E-Paper

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

పాకిస్తాన్ కు అవ‌మానం..బ‌స్సు దిగుతుండ‌గా ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు
Advertisement

Women’s T20 World Cup 2026:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (PAKISTAN Vs Team INDIA CLASH )  మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఎడ్జ్ బస్టన్ వేదికగా ( Edgbaston, Birmingham)  ఈ రెండు జట్ల మధ్య కాసేపటికి క్రితమే మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన టీమిండియా, బ్యాటింగ్ కు దిగింది. అయితే ఈ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ జట్టుకు ఘోర అవమానం ఎదురయింది. ఎడ్జ్ బస్టన్ స్టేడియానికి చేరుకున్న పాకిస్తాన్ ప్లేయర్లు… బస్సు దిగుతుండగా ఆసక్తికర సంఘటన జరిగింది. ప్లేయర్లు బస్సు దిగుతుండగానే, ఇండియన్ అభిమానులు దారుణంగా అవమానించారు. ఇండియా జీతేగా ( India Jeetegi ) అంటూ పాకిస్తాన్ క్రికెటర్ల ముందే రచ్చ రచ్చ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Also Read: Women’s T20 World Cup 2026 ENG VS SL: 23 రోజుల కింద తల్లి అయింది..ఇప్పుడు సెంచ‌రీతో ఇర‌గ‌దీసిన లెస్బియ‌న్ క్రికెట‌ర్

పాకిస్తాన్ కు అవ‌మానం..ఇండియ‌న్ ఫ్యాన్స్ నినాదాలు

Advertisement

మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఆదివారం మహిళల టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపద్యంలో ఎడ్జ్ బస్టన్ స్టేడియానికి సాయంత్రం చేరుకున్నారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఈ క్రమంలో తమ బస్సు దిగి వెళ్తుండగా… పాకిస్తాన్ ప్లేయర్లను ర్యాగింగ్ చేశారు ఇండియన్ అభిమానులు. మీరు ఓడిపోవడం ఖాయం అంటూనే… ఇండియా జీతేగా అనే నినాదాలు చేశారు. అయితే వాటన్నిటిని భరిస్తూనే.. పాకిస్తాన్ ప్లేయర్లు అక్కడినుంచి వెళ్లిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై పాకిస్తాన్ మాజీ సీనియర్ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. ఇండియన్ అభిమానులను అదుపులో పెట్టుకోవాలని, మండిపడుతున్నారు. ఇంత బరితెగించి అభిమానులు వ్యవహరిస్తే ఎలా ? ప్రశ్నిస్తున్నారు.

పాకిస్తాన్ ను అవ‌మానించిన హర్మన్‌ప్రీత్ కౌర్

టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (PAKISTAN Vs Team INDIA CLASH )  మధ్య గ్రూప్ స్టేజ్ లో మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టి20 మహిళల ప్రపంచకప్ (ICC Women’s T20 World Cup 2026 tournament) సందర్భంగా కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టును అవమానించింది టీమిండియా. టాస్ పూర్తయిన తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు హర్మన్ ప్రీత్ కౌర్. షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫాతిమా ప్రయత్నించినప్పటికీ… పట్టనట్టుగా వ్యవహరించింది టీం ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur). ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. కాగా ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది.

Advertisement

 

Also Read: Muhammad Furqan Bhatti ON Vaibhav Sooryavanshi: అలీ ర‌జా బౌలింగ్ లో వైభ‌వ్ డ‌కౌట్ కావ‌డం ప‌క్కా..లేక‌పోతే బ‌ట్ట‌లు లేకుండా తిరుగుతా

 

Related News

జాతీయ గీతం పాడుతుండ‌గా టీమిండియాకు అవ‌మానం..ఐసీసీపై విమ‌ర్శ‌లు!

Babar Azam: టీమిండియాను పాకిస్తాన్ ప‌రువు కాపాడండి..లేక‌పోతే అక్క‌డే చావండి !

Fatima Sana: టీమిండియాను 100లోపే ఆలౌట్ చేసి, ప్ర‌తీకారం తీర్చుకుంటాం

కేఎల్ రాహుల్ కుట్ర‌లు..గిల్ సెంచ‌రీ మిస్…బిత్త‌ర‌పోయిన కోచ్ గంభీర్

ర‌నౌట్ పై వివాదం, రోహిత్ శ‌ర్మ ప‌చ్చి బూతులు.. గిల్ సెల్షీష్ అంటూ !

Nitish Reddy’s Mother calls: ప్రెస్ మీట్ లో త‌ల్లి ఫోన్ క‌ట్ చేసిన‌ నితీష్ కుమార్ రెడ్డి

జీస‌స్ పైన ఒట్టు..పాకిస్తాన్ జ‌ట్టును మ‌ట్టిక‌రిపిస్తా, వాచ్ మెన్ ముందు జెమిమా శ‌ప‌థం

×