Salman Khan:సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు ఎప్పుడు ప్రేమలో పడతారో తెలియదు. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియదు. కానీ కొంతమంది చిన్న చిన్న తగాదాలకే మనస్థాపం చెంది విడాకులు తీసుకొని దూరం అవుతారు. అయితే అలా విడాకులు తీసుకునే సమయంలో వారికి పిల్లలు కలగకముందే విడాకులు తీసుకుంటే ఈ ప్రభావం ఎవరిమీద పడదు. కానీ పిల్లల పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటే మాత్రం ఆ ప్రభావం పిల్లలపై పడుతుందనటంలో సందేహం లేదు. అయితే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు పిల్లలు పుట్టిన తర్వాత విడాకులు తీసుకుంటే, ఇంకొంతమంది అదే పిల్లలు పెళ్లీడుకొచ్చిన తర్వాత విడాకులు తీసుకొని ఆశ్చర్య పరుస్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రుల విడాకులు.. ఆ పిల్లలను ఎంత మానసిక వేదనకు గురి చేస్తున్నాయో అర్థం చేసుకోవడం లేదు..
రెండేళ్ల క్రితమే విడాకులు తీసుకున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు..
ఈ క్రమంలోనే ఒక స్టార్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం వల్ల ఆ ప్రభావం పిల్లలపై పడిందట. దీంతో గమనించిన ఆ జంట.. తమ తప్పును సరిదిద్దుకొని భార్యాభర్తలుగా విడిపోయినా.. తల్లిదండ్రులుగా కలిసే ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇక వారెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ (Salman Khan)తమ్ముడు సోహైల్ ఖాన్(Sohail Khan ) అతడి భార్య సీమా సజ్డే (Seema Sajde). తమ 24 ఏళ్ల దాంపత్య జీవితానికి స్వస్తి పలికారు. అయితే విడాకుల తర్వాత పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సీమా చెప్పుకొచ్చింది. ఈ సంక్షోభం పిల్లలపై ప్రభావం చూపినప్పటికీ వారు తమ ప్రేమను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అని కూడా ఆమె తెలిపింది. ఇకపోతే ఈ జంటకు నిర్వాణ, యోహాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక వీరి విడాకుల ప్రభావం వీళ్ళిద్దరిపైన పడిందని సీమా బహిరంగంగానే ఒప్పుకుంది.
విడాకుల తర్వాత పిల్లల గురించి స్పందించిన సీమా..
2022లో ఈ జంట విడిపోగా.. తాజాగా సీమా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందించింది. సీమా మాట్లాడుతూ.. “ఎక్కడైనా సరే భార్యాభర్తలు విడిపోతే ఆ ప్రభావం పిల్లలపై పడుతుంది. వాస్తవానికి పిల్లల్లో తప్పు ఏమీ లేదు. తమ తల్లిదండ్రులు విడాకులు తీసుకోవాలని ఏ పిల్లలు కూడా కోరుకోరు. అదే సమయంలో ప్రజలు పిల్లలని బాధ్యులుగా చూస్తారు. కానీ ఇక్కడ నిజం ఏమిటంటే, తల్లిదండ్రులుగా మీ పిల్లలు పెద్దయ్యాక, ప్రేమను తెలుసుకోవాలని, అనుభూతి చెందాలని మీరు కూడా కోరుకుంటారు. బాధాకరమైన విడాకులు ఏ పిల్లలకైనా సరే మంచిది కాదు. ముఖ్యంగా పిల్లలను మంచి వాతావరణంలో పెంచడం అనేది తల్లిదండ్రుల బాధ్యత. అందుకు వారి మానసిక స్థితి కూడా బాగుండాలి. నువ్వు సంతోషంగా లేకుంటే నీ పిల్లల్ని కూడా నువ్వు సంతోషం పెట్టలేవు. నా మూడ్ బాగోలేకపోతే నేను ఎప్పుడూ చిరాకు పడతాను. అదే చిరాకు, కోపం నా పిల్లలపై పరోక్షంగా చూపించాల్సి వస్తుంది. కానీ నా మనసు ప్రశాంతంగా ఉంటే వారిని మరింత సంతోషపరచగలను. వైవాహిక బంధంలో ఎప్పటికీ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు, వ్యక్తులు, ఎప్పుడూ ఒకేలా ఉండరు. కాబట్టి కాలంతో పాటు మనిషి కూడా మారుతున్నారు. జీవితంలో ఎన్నో తప్పులు జరుగుతాయి. కానీ పిల్లల విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలో కలిసి ఉండాలి. ఇప్పటికీ మేము విడిపోయినా.. కుటుంబంలా కలిసే ఉన్నాము” అంటూ సీమా చెప్పుకొచ్చింది.ఏది ఏమైనా పిల్లలపై ప్రభావం పడుతుందని గమనించారు కాబట్టి ఈ జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.