Indian Railway: కేంద్రానికి రాబట్టి వచ్చే విభాగాల్లో రైల్వేశాఖ ఒకటి. ఛార్జీలు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు దీని వైపు మొగ్గు చూపుతున్నారు. సురక్షితం కూడా. అనుకున్న సమయానికి గమ్య స్థానానికి ప్రయాణికులను తీసుకెళ్తుంది. కాకపోతే రైళ్లలో ఒక్కోసారి గర్బిణీలు, పెద్ద వయస్సు వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇకపై వాటికి చెక్ చెప్పాలని భావిస్తోంది.
ఈ క్రమంలో వందేభారత్ రైళ్లు వచ్చాయి. ఛార్జీలు ఎక్కువగా ఉన్నా, వేగంగా గమ్య స్థానానికి చేర్చుతోంది. దీంతో చాలామంది దీని వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా రైల్వే శాఖ కొత్త ఆలోచన చేస్తోంది. ఇకపై 45 ఏళ్లు పైబడిన మహిళలు, 60 ఏళ్లు పైబడిన పురుషులకు ఆటోమేటిక్‌గా లోయర్ బెర్త్ కేటాయించాలని భారతీయ రైల్వే ఆలోచన చేస్తోంది. దీనిపై అందరి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటోంది.
రైల్వే ఈ విధంగా ఆలోచిస్తే ప్రయాణికులు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. సీజన్ ఏదైనా రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి. ఒక్కోసారి అర్జెంటుగా ప్రయాణాలు చేస్తుంటారు. వారికి బెర్త్‌లు దొరక్క నానావస్థలు పడిన సందర్భాలు లేకపోలేదు. వీటని పరిగణనలోకి తీసుకుని ఆలోచన చేస్తోంది.
ఇటీవల లోక్‌సభలో ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. సీనియర్ సిటిజన్లు, మహిళలు, వికలాంగులకు లోయర్ బెర్త్ వసతిని అందించడానికి రైల్వేలు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు. బుకింగ్ సమయంలో 45 ఏళ్లు అంత కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు, గర్భిణీ స్త్రీలకు లోయర్ బెర్త్‌లు కేటాయిస్తామని చెప్పుకొచ్చారు.
ALSO READ: ఐఆర్‌సీటీసీలో బస్సు టికెట్ల బుకింగ్.. మిగతా యాప్స్‌కు పరీక్ష
స్లీపర్ క్లాస్‌లో ప్రతి కోచ్‌కు ఆరు నుండి ఏడు లోయర్ బెర్త్‌ల ప్రత్యేక కోటా ఉంచాలని ఆలోచన చేస్తోంది. అడే ఎయిర్ కండిషన్డ్ 3 టైర్ (3AC)లో కోచ్‌కు నాలుగు నుండి ఐదు లోయర్ బెర్తులు. ఎయిర్ కండిషన్డ్ 2 టైర్ (2AC)లో కోచ్‌కు మూడు నుండి నాలుగు లోయర్ బెర్తులు. సౌకర్యాన్ని బట్టి రైలులో కోచ్‌ల సంఖ్యను బట్టి ఈ నిబంధన అందుబాటులో ఉండనుంది.
రాజధాని, శతాబ్ది సహా అన్ని మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేదా అనేదానితో సంబంధం లేకుండా వికలాంగుల కోసం రిజర్వేషన్ కోటా సౌకర్యం వర్తించనుంది. స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్తులు). 3AC/3Eలో నాలుగు బెర్తులు (రెండు లోయర్ బెర్తులు). రిజర్వ్డ్ సెకండ్ సిట్టింగ్ (2S) లేదా ఎయిర్ కండిషన్డ్ చైర్ కార్ (CC)లో నాలుగు సీట్లు ఉండనున్నాయి.
కొత్త పద్దతిని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది అసలు ప్రశ్న. ప్రస్తుతానికి రైల్వే విభాగం డివిజన్ల వారీగా మంతనాలు సాగిస్తోంది. 45 ఏళ్లు దాటిన మహిళలకు, 60 ఏళ్లు పురుషులకు ఎప్పటి నుంచి లోయర్ బెర్తు సదుపాయాలు అమలు చేస్తారనేది తెలియాల్సి వుంది.