E-Paper
Advertisement

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా.. 120 మంది విమానం మిస్సయ్యారు, అసలేం జరిగింది?
Advertisement

Milan Linate Airport: యూరోపియన్ యూనియన్ తన కొత్త నిబంధనలు ప్రవేశపెట్టిన కొద్దిరోజులకు విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫలితంగా 120 మంది ప్రయాణికులకు విమానం మిస్ అయింది. అసలేం జరిగింది? ఎలాంటి నిబంధనలు యూరోపియన్ యూనియన్ తీసుకొచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఎయిర్‌పోర్టుకు ముందుగా వచ్చినా ప్రయాణికులు ఇబ్బందులు

Advertisement

యూరోపియన్ యూనియన్ ఇటీవల విమాన ప్రయాణికులకు బోర్డింగ్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. ఆ నిర్ణయం ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. కొత్త నిబంధనల వల్ల బోర్డింగ్ సమయంలో 120 మందికి పైగా ప్రయాణికులకు తమ విమానాలను మిస్ అయ్యారు. ఇటీవల యూరప్‌లో బోర్డర్ కంట్రోల్ సిస్టమ్ అమల్లోకి తెచ్చింది.

ఈ పద్దతి వల్ల ప్రయాణికులు పాస్‌పోర్టు స్టాంపింగ్‌కు బదులు బయోమెట్రిక్, ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేయాల్సి ఉంది. ఎయిర్ పోర్టుకు ముందుగా వచ్చినా చెకింగ్ ఆలస్యమైంది. ఫలితంగా 120 మంది ప్రయాణికులు విమానం ఎక్కలేకపోయారు. మిలాన్ నుంచి మాంచెస్టర్‌కు వెళ్లేందుకు 156 మంది ట్రావెలర్లు తమ టిక్కెట్లను బుక్ చేసుకున్నారు. ప్రయాణానికి కొన్ని గంటల ముందు వారంతా విమానాశ్రయానికి చేరుకున్నారు.

Advertisement

తనిఖీల వల్ల  120 మందికి విమానం మిస్సయ్యింది, అసలేం జరిగింది?

కేవలం చెకింగ్‌కు నాలుగైదు గంటల సమయం పట్టింది. ఫలితంగా వారంతా బోర్డింగ్ గేట్‌కు చేరుకోలేదు. కొత్త నిబంధనల వల్ల 156 మంది ప్రయాణికులకు కేవలం 34 మంది పాస్‌పోర్టుల చెకింగ్ పూర్తయింది. 120 మంది చెకింగ్ పూర్తి కాలేదు. కొత్త పద్ధతి వల్ల విమానం మిస్ కావడంతోపాటు గంటల కొద్దీ లైనులో నిలబడటం వల్ల కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.

చెకింగ్ కారణంగా ప్రయాణికుల కోసం విమానాన్ని కొంత సమయం ఆపారు. అయినప్పటికీ 120 మందికి ఇబ్బంది తప్పలేదు. సరిహద్దు భద్రత నేపథ్యంలో యూరోపియన్ దేశాలు కొత్తగా ఎంట్రీ/ఎగ్జిట్ పద్దతిని తీసుకువచ్చాయి. బయో మెట్రిక్ రిజిస్ట్రేషన్, డేటా బేస్ చెకింగ్ కారణంగా విమానాన్ని ప్రయాణికులు అందుకోలేకపోయారని ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు.

ALSO READ: పొరపాటున ఆ గ్లాస్ పగిలితే అంతే.. సముద్ర గర్భంలో అత్యంత ప్రమాదకరమైన హోటల్స్!

అయితే రద్దీగా ఉండే సమయాల్లో ప్రక్రియకు ఎక్కువ సమయం తీసుకోవచ్చన్నారు. బాధితుల్లో ఒకరు మాంచెస్టర్‌కు చెందిన ఓ ఫ్యామిలీ తమ అనుభవాన్ని అంతర్జాతీయ మీడియాతో పంచుకుంది. విమానయాన సంస్థ మార్గదర్శకాలను అనుసరించి నిర్ణీత సమయానికి మూడు గంటల ముందు తాము చేరుకున్నప్పటికీ విమానం ఎక్కలేకపోయామని వివరించింది.

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×