E-Paper
Advertisement

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఛార్జింగ్ టెన్షన్ ఉండదిక.. జంబో బ్యాటరీతో రాబోతున్న Infinix Smart Power 5G ఫోన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Advertisement

Infinix Smart Power 5G: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లతో ఫోన్లను తీసుకొచ్చే ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఇప్పుడు మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి దించడానికి సిద్ధం అవుతోంది. గత నెలలోనే భారత్‌లో ‘ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 20 హెచ్‌డీ’ ఫోన్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు జూన్ నెలలో స్మార్ట్ 20 మోడల్ కూడా మార్కెట్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్మార్ట్ సిరీస్‌లోనే ‘ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ పవర్ 5జీ’ పేరుతో ఒక సరికొత్త ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

బ్యాటరీయే ప్రధాన ఆకర్షణ:

సాధారణంగా స్మార్ట్ సిరీస్ ఫోన్లలో 5,000mAh నుండి 5,200mAh సామర్థ్యం గల బ్యాటరీలను ఇన్‌ఫినిక్స్ అందిస్తోంది. కానీ ఈసారి రాబోతున్న స్మార్ట్ పవర్ 5జీ ఫోన్‌లో వీటన్నింటికంటే చాలా పెద్ద బ్యాటరీని ఇవ్వబోతున్నట్లు సమాచారం. పేరుకు తగ్గట్టే ఇది పూర్తిగా బ్యాటరీ ఫోకస్డ్ ఫోన్‌గా రాబోతోంది. ఎక్కువ సేపు ఛార్జింగ్ నిలబడాలని కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది.

సర్టిఫికేషన్ సైట్‌లో దర్శనం:

Advertisement

ప్రముఖ టెక్ బ్లాగర్ పరాస్ గుగ్లానీ ఈ కొత్త ఫోన్ వివరాలను ఒక సర్టిఫికేషన్ డేటాబేస్‌లో గుర్తించారు. అక్కడ ఈ ఫోన్ X6867B అనే మోడల్ నంబర్‌తో, స్మార్ట్ పవర్ 5జీ పేరుతో లిస్ట్ అయింది. దీనిని బట్టి చూస్తే ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ లాంచ్ త్వరలోనే ఉండబోతోందని అర్థమవుతోంది.

Also Read: వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

ఇది కూడా కంపెనీ నుంచి వస్తున్న ఒక బడ్జెట్ 5జీ స్మార్ట్‌ఫోన్ కావచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీని అసలు ధర ఎంత ఉంటుంది, పూర్తి స్పెసిఫికేషన్లు ఏంటి, ఎప్పుడు లాంచ్ అవుతుంది అనే విషయాలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. టెక్ నిపుణులు అంచనా ప్రకారం రూ.10 వేల బడ్జెట్‌ లోపు ఉండచ్చు.

స్మార్ట్ 20 హెచ్‌డీ విశేషాలు ఇవే:

ఇటీవల భారత్‌లో రూ.10,999 ప్రారంభ ధరతో విడుదలైన స్మార్ట్ 20 హెచ్‌డీ ఫోన్‌లో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. యూనిసోక్ T7250 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్‌తో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత XOS 15.1 పై ఇది పనిచేస్తుంది. ముందు, వెనుక 8 మెగాపిక్సెల్ కెమెరాలు, 5,000mAh బ్యాటరీ ఇందులో ఉన్నాయి. దీనికంటే మెరుగైన బ్యాటరీతో కొత్త స్మార్ట్ పవర్ 5జీ రానుండటంతో దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

Also Read: ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

Tags

Related News

వాట్సప్ యూజర్లకు CERT-In హై అలర్ట్.. ఈ వెర్షన్లు వాడుతున్నారా? వెంటనే అప్‌డేట్ చేసుకోండిలా!

ఒకటి పవర్‌ఫుల్ ప్రాసెసర్, మరొకటి కెమెరా కింగ్.. 2027లో వైడ్-స్క్రీన్ డిజైన్‌తో ఒప్పో నుంచి 3 కొత్త ఫోన్లు!

మీ ఇంటి గోడే..ఇక 500 ఇంచుల సినిమా థియేటర్!

స్టైలిష్ ఓపెన్-ఇయర్ బడ్స్ లాంచ్..లుక్ మాములుగా లేదు

మీ ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీనింగ్‌లో..ఈ మిస్టేక్ అస్సలు చేయెద్దు!

సెకండ్ హ్యాండ్ ల్యాప్‌టాప్ కొంటున్నారా? బ్యాటరీ చెక్ చేయకుండా డీల్ ఓకే చేయకండి!

Airtel రూ.598 ప్లాన్.. అపరిమిత 5Gతో పాటు నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 ఫ్రీ.. వ్యాలిడిటీ ఎంతంటే?

Big Stories

Advertisement
×