Indian Railways: భారతీయ రైల్వేలో పలు రకాల కోచ్ లు ఉంటాయి. స్లీపర్ క్లాస్ లో మూడు రకాల బెర్తులు ఉంటాయి. అప్పర్, మిడిల్, లోయర్. ఇందులో లోయర్, అప్పర్ బెర్తులతో పోల్చితే మిడిల్ బెర్త్ లో జర్నీ చేసే వాళ్లు కొన్ని ప్రత్యేకమైన విషయాలను గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పాలంటే మిడిల్ బెర్త్ కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన రూల్స్ ఉన్నాయి. ఇంతకీ అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
మిడిల్ బెర్త్ నిబంధనలు
⦿ అప్పర్, లోయర్ బెర్తుల మధ్యలో మిడిల్ బెర్త్ ఉంటుంది. ఈ బెర్త్ ను సాధారణంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో సదరు ప్రయాణీకుడు అందులో పడుకునే అవకాశం ఉంటుంది.
⦿ మార్నింగ్ 6 తర్వాత మిడిల్ బెర్త్ ను మడిచి పెట్టాల్సి ఉంటుంది. అలా చేస్తేనే, లోయర్ బెర్త్ మీద కూర్చునే అవకాశం ఉంటుంది. డే టైంలో ఎట్టిపరిస్థితుల్లోనూ మిడిల్ బెర్త్ యూజ్ చేయడానికి లేదు.
⦿ మిడిల్ బెర్త్ క్లోజ్ చేసిన తర్వాత లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్ ప్రయాణీకులు సాధారణంగా లోయర్ బెర్త్ సీటులో కూర్చోవాల్సి ఉంటుంది.
⦿ మిడిల్ బెర్త్ లో ప్రయాణించే ప్యాసెంజర్ ఉదయం 6 గంటల తర్వాత దానిని మడవడానికి నిరాకరిస్తే, ఇతర ప్రయాణీకులకు అసౌకర్యం కలిగిస్తుంది. అలాంటి సమయంలో ఇతర ప్రయాణీకులకు మిడిల్ బెర్త్ ప్యాసింజర్‌ని మడతపెట్టమని కోరే రైట్ ఉంటుంది. ఒకవేళ తను ఒప్పుకోకపోతే రైల్వే సిబ్బందికి చెప్పాల్సి ఉంటుంది.
Read Also: గుడ్ న్యూస్.. హైదరాబాద్ to విజయవాడ జస్ట్ 4 గంటల్లోనే, ఈ రైలు వేగం ఎంతో తెలుసా?
రైల్లో పాటించాల్సిన ఇతర నిబంధనలు
రైల్లో ప్రయాణించే వాళ్లు ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకుండా వ్యవహరించాల్సి ఉంటుంది.
⦿ రైళ్లలో స్మోకింగ్, డ్రింకింగ్ అనేది నిషేధించారు. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.
⦿ ప్రయాణీకులు తమ లగేజీని లోయర్ బెర్త్ కింద లేదంటే లగేజీ రాక్‌ల మీద నిర్దేశించిన ప్రదేశాల్లో పెట్టుకోవాలి. రైల్లో ఎక్కడపడితే అక్కడ పెడతామంటే కుదరదు.
⦿ రైళ్లో రాత్రి 10 గంటల తర్వాత లైట్లు డిమ్‌గా ఉంచాలి. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకుండా సెల్ ఫోన్ మాట్లాడాలి.
⦿ రైల్వే ప్రాయాణీకులు తమ కేటాయించిన సీట్లలోనే కూర్చోవాలి. ఇతర ప్రయాణీకులు అంగీకరిస్తే సీట్లు మార్చుకునే అవకాశం ఉంటుంది.
⦿ వ్యర్థ పదార్థాలను కేవలం డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలి. రైల్లో పరిశుభ్రత పాటించాలి.
⦿ మెడికల్ ఎమర్జెన్సీ, తోటి ప్రయాణీకులు రైల్లోకి రాకపోవడం, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎమర్జెన్సీ అలారం చైన్ లాగాలి. అవసరం లేకున్న చైన్ లాగితే జరిమానా కట్టాల్సి ఉంటుంది.
ఇకపై మీరు కూడా మిడిల్ బెర్త్ లో ప్రయాణం చేస్తే, ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా వ్యవహరించండి. అటు రైల్లో ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించి ఆహ్లాదకరమైన జర్నీని ఎంజాయ్ చేయండి.
Read Also: రైలు బోగీలపై పసుపు, తెలుపు గీతలు.. ఇంతకీ వాటి అర్థం ఏంటో తెలుసా?