E-Paper
Advertisement

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!
Advertisement

Delhi-Mumbai Bullet Train: దేశంలో హైస్పీడ్ రైలు ప్రయాణానికి మరిన్ని ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే ముంబై–అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా, తాజాగా ఢిల్లీ–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ ప్రతిపాదన తెర మీదికి వచ్చింది. ఈ రెండు మార్గాలు భవిష్యత్తులో లింక్ అయితే, ఢిల్లీ నుంచి ముంబైకి కేవలం ఆరు గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుత రైళ్లలో ఈ ప్రయాణానికి సుమారు 14 నుంచి 15 గంటల సమయం పడుతోంది. కానీ, ఈ రైల్లో కేవలం 6 గంటల్లోనే ప్రయాణం పూర్తి చేసే అవకాశం ఉంది.

ఐదు రాష్ట్రాలను కలిపే బుల్లెట్ రైల్ రూట్

ప్రతిపాదిత ఢిల్లీ–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు మార్గం ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21 నుంచి ప్రారంభమయ్యేలా ప్రణాళిక చేస్తున్నారు. అక్కడి నుంచి హర్యానాలోని ఐఎంటీ మనేసర్, రేవారి మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశిస్తుంది. రాజస్థాన్‌లో బెహ్రోర్, షాపురా, జైపూర్, అజ్మీర్, విజయనగర్, భిల్వారా, చిత్తోర్‌గఢ్, ఉదయ్‌పూర్, డూంగర్‌పూర్ లాంటి ప్రాంతాలను కలిపేలా ప్రతిపాదించారు. అనంతరం గుజరాత్‌లోని హిమ్మత్‌ నగర్, గాంధీనగర్ మీదుగా అహ్మదాబాద్‌కు చేరుకుంటుంది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌ తో పాటు మహారాష్ట్రలోని ముంబైకి కూడా హైస్పీడ్ రైలు కనెక్టివిటీ ఏర్పడే అవకాశం ఉంది.

ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు 4 గంటల్లోనే!

Advertisement

ప్రతిపాదిత హైస్పీడ్ రైలు మార్గంలో గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో రైళ్లను నడిపేలా ప్రణాళికలు ఉన్నాయి. ఈ మార్గం పూర్తయితే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు నాలుగు గంటలలోపే చేరుకోవచ్చని అంచనా. అదే సమయంలో ఢిల్లీ–అహ్మదాబాద్, ముంబై–అహ్మదాబాద్ కారిడార్లు అనుసంధానమైతే ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణ సమయం ఆరు గంటలకు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక అనుమతులు, నిర్మాణ ప్రణాళికలు, ప్రయాణ సమయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

పర్యాటక రంగానికి కొత్త ఊపు

ఈ హైస్పీడ్ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులతో పాటు పర్యాటక రంగానికి కూడా ఎంతో లాభం  కలగనుంది. ఢిల్లీ నుంచి జైపూర్, అజ్మీర్, ఉదయ్‌పూర్, అహ్మదాబాద్ లాంటి పర్యాటక ప్రాంతాలకు వేగంగా చేరుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలను సందర్శించాలనుకునే పర్యాటకులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.  ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గానికి ఆమోదం లభించి, ముంబై–అహ్మదాబాద్ కారిడార్‌తో లింక్ కలిపితే, దేశంలో రైలు ప్రయాణానికి కొత్త రూపు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Read Also: ఇండియన్ ఫస్ట్ బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. ట్రయల్ రన్‌ ఎప్పుడంటే?

Tags

Related News

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!

తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

Big Stories

Advertisement
×