E-Paper
Advertisement

ఇండియన్ రైల్వేలోకి కొత్త రైళ్లు, స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

ఇండియన్ రైల్వేలోకి కొత్త రైళ్లు, స్పీడ్ ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Indian Railways to Launch 220 KM: భారతీయ రైల్వే వేగం, సౌకర్యం విషయంలో మరో పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే వందే భారత్ రైళ్లతో ప్రయాణికులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్న రైల్వే శాఖ, ఇప్పుడు మరింత వేగంతో నడిచే కొత్త రైళ్లను తీసుకురావాలని నిర్ణయించింది. ఈ కొత్త రైళ్లు వందే భారత్ కంటే కూడా ఎక్కువ వేగంతో ప్రయాణించేలా రూపొందించబడుతున్నాయి.

కొత్త రైలు సెట్ల తయారీకి రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్

రైల్వే బోర్డు తాజాగా రెండు కొత్త రైలు సెట్ల తయారీకి అనుమతి ఇచ్చింది. ఈ రైళ్లు గంటకు 220 కిలోమీటర్ల డిజైన్ వేగంతో రూపొందించబడతాయి. అయితే, వాటి సాధారణ ఆపరేటింగ్ వేగం గంటకు 200 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముంది. ఇది ప్రస్తుత రైళ్లతో పోలిస్తే మరింత వేగంతో ప్రయాణించనున్నాయి. ఈ రైళ్లు 2027-28 కాలానికి సంబంధించిన కోచ్ ప్రొడక్షన్ ప్రోగ్రామ్‌ లో భాగంగా తయారు కానున్నాయి. వీటి నిర్మాణం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో జరగనుంది. భారతీయ రైల్వేలో ప్రముఖ తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ఫ్యాక్టరీ, ఆధునిక సాంకేతికతతో ఈ రైళ్లను రూపొందించనుంది.

ప్రతి రైల్లో 16 కోచ్ లు

ప్రతి రైలులో 16 కోచ్‌లు ఉండేలా ప్లాన్ చేశారు. ఇవి బ్రాడ్ గేజ్ ట్రాక్‌లపై నడిచేలా డిజైన్ చేయబడతాయి. వేగంతో పాటు ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. కొత్త టెక్నాలజీ, మెరుగైన సీటింగ్, భద్రతా వ్యవస్థలు వంటి అంశాలు ఇందులో ఉండే అవకాశముంది.

Read Also: ప్రయాణీకులకు షాక్.. విజయవాడ, విశాఖ రూట్లలో 15 రైళ్లు రద్దు!

వందేభారత్ రైళ్ల వేగాన్ని తలదన్నేలా..

వందే భారత్ రైళ్లు ఇప్పటికే సెమీ-హై స్పీడ్ విభాగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ కొత్త రైళ్లు ఆ స్థాయిని మరింత ముందుకు తీసుకెళ్లనున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్ట్‌ ను రూపొందిస్తున్నారు. ఈ రైళ్లు అమల్లోకి వస్తే, దేశంలో రైలు ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. ముఖ్యంగా కీలక  నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ప్రయాణికులకు సమయం ఆదా అవుతుండటమే కాకుండా, రైల్వే మరింత పోటీని కనబకచనున్నాయి. ఈ కొత్త 220 కిలోమీటర్ల వేగంతో నడిచే రైళ్లు భారతీయ రైల్వేలకు మరో మైలురాయిగా నిలవనున్నాయి. వేగం, సౌకర్యం, భద్రత మేళవింపుతో ఈ రైళ్లు భవిష్యత్ రైలు ప్రయాణానికి కొత్త దిశను చూపనున్నాయి.

Read Also: పాండిచేరిలో ఫారినర్స్ ప్రపంచం, పైసా ఖర్చులేకుండా వారితో కలిసి హ్యాపీగా బతికేయొచ్చు

Tags

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×