అభివృద్ధి చెందిన, చెందుతున్న పలు దేశాల్లో రైల్వే నెట్ వర్క్ ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది. అయితే, ఇప్పటి వరకు రైలు కూత వినిపించని దేశాలు కూడా ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, నిజం. వాటిలో కొన్ని ప్రముఖ దేశాలు ఉన్నాయి. ఎందుకు ఆదేశాల్లో ఇప్పటి వరకు రైల్వే వ్యవస్థ ఏర్పడలేదో చూద్దాం..
రైల్వే నెట్ వర్క్ లేని దేశాలు ఇవే!
⦿భూటాన్
భూటాన్ తూర్పు హిమాలయాల్లో విస్తరించి ఉంటుంది. ఈ దేశం రైల్వే లైన్ల నిర్మాణానికి అనుకూలంగా ఉండదు. ఎత్తైన పర్వతాలు, పెద్ద లోయలు ఉంటాయి. పరిమిత పరిధిలోనే చదునైన భూమి ఉంటుంది. అందుకే ఇక్కడ రైల్వే నెట్ వర్క్ నిర్మాణం అనేది సాధ్యం కాదని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే రైల్వే లైన్లకు బదులుగా.. రోడ్డు రవాణా వ్యవస్థను డెవలప్ చేస్తున్నారు.
⦿పుపువా న్యూ గినియా
పుపువా న్యు గినియా ద్వీపాలు, దట్టమైన అరణ్యాలను కలిగి ఉంటుంది. రైల్వే లైన్లను ఇక్కడ నిర్మించడానికి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే పరిమిత స్థాయిలో రోడ్డు రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఎయిర్ లైన్స్, సముద్ర రవాణాపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
⦿ మాల్దీవులు
మాల్దీవులు హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉంటుంది. ప్రపంచంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా కొనసాగుతోంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు రైల్వే నిర్మాణానికి అనుకూలంగా లేదు. ఇక్కడ ప్రధానంగా ద్వీపాల మధ్య రవాణా కోసం సీ ప్లేన్లు, బోట్లను వినియోగిస్తారు.
⦿ యెమెన్
ఆర్థిక ఇబ్బందులు, భౌగోళిక రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యెమెన్ లోనూ ఇప్పటి వరకు రైల్వే లైన్ లేదు. అక్కడ నిత్యం ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి తీవ్ర ఆటంకం ఏర్పడుతున్నది. ఇక్కడ ప్రజా రవాణా కోసం రోడ్డు రవాణాను ఉపయోగిస్తున్నారు.
⦿ఐస్లాండ్
ఐస్‌లాండ్ అద్భుతమైన ప్రదేశం. కానీ రైల్వే నెట్‌వర్క్ లేదు. అగ్నిపర్వతాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ రైల్వే లైన్లు నిర్మించలేకపోతున్నారు. ఐస్‌లాండ్ లో ఎక్కువగా రోడ్డు రవాణాను ఉపయోగిస్తున్నారు.
⦿ అండోరా
ప్రపంచంలోని అతి చిన్న దేశాల్లో ఒది ఒకటి. ఇక్కడ కూడా రైల్వే నెట్ వర్క్ లేదు. ఈ దేశ సరిహద్దుల్లో.. ఫ్రెంచ్ రైల్వే కనెక్షన్ ఉన్నప్పటికీ ఇక్కడ లేదు.
⦿సైప్రస్
సైప్రస్ ద్వీపంలోనూ 1851 నుంచి 1905 వరకు రైల్వే నెట్‌వర్క్ ను కలిగి ఉంది. కానీ, ఆర్థిక నష్టాల కారణంగా మూసివేశారు. ఆ తర్వాత రైల్ లైన్ పొడిగింపును సైప్రస్ మైన్ కార్పొరేషన్ ప్రారంభించింది. 1974లో మళ్లీ మూసివేశారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా బస్సుల్లో ప్రయాణం చేస్తారు.
⦿ మొనాకో
మొనాకో అనేది ఓ చిన్న సంస్థానం. ఇది ఫ్రెంచ్ రివేరాలో ఉంది. అత్యంత విలావంతమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులు రైల్వేలైన్ల నిర్మాణానికి అనుకూలంగా లేదు. ఇక్కడి ప్రజలు బస్సులు, టాక్సీల ద్వారా ఎక్కువగా ప్రయాణం చేస్తారు.
Read Also: మిడిల్ బెర్త్ లో జర్నీ చేస్తున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!