E-Paper
Advertisement

పట్టాలెక్కబోతున్న ఫస్ట్ ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్.. టికెట్ ధర జస్ట్ 5 రూపాయలే!

పట్టాలెక్కబోతున్న ఫస్ట్ ఇండియన్ హైడ్రోజన్ ట్రైన్.. టికెట్ ధర జస్ట్ 5 రూపాయలే!
Advertisement

First Indian Hydrogen Train Launch on July 17: భారతీయ రైల్వే చరిత్రలో కొత్త  శకం మొదలుకాబోతోంది. హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును జూలై 17న ప్రారంభం కాబోతోంది. ఈ రైలు హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో సేవలు ప్రారంభించనుంది. గ్రీన్ ఫ్యూయల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ పర్యావరణహిత రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.

90 కిలో మీటర్ల మార్గంలో సేవలు

ఈ రైలు జింద్ నుంచి సోనిపట్ వరకు సుమారు 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ఇదే మార్గంలో నడిచే డీజిల్ రైలుకు సుమారు రెండు గంటల సమయం పడుతుండగా, కొత్త హైడ్రోజన్ రైలు ఈ ప్రయాణాన్ని దాదాపు గంటలో పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను కూడా అందుబాటులో ఉంచారు. ఛార్జీలు రూ.5 నుంచి రూ.25 మధ్య ఉండనున్నట్లు సమాచారం.

ఒకేసారి 2,500 మంది ప్రయాణం

Advertisement

ఈ రైలులో ఒకేసారి సుమారు 2,500 మంది ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేసే ఈ రైలు డీజిల్‌ ను ఉపయోగించదు. హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య జరిగే రసాయన చర్య ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి రైలును నడుపుతారు. ఈ ప్రక్రియలో కార్బన్ ఉద్గారాలు ఉండవు. నీటి ఆవిరి, వేడి మాత్రమే విడుదల అవుతాయి. దీంతో పర్యావరణ కాలుష్యానికి తావు ఉండదు.

ఒకసారి హైడ్రోజన్ నింపితే 250 కి.మీ ప్రయాణం

ఈ రైలులో 1,200 కిలోవాట్ల సామర్థ్యం గల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వ్యవస్థను అమర్చారు. ఒకసారి హైడ్రోజన్ నింపితే సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ 27 హైడ్రోజన్ సిలిండర్లు, హైడ్రోజన్ లీకేజ్ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు, ఆధునిక మానిటరింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వీటిని నిరంతరం తనిఖీ చేస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

ఈ రైలును లక్నోలోని RDSO డిజైన్ చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)  తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.89 కోట్లుగా అంచనా వేస్తున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమవుతున్న ఈ సర్వీసు విజయవంతమైతే, భవిష్యత్తులో దేశంలోని ఇతర రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇది డీజిల్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు, ఇంధన వ్యయాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. భారత రైల్వేలో గ్రీన్ టెక్నాలజీకి ఇది కొత్త అధ్యాయంగా నిలవనుంది.

Read Also: కొంకణ్ నుంచి డార్జిలింగ్ వరకు.. వర్షాకాలంలో అస్సలు మిస్ కాకూడని అందమైన ట్రైన్ జర్నీలు!

Related News

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

భయంకర పాము ఆకారంలో గుహ.. ఎక్కడుందో తెలుసా?

దసరా, దీపావళికి ఊరెళ్తున్నారా? తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రత్యేక రైళ్లు, ఎప్పటి నుంచంటే?

బస్ డిపోకు వెళ్లాల్సిన పనిలేదు.. మీ కాలనీ నుంచే దసరా స్పెషల్ బస్సులు!

150 ఏళ్ల చరిత్ర ఉన్న నాంపల్లి స్టేషన్ గురించి మీకు తెలుసా?

కొమ్మల్లో సొమ్ము.. లక్కతో లక్.. చెట్లపై పెరిగే ఈ పురుగులతో బోలెడు ఆదాయం!

భారత్‌లో అత్యంత అందమైన రోడ్లు ఇవే.. ఒక్కసారి జర్నీ చేస్తే మళ్లీ వెళ్లాలనిపిస్తుంది!

Big Stories

Advertisement
×