BigTV English

Abir Gulaal: బాలీవుడ్‌లో పహల్గామ్ అటాక్ సెగ.. ఆ నటుడి సినిమా ఇండియాలో బ్యాన్ అంటూ ప్రకటన

Abir Gulaal: బాలీవుడ్‌లో పహల్గామ్ అటాక్ సెగ.. ఆ నటుడి సినిమా ఇండియాలో బ్యాన్ అంటూ ప్రకటన

Abir Gulaal: ప్రస్తుతం దేశమంతా పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి గురించే మాట్లాడుకుంటున్నారు. ఉగ్రవాదులు విచక్షణా రహితంగా దాడి చేసి టూరిస్టులను కాల్చి చంపడం అనేది చాలామంది ప్రజలను కదిలించింది. ఇకపై టూరిస్టులు కూడా ఎక్కడికైనా వెళ్లేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించేలా చేసింది. ఇక ఈ దాడి వల్ల రాజకీయాలకే కాదు.. సినీ పరిశ్రమకు కూడా దీని సెగ తగిలింది. ఇప్పటికే ఇండియన్ ఇండస్ట్రీలో నటీనటులుగా వెలిగిపోతున్న పాకిస్థానీ యాక్టర్లను ప్రేక్షకులు టార్గెట్ చేశారు. అలాంటి వాళ్ల సినిమాలు మేము చూడమంటూ తేల్చి చెప్పారు. అలా బాలీవుడ్‌లో ఒక నటుడి సినిమా చివరి నిమిషంలో ఇండియాలో బ్యాన్ అయ్యింది.


నటీనటులు బ్యాన్

అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లో పలువురు పాకిస్థానీ నటీనటులు అలరిస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఫావద్ ఖాన్ ఒకడు. ఇప్పటికే పలు హిందీ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయిన ఫావద్ ప్రస్తుతం తన అప్‌కమింగ్ మూవీ ‘అబిర్ గులాల్’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో తనే హీరోగా నటించాడు. పహల్గామ్ అటాక్ తర్వాత ఫావద్ ఖాన్‌పై, తను నటించిన సినిమాపై తీవ్రమైన నెగిటివిటీ ఏర్పడింది. దీంతో ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (ఫ్వైస్) ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతానికి పాకిస్థానీ నటీనటులను ఇండియన్ సినిమాల నుండి బ్యాన్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. దాంతో పాటు ‘అబిర్ గులాల్’ సినిమా విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకుంది.


మళ్లీ అదే రూల్

‘‘ది ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ సంస్థ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన విచక్షణా రహితమైన దాడిని తీవ్రంగా ఖండిస్తోంది. ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ లష్కర్ ఈ తైబా అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ దారుణమైన చర్యకు పాల్పడిందని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే 2019లో జరిగిన పుల్వామా అటాక్ గుర్తొస్తోంది. దానివల్ల అప్పట్లో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి దాడులు జరుగుతున్న నేపధ్యంలో జాతీయ సంఘీభావాన్ని ఫ్వైస్ ఎప్పుడూ గౌరవిస్తుందని మరోసారి గుర్తుచేస్తున్నాం. 2019 ఫిబ్రవరి 18న పాకిస్థానీ ఆర్టిస్టులు, సింగర్స్, టెక్నీషియన్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేయొద్దు అంటూ ఇచ్చిన ప్రకటనను మరోసారి తెరపైకి తీసుకొస్తున్నాం’’ అంటూ ఫ్వైస్ ఒక నోట్‌ను విడుదల చేసింది.

Also Read: నేను పాకిస్థానీ కాదు.. ప్రభాస్ హీరోయిన్ ఆవేదన, ఇంతకీ ఆమెది ఏ దేశం

విడుదల ఆగిపోయింది

ఒకప్పుడు కూడా పాకిస్థానీ ఆర్టిస్టులపై బ్యాన్ విధించినా దానిని మళ్లీ వెనక్కి తీసుకోవడంతో నటీనటులు మరోసారి ఇండియన్ ఇండస్ట్రీలో పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. కానీ ఇప్పటినుండి అలా జరగదని ఫ్వైస్ ప్రకటించింది. పాకిస్థానీ నటుడు ఫావద్ ఖాన్ (Fawad Khan) హీరోగా నటించిన ‘అబీర్ గులాల్’ (Abir Gulaal) కూడా ఇండియాలో బ్యాన్ చేస్తున్నామని తెలిపారు. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది ‘అబీర్ గులాల్’. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన అప్డేట్స్ చూస్తుంటే ఇదొక లవ్ స్టోరీ అనే విషయం క్లారిటీ వచ్చేస్తోంది. ఇందులో ఫావద్ ఖాన్‌కు జోడీగా వాణి కపూర్ నటించింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×