Janhvi Kapoor:జాన్వీ కపూర్..బాలీవుడ్ భామలలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స్టార్ కిడ్. సినిమా అప్‌డేట్స్ కంటే కూడా అప్పుడప్పుడూ ఆమె పెట్టే ఫన్నీ పోస్టులే ఎక్కువ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ పోస్ట్‌తోనే నెట్టింట మళ్లీ హాట్ టాపిక్ అయింది.
తాజాగా జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేస్తూ… “I was hoping you’d gotten less annoying ” అంటూ క్యాప్షన్ పెట్టింది. ఆ లైన్‌తో పాటు హీరో ఇషాన్ ఖట్టర్‌ను ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా పోస్ట్ వైరల్ అయిపొయింది.”ఏమైంది ఇద్దరికీ?”, “మళ్లీ ఒకరిపై ఒకరు ఆటలు మొదలుపెట్టారా?” అంటూ సరదాగా కామెంట్లు పెట్టేస్తున్నారు నెటిజన్లు.
నిజానికి జాన్వీ, ఇషాన్ మధ్య ఇలాంటి ఫన్నీ పంచులు కొత్తేమీ కాదు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అవకాశం దొరికినా ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం వీళ్ల స్టైల్. అందుకే ఈసారి కూడా జాన్వీ వేసిన ఈ సెటైరికల్ క్యాప్షన్ చూసి నవ్వుకుంటున్నారు అభిమానులు.
ఈ పోస్ట్ చుట్టూనే ఇపుడు డిస్కషన్
ఇక సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ పోస్ట్ చుట్టూనే ఇపుడు తెగ డిస్కషన్ నడుస్తుంది. “ఇది ఫ్రెండ్షిప్ రోస్టింగ్”, “ఇషాన్‌కు డైరెక్ట్ పంచ్ పడింది”, “ఇప్పుడు ఇషాన్ కౌంటర్ ఎప్పుడు వస్తుందో చూడాలి” అంటూ మీమర్స్ కి మాంచి స్టఫ్ అయిపోయారు ఇద్దరు.కొందరు అయితే “ఇద్దరూ కలిసి మళ్లీ ఏదైనా సినిమా చేస్తున్నారా? అందుకే ఇలా సరదాగా హైప్ క్రియేట్ చేస్తున్నారా?” అని ఊహాగానాలు మొదలుపెట్టేశారు.
also read :టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!
ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే సినిమా ట్రైలర్ కంటే కూడా సెలబ్రిటీల ఇన్‌స్టా పోస్టులే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఒక్క లైన్ క్యాప్షన్ పెడితే చాలు…దాని మీద గంటల తరబడి డిస్కషన్స్, మీమ్స్,రీల్స్ మొదలైపోతున్నాయి.సో జాన్వీ పోస్ట్ కూడా అదే లిస్ట్‌లో చేరిపోయిందన్న మాట
జాన్వీ విషయానికి వస్తే ..సోషల్ మీడియాలో చాలా ఫ్రీగా ఉండే హీరోయిన్ అని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.షూటింగ్‌లో జరిగిన సరదా మూమెంట్స్, వెకేషన్ ఫోటోలు, ఫ్రెండ్స్‌తో ఫన్, ఇలా అన్నీ అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అందుకే ఆమె పోస్ట్ పెట్టిందంటే వెంటనే ఫ్యాన్స్ కూడా వెంటనే రియాక్ట్ అవుతుంటారు మరి .
ఇక ఇషాన్ ఖట్టర్ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోనే. ఎవరైనా సరదాగా ట్యాగ్ చేస్తే అదే స్టైల్‌లో రిప్లై ఇవ్వడం అతడి అలవాటన్నది గత పోస్ట్స్ చూస్తేనే అర్థమవుతుంది. అందుకే ఇప్పుడు జాన్వీ పోస్ట్‌కు ఇషాన్ ఎలా స్పందిస్తాడా అని చాలామంది ఎదురుచూస్తున్నారు. అతను కూడా అదే రేంజ్‌లో కౌంటర్ వేస్తే మరోసారి సోషల్ మీడియా మొత్తం వీళ్లిద్దరి పోస్టుల గురించే మాట్లాడే అవకాశం ఇపుడు పుష్కలంగా ఉంది.
ఇషాన్ నుండి ఎలాంటి రిప్లయ్ వస్తుందో
ఇదిలా ఉంటే జాన్వీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.బాలీవుడ్‌తో పాటు సౌత్ ప్రాజెక్ట్స్‌పైనా ఆమె ఫోకస్ పెట్టేసింది. ఈక్రమంలోనే పెద్దితో సాలిడ్ హిట్ కూడా కొట్టేసింది.అయితే ఈ భామ ఊహించినట్టుగా ఆ సినిమా నార్త్ బెల్ట్ లో సత్తా చాటకపోవడం గమనార్హం.
మరోవైపు ఇషాన్ కూడా కొత్త సినిమాలు, వెబ్ ప్రాజెక్ట్స్‌తో కెరీర్‌లో బిజీగా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా ఇద్దరి మధ్య ఉండే ఈ సరదా బాండింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని ఈ ఒక్క పోస్ట్‌తో మరోసారి క్లియర్ అయింది.
మొత్తానికి… జాన్వీ పెట్టిన ఆ ఒక్క లైన్ క్యాప్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. “I was hoping you’d gotten less annoying” అనే ఒక్క మాటతోనే ఇషాన్‌ను ట్యాగ్ చేసి నెట్టింట కొత్త డిస్కషన్‌కు తెరలేపింది.చూడాలి మరి ఈ పోస్ట్ కి ఇషాన్ నుండి ఎలాంటి రిప్లయ్ వస్తుందో !