మీర్ లో రవాణా సేవలను మెరుగుపడటంతో పాటు ఆర్థిక వృద్ధితో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి తోడ్పడనుంది.  ప్రయాణీకులు, వ్యాపారాల సేవలు మరింత పెరగనున్నాయి. మోడీ ప్రారంభించబోయే ఈ రైల్వే డివిజన్ జమ్మూకాశ్మీర్ లోని ప్రాంతీయ అభివృద్ధిని పెంచడానికి సాయపడనుంది.

కత్రా-రియాసి విభాగంలో ట్రయల్ రన్

అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ సైతం ప్రారంభానికి రెడీ అవుతోంది. ఈ రైల్వే లింక్ లోని కీలకమైన 18 కిలోమీటర్ల సెగ్మెంట్ కత్రా-రియాసీ సెక్షన్‌ లో ప్రస్తుతం ట్రయల్ రన్‌  సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ట్రాక్ స్థిరత్వం, టన్నెల్ వెంటిలేషన్ సిస్టమ్‌,  సిగ్నలింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ సహా ఇతర అవసరమైన సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. కాశ్మీర్ లోయకు దేశంలోని ఇతర ప్రాంతాలతో మెరుగైన కనెక్టివిటీని పెంచడంలో ఉధంపూర్- శ్రీనగర్- బారాముల్లా రైల్వే లింక్ కీలక పాత్ర పోషించనుంది. ఈ రైల్వే లింక్ ప్రపంచంలోనే అత్యంత సవాళ్లతో కూడిన రైల్వే లింక్ గా గుర్తింపు తెచ్చున్నది. ప్రకృతి సవాళ్లను ఎదుర్కొంటూ అద్భుతమైన రైల్వే బ్రిడ్జిలు, టన్నెల్స్ ద్వారా ఈ రైల్వే లైన్ ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా గుర్తింపు తెచ్చుకున్న చీనాబ్ రైల్వే బ్రిడ్జి కూడా ఇదే లైన్ లో ఉంది. కత్రా-రియాసి నడుమ ఏర్పాటు చేసిన రైల్వే కేబుల్ బ్రిడ్జి కూడా భారతీయ ఇంజినీరింగ్ అద్భుతంగా నిలుస్తోంది. ఈ ప్రతిష్టాత్మక ఈ రైల్వే లింక్ ను రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ప్రారంభించనున్నట్లు తెలుస్తున్నది.

Read Also: వందే భారత్ స్లీపర్ రైలు.. టెస్టింగ్‌లో ఎంత వేగంగా దూసుకెళ్లిందో తెలుసా? ఇదిగో వీడియో!

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×