E-Paper
Advertisement

లోకల్ రైల్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్.. వీడియో వైరల్, రైల్వేశాఖ రియాక్షన్ ఇదే!

లోకల్ రైల్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్.. వీడియో వైరల్,   రైల్వేశాఖ రియాక్షన్ ఇదే!
Advertisement

Mumbai Local Train Viral Video: ముంబై లోకల్ రైళ్లు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతాయి. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు సహా వేలాది మంది ప్రతిరోజూ వీటిలో ప్రయాణిస్తుంటారు. అలాంటి లోకల్ రైలులో ఇటీవల ఆశ్చర్యకర ఘటన జరిగింది. కొంతమంది మహిళలు తమ స్నేహితురాలి ప్రీ వెడ్డింగ్ వేడుకను ఏకంగా రైలు బోగీలోనే నిర్వహించారు. ఇందుకోసం బోగీలోని కొంత భాగాన్ని అందంగా అలంకరించారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెట్టింగ చర్చ మొదలైంది.

రైలు బోగీలోనే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్!

సాధారణంగా పెళ్లికి ముందు కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహిస్తుంటారు. కానీ, ముంబైకి చెందిన కొంతమంది మహిళలు మాత్రం తమ స్నేహితురాలికి సర్‌ ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ముంబై లోకల్ రైలులోని ఓ కోచ్‌లో కొంత భాగాన్ని పూలతో డెకరేట్ చేశారు. అచ్చం ఇంట్లో అలంకరించినట్లుగానే బోగీ అంతా అందంగా మార్చారు. సంప్రదాయ మహారాష్ట్ర వేడుకను తలపించేలా ఏర్పాట్లు చేశారు.

పూల వర్షంతో స్నేహితురాలికి స్వాగతం

Advertisement

కాబోయే వధువు రైలు బోగీలోకి అడుగుపెట్టగానే అక్కడున్న మహిళలంతా ఆమెపై పూల రేకులు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఒక మహిళ అలంకరించిన పళ్లెం పట్టుకుని సంప్రదాయ పద్ధతిలో వేడుకను ప్రారంభించింది. అనంతరం ఆమెను కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ రైలు ప్రయాణం కాసేపు పెళ్లి వేడుకను తలపించింది.

సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్లు ఏమన్నారంటే?

ఈ వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్నేహితురాలికి ఇలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వడంలో తప్పేముందని కొందరు ప్రశ్నించగా, మరికొందరు మాత్రం పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను వ్యక్తిగత వేడుకలకు ఉపయోగించడం సరికాదన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయన్నారు.

స్పందించిన రైల్వే సేవా

Advertisement

ఈ వీడియో రైల్వే శాఖ దృష్టికి కూడా వెళ్లింది. ఈ ఘటనపై రైల్వే సేవా స్పందించింది. సంబంధిత అధికారులను ట్యాగ్ చేస్తూ, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఓవైపు స్నేహితురాలికి ఇచ్చిన సర్‌ ప్రైజ్‌ పట్ల వైరల్ అవుతుండగా,  మరోవైపు ప్రజా రవాణాలో వ్యక్తిగత వేడుకల నిర్వహణపై అభ్యంతరాలూ వ్యక్తం అవుతున్నాయి.

Read Also: ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

Tags

Related News

సంక్రాంతికి ఊరెళ్తున్నారా? చర్లపల్లి – శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు ఇవే!

క్యూబ్ ఆకారంలో మల విసర్జన.. ప్రపంచంలో ఈ ఒక్క జంతువుకే సాధ్యం!

అండమాన్ కాలాపాని జైలును తలపించే మరో జైలు.. తెలంగాణలో ఎక్కడుందో తెలుసా?

ఢిల్లీ To ముంబై జర్నీ ఇక 6 గంటలే.. 5 రాష్ట్రాలను కలపనున్న బుల్లెట్ రైలు రూట్ ఇదే!

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

Big Stories

Advertisement
×