Vande Bharat Sleeper Trains Trials: దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో పలు రకాల టెస్టులు చేస్తున్నారు. డిసెంబర్ 31 నుంచి ఢిల్లీ-ముంబై రైల్వే ట్రాక్ పై ట్రయల్స్ నిర్వహించారు. తాజాగా రైలు గరిష్ట వేగాన్ని పరిశీలించారు. ఈ రైలు గంటలకు గరిష్టంగా 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ స్పీడ్ టెస్టుకు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వాటర్ గ్లాస్ లో నీళ్లు ఉంచి మరీ..
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేసిన ఈ వీడియోలో వందేభారత్ స్లీపర్ రైలు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. ఓ వైపు రైలు స్పీడ్ ను చూపించేలా మోబైల్ ఫోన్, మరోవైపు గ్లాస్ లో నిండా నీళ్లు పోసి స్పీడ్ టెస్ట్ చేశారు. రైలు గరిష్ట వేగంతో ప్రయాణించనప్పటికీ గ్లాస్ లోని నీళ్లు చుక్క కూడా కింద పడలేదు. మోబైల్ కూడా ఏమాత్రం కదలకుండా అలాగే ఉంది. ఈ రైలు స్పీడ్ టెస్ట్ రాజస్థాన్ లోని కోటా రైల్వే డివిజన్ లో కొనసాగించారు.
Vande Bharat (Sleeper) testing at 180 kmph pic.twitter.com/ruVaR3NNOt
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) January 2, 2025
వేగం 130 కిలో మీటర్ల నుంచి 180 కిలో మీటర్లకు పెంపు
ఇక ఈ రైలుకు సంబంధించిన స్పీడ్ టెస్టులు డిసెంబర్ 31 నుంచి కోటా డివిజన్ లో కొనసాగుతున్నాయి. రోహల్ ఖుర్ద్- చౌమహ్లా మధ్య తొలుత వందే భారత్ స్లీపర్ ప్రయాణికులతో సమానమైన బరువుతో ట్రయల్స్ కొనసాగాయి. మొదట్లో 130, తర్వాత 140, 150 స్పీడ్ తో ట్రయల్ జరిగాయి. జనవరి 1న 160 వేగంతో ట్రయల్స్ చేశారు. ఆ తర్వాత రోహల్ ఖుర్ద్- విక్రమ్ ఘర్ లో 177 వేగంతో టెస్ట్ రన్ చేశారు. చివరగా రోహల్ ఖుర్ద్- కోటా మధ్య 40 కిలో మీటర్ల దూరంలో 180 కి.మీ వేగంతో రైలు ట్రయల్ చేశారు. వందేభారత్ స్లీపర్ టెస్టింగ్ మూడో రోజు కోటా- లాబన్ మధ్య 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణీకుల సమాన బరువును తీసుకెళ్తూ 180 కి.మీ వేగంతో దూసుకెళ్లింది. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని పరీక్షల్లోనూ సక్సెస్ అయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. మరికొద్ది రోజుల్లో ట్రయల్స్ పూర్తవుతాయని వెల్లడించారు.
🚨 India's fastest train, 1st prototype of Vande Bharat Sleeper is now undergoing high-speed trial runs at Kota, Rajasthan. pic.twitter.com/o4QoBGXdgG
— Indian Tech & Infra (@IndianTechGuide) January 2, 2025
తొలి వందేభారత్ నడిచేది ఆ రూట్ లోనే!
వందేభారత్ స్లీప్ రైలు ప్రపంచ స్థాయి సౌకర్యాలతో పాటు గంటకు 180 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లనుంది. తొలి వందేభారత్ స్లీపర్ రైలు 16 కోచ్ లను కలిగి ఉంటుంది. ఇందులో 11 AC 3 టైర్ కోచ్‌లు, 4 AC 2 టైర్ కోచ్‌లు, ఒక AC ఫస్ట్ క్లాస్ కోచ్ ఉంటుంది. సీటింగ్‌తో పాటు లగేజీ కోసం 2 బోగీలు అందుబాటులో ఉంటయి. మొత్తం 16 కోచ్‌ల లో మొత్తం 823 మంది ప్రయాణీకులు జర్నీ చేయనున్నారు. AC 3 టైర్ లో 611 బెర్త్ లు, AC 2 టైర్ లో 188 బెర్త్ లు, AC 1లో 24 బెర్త్ లు ఉంటాయి. దేశంలో తొలి వందేభారత్ స్లీపర్ రైలు న్యూఢిల్లీ-శ్రీనగర్ నడుమ తన సేవలు కొనసాగించే అవకాశం ఉంది.
🚨 Vande Bharat Sleeper hits 180 kmph during trial run on Kota-Nagda section.
(Source –@trainwalebhaiya) pic.twitter.com/mJmweVXOCM
— Indian Tech & Infra (@IndianTechGuide) January 2, 2025
Read Also: ఏంటీ.. 1973లో మన రైళ్లు అంత వేగంతో ప్రయాణించేవా? మరి ఇప్పుడు?