E-Paper
Advertisement

విమానాలు ల్యాండ్ అవుతుండగా ‘గో అరౌండ్’ ఆర్డర్స్.. ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?

విమానాలు ల్యాండ్ అవుతుండగా ‘గో అరౌండ్’ ఆర్డర్స్.. ఎయిర్‌పోర్టులో ఏం జరిగింది?
Advertisement

Mid-Landing Emergency: విమానాశ్రయంలో విమానాలు ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? అలాంటి షాకింగ్ ఘటన అమెరికాలోని లాస్ ఏంజిల్స్  విమానాశ్రయంలో జరిగింది. విమానాలు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అధికారులు అలర్ట్ అయ్యారు. ల్యాండింగ్‌కు సిద్ధంగా ఉన్న విమానాలన్నింటికీ ‘గో అరౌండ్’ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సమయస్ఫూర్తితో విమానాల ల్యాండింగ్‌ ను తాత్కాలికంగా నిలిపివేశారు.

విమానాలు దిగుతున్న వేళ ఒక్కసారిగా భూప్రకంపనలు

శనివారం ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (LAX) పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఆ సమయంలో విమానాశ్రయంలో సాధారణంగానే విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. కొన్ని విమానాలు రన్‌వేపై దిగేందుకు సిద్ధమవుతుండగా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్‌లో ఉన్న అధికారికి భూమి కంపిస్తున్నట్లు అనిపించింది. వెంటనే పరిస్థితిని గమనించిన అధికారి విమానాల ల్యాండింగ్ సురక్షితం కాదని భావించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైలట్లకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

‘గో అరౌండ్’ అంటే ఏంటి?

Advertisement

విమానయాన రంగంలో ‘గో అరౌండ్’ అనేది ల్యాండింగ్‌ ను తాత్కాలికంగా నిలిపివేసి, విమానాన్ని మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాలని పైలట్‌కు ఇచ్చే ఆదేశం. సాధారణంగా రన్‌వేపై ఎవైనా అవాంతరాలు ఎర్పడినా, వాతావరణం అనుకూలించకపోయినా, ల్యాండింగ్ సమయంలో ఏదైనా ప్రమాదం ఎదురవుతుందని భావించినా, ఈ ఆదేశాలు ఇస్తారు. లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో భూకంపం కారణంగా ఇవే ఆదేశాలను అమలు చేశారు. రన్‌వే వైపు వస్తున్న విమానాల పైలట్లను వెంటనే పైకి వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో విమానాలు సురక్షితంగా గాల్లోనే ఉండిపోయాయి. ఆ తర్వాత సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి.

మాన్‌హట్టన్ బీచ్ సమీపంలో 5.0 తీవ్రతతో భూకంపం

అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వివరాల ప్రకారం.. మాన్‌హట్టన్ బీచ్ తీరానికి సుమారు 6 మైళ్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది. ఈ ప్రకంపనలు లాస్ ఏంజిల్స్ విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లోనూ కనిపించాయి. విమానాశ్రయంలో భూమి కంపించడంతో ప్రయాణికులు, సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం

Advertisement

ఈ ఘటనలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల అప్రమత్తత కీలకంగా మారింది. భూకంప ప్రకంపనలను గుర్తించిన వెంటనే విమానాల ల్యాండింగ్‌ను నిలిపివేయాలని నిర్ణయించడం వల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఏర్పడింది. సాధారణంగా విమానాశ్రయాల్లో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. చిన్నపాటి అనుమానం వచ్చినా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కలిసి వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఈ ఘటనలోనూ అదే జరిగింది.

Read Also: వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?

Tags

Related News

వందే భారత్ రైలులో షాకింగ్ ఘటన.. వడలో బోల్ట్ ఏంటి భయ్యా?

బ్రహ్మంగారి గుట్టకు బ్రహ్మాండమైన ఘాట్ రోడ్.. నల్లగొండలో సరికొత్త టూరిజం డెస్టినేషన్!

లోకల్ రైల్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్.. వీడియో వైరల్, రైల్వేశాఖ రియాక్షన్ ఇదే!

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే!

క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!

అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

Big Stories

Advertisement
×