E-Paper
Advertisement

Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, 850 ఇండియన్ ఫ్లైట్స్ క్యాన్సిల్!

Flights Cancelled: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, 850 ఇండియన్ ఫ్లైట్స్ క్యాన్సిల్!
Advertisement

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ మీద వైమానిక దాడులకు దిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం చీఫ్ ఖమేనీ మృతి చెందారు. అటు ఇరాన్ ప్రతిదాడులకు దిగుతుంది. అరబ్ దేశాల్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేస్తోంది. ఇప్పటి వరకు 14 స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు ఆ ప్రాంతాలకు విమాన సర్వీసులను నిలిపివేతున్నట్లు ప్రకటించింది.

850కి పైగా విమానాలు రద్దు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో శనివారం 410 విమానాలను రద్దు చేసినట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఇవాళ 444 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది.  మూడు దేశాల మధ్య సాయుధ ఉద్రిక్తతల తర్వాత మొత్తం మిడిల్ ఈస్ట్ విమాన సర్వీసులు బాగా ప్రభావితం అయ్యాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో లాంటి  పలు విమానయాన సంస్థలు మధ్యప్రాచ్యం అంతటా విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ప్రాంతీయ వైమానిక ప్రాంతాన్ని మూసివేసిన తర్వాత భారత్ నుంచి టెల్ అవీవ్‌ కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం ప్రయాణం మధ్యలో వెనక్కి తిరిగి వచ్చినట్లు ప్రకటించింది.

DGCA ఏం చెప్పిందంటే?   

Advertisement

భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (DGCA) అడ్వయిజరీ జారీ చేస్తూ, మిడిల్ ఈస్ట్, పర్షియన్ గల్ఫ్ గగనతలంలో పరిస్థితుల గురించి హెచ్చరించింది. ప్రభావిత దేశాలు, అక్కడి అధికారులు జారీ చేసిన ఏరోనాటికల్ ఇన్ఫర్మేషన్ పబ్లికేషన్స్, NOTAMలను నిశితంగా పరిశీలించాలని సూచించింది. సిరియన్, యెమెన్ గగనతలానికి సంబంధించి గతంలో జారీ చేసిన సలహాలు పూర్తిగా అమలులో ఉన్నాయని గమనించాలని ఆపరేటర్లకు సూచించింది.

భారతీయ ప్రయాణీకుల ఇబ్బందులు

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితుల కారణంగా పలువురు భారతీయ ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యప్రాచ్య ప్రాంతాలలో ఇరాన్ చేసిన క్షిపణి దాడుల తర్వాత దుబాయ్ విమానాశ్రయం మూసివేయడంతో పాటు, విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అక్కడి విమానయాన అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అనేక మంది భారతీయులు విమానాశ్రయాలలో చిక్కుకున్నారు. భారత షట్లర్ పివి సింధు కూడా ఇందులో ఉన్నారు. మంగళవారం ప్రారంభం కానున్న ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ కోసం బర్మింగ్‌ హామ్‌ కు వెళుతుండగా, కనెక్టింగ్ కోసం దుబాయ్ లో దిగింది. అయితే, ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేశారు. సింధు సహా వేలాది మంది ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. సింధు కాకుండా, భారత సీనియర్ పురుషుల జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు కూడా FIBA ​​బాస్కెట్‌ బాల్ ప్రపంచ కప్ 2027 ఆసియా క్వాలిఫైయర్స్‌ లో జరిగిన మ్యాచ్ తర్వాత ఖతార్‌ లోని దోహాలో చిక్కుకుంది.

Advertisement

Read Also: మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు, ఈ టైమ్ లో దుబాయ్‌ కి వెళ్లడం సేఫేనా?

Related News

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

చలికాలానికి ముందే మంచు అందాలను చూడాలనుందా? దేశంలో 7 అదిరిపోయే ప్లేసెస్ ఇవే!

ప్రయాణికుడి చెవిలో ఇరుక్కుపోయిన ఇయర్‌ బడ్.. రైల్వే సిబ్బంది చేసిన పనికి ప్రశంసలు!

ప్రకృతి అందాల మధ్య మరిచిపోలేని అనుభూతి.. దేశంలో 8 అద్భుతమైన రైలు ప్రయాణాలు!

అంతరిక్షంలోకి టూరిస్టులు.. అసలు ఇది సాధ్యమేనా, ఖర్చు ఎంతవుతుంది?

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×