E-Paper
Advertisement

షాకింగ్.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా 2 విమానాలు.. తృటిలో తప్పిన పెనుముప్పు!

షాకింగ్.. ఒకే రన్‌వేపై ఎదురెదురుగా 2 విమానాలు.. తృటిలో తప్పిన పెనుముప్పు!
Advertisement

Two Flights on Same Runway: ముంబై విమానాశ్రయంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఒకే రన్‌ వేపై ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్‌ కు చెందిన రెండు విమానాలు ఒకేసారి ఉండటంతో హైటెన్షన్ నెలకొంది. అయితే, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు వెంటనే అప్రమత్తమవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

అసలేం జరిగిందంటే?

సోమవారం రాత్రి రాత్రి సుమారు 10 గంటల సమయంలో సిలిగురి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ విమానం ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. అయితే, ఆ విమానం ఇంకా రన్‌ వే మీది నుంచి పూర్తిగా వెళ్లకముందే, ఢిల్లీకి బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానం అదే రన్‌ వేపై టేకాఫ్‌ కు రెడీ అయ్యింది. పరిస్థితిని గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు వెంటనే ఎయిర్ ఇండియా విమాన సిబ్బందికి టేకాఫ్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ATC సూచనలను వెంటనే పాటించిన పైలట్లు టేకాఫ్‌ ను క్యాన్సిల్ చేసి విమానాన్ని సేఫ్ గా బే దగ్గరికి తీసుకెళ్లారు. తృటిలో పెను ప్రమాదం తప్పింది.

ఎయిర్ ఇండియా కీలక ప్రకటన

Advertisement

ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూలై 7న ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరాల్సిన AI816 విమానం, ATC ఆదేశాల మేరకు టేకాఫ్ ను క్యాన్సిల్ చేసుకున్నట్లు తెలిపింది. విమానాన్ని సేఫ్ గా బే దగ్గరికి  తీసుకెళ్లినట్లు వివరించింది. విమానాన్ని మళ్లీ ప్రయాణానికి రెడీ చేసే ముందు నిబంధనల ప్రకారం అన్ని భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు తెలింది. ప్రయాణికులను వీలైనంత త్వరగా ఢిల్లీకి పంపేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు వివరించింది.

ఢిల్లీకి వెళ్లాల్సిన AI816 విమానం బోయింగ్ 777-300ER కాగా, సిలిగురి నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ ప్రెస్ AIX1547 విమానం బోయింగ్ 737 MAX 8 మోడల్‌ కు చెందినది. అయితే ఈ రెండు విమానాల్లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. వెంటనే ATC స్పందించడం, పైలట్లు వెంటనే ఆదేశాలను పాటించడంతో ముంబై విమానాశ్రయంలో భారీ ప్రమాదం తృటిలో తప్పిందని అధికారులు తెలిపారు.

Advertisement

Read Also: హైదరాబాద్ ఎయిర్‌ పోర్ట్‌ షాకింగ్ డెసిషన్.. సెప్టెంబర్ 1 నుంచి అమలు!

Related News

విజయవాడ రైల్వే సూపర్ పెర్ఫార్మెన్స్.. రద్దీలోనూ అద్భుతం!

పట్టాలెక్కబోతున్న ఫస్ట్ ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్.. టికెట్ ధర జస్ట్ 5 రూపాయలే!

ఇండియాలోనే యూరోప్ దేశాల అందాలు.. వర్షాకాలంలో స్విట్‌జర్లాంట్, స్కాట్‌లాండ్‌ను తలపించే ప్రాంతాలు

మంచు కొండలు, ప్రశాంత నదులు, ప్రాచీన దేవాలయాలు.. ఫ్యామిలీ టూర్ కోసం నేపాల్‌ పర్ఫెక్ట్ డెస్టినేషన్

హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీ రంగం, అరుణాచలం నగరాలకు కొత్త రైలు.. పూర్తి వివరాలివిగో

రథయాత్ర, ఓనం కోసం స్పెషల్ ట్రైన్లు రెడీ.. ప్రయాణికులకు రైల్వే గుడ్ న్యూస్!

ఈ రైల్వే స్టేషన్ల పేర్లు వింటే నవ్వు ఆపుకోలేరు.. ఇంతకీ అవేంటో తెలుసా?

Big Stories

Advertisement
×