Singer Pravasthi Vs Sunitha: సింగర్స్ కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న టాప్ షో పాడుతా తీయగా.. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం ఈ షో ని ప్రారంభించారు. ఎంతోమంది సింగర్స్ తమ టాలెంట్ నిరూపించుకొని ప్రస్తుతం వరుసగా సినిమాలలో పాటలు పాడుతూ బిజీగా ఉన్నారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు ఈ షో పై ఎప్పుడు వివాదాలు వినిపించలేదు. ప్రస్తుతం సింగర్ ప్రవస్తి వల్ల ఈ షోలో ఇలాంటివి జరుగుతున్నాయని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రవస్తి చేసిన ఆరోపణలపై సింగర్ సునీత స్పందించిన విషయం తెలిసిందే.. తాజాగా మరోసారి ప్రవస్తికి గట్టిగానే తగిలేలా ఒక వీడియోని రిలీజ్ చేసింది సింగర్స్ సునీత. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
సునీత జడ్జిమెంట్ పై ప్రవస్తి ఆరోపణలు..
ప్రముఖ తెలుగు ఛానల్ ఈటీవీలో ప్రసారమవుతున్న సింగింగ్ పాడుతా తీయగా.. ఎస్పీ బాలసుబ్రమణ్యం తదనంతరం ఆయన కొడుకు ఎస్పీ చరణ్ ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం 25వ సీజన్ కొనసాగుతుంది. ఈ సీజన్లో సింగర్ గా పాల్గొన్న ప్రవస్తి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే తనను కావాలనే ఎలిమినేట్ చేశారని, తన తల్లిని అవమానించారని వీడియోల ద్వారా సింగర్ ప్రవస్తి బయటపెట్టింది. రోజుకో వీడియోని సోషల్ మీడియాలో వదులుతూ షోపై ఆరోపణలు చేస్తూ వస్తుంది. షోలో జడ్జీలుగా వ్యవహరిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్ సునీత, పాటల రచయిత చంద్రబోస్ పై ఆ అమ్మాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇది టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత స్పందించారు. ఆమె ఓ వీడియోని రిలీజ్ చేస్తూ ప్రవస్తి ఆరోపణల పై క్లారిటీ ఇచ్చారు.. తాజాగా సింగర్ సునీత మరో వీడియోని రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..
Also Read : పెళ్ళైన తర్వాత భర్త హత్యకు గురైతే.. భార్యకు తెలిసిన భయంకరమైన నిజాలు.. మస్ట్ వాచ్..
పాటతో ప్రవస్తికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సునీత..
సింగర్ సునీత విడుదల చేసిన వీడియో పై స్పందిస్తూ.. ప్రవస్తి మరో వీడియోని విడుదల చేసిన విషయం తెలిసిందే. పాట పాడేటప్పుడు అక్కడ లేకుండా.. పాట వినకుండానే సింగర్ సునీత జడ్జిమెంట్ ఎలా ఇచ్చిందని.?. తన పర్సనల్ పనుల వల్ల పాట పాడటం షూట్ కాకుండానే ఈమె జడ్జిమెంట్‌ని ముందే షూట్ చేసేశారు. ఇది ఎంత వరకూ న్యాయమో చెప్పండి మేడమ్? అంటూ సునీతపై ప్రశ్నల వర్షం కురిపించింది సింగర్ ప్రవస్తి.. మొత్తానికి సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య పెద్ద వారే జరుగుతుంది. ఈ నేపథ్యంలో సింగర్ సునీత మరో వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఎక్కడా సింగర్ ప్రవస్తి పేరు ప్రస్తావించలేదు కానీ.. వెనకాల పాట ప్లే అవుతుంటే సునీత మౌనంగా ఆ పాటను వింటున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ పాటలో ఉన్న లైన్స్ చూస్తే ప్రవస్తిని ఉద్దేశించి అనేట్టుగానే ఉన్నాయి. ఆ పాట లిరిక్స్ ఉన్నాయి. నీ కలల వెంటే.. కదల మంటే.. కుదురుతుందా? అయోమయమా? అంటూ ఆ పాట సాగుతుంది.. ఈ వీడియోని చూసిన కొందరు మాత్రం ఈ పాట ఎందులోది అని గూగుల్లో తెగ వెతికేస్తున్నారు. మరికొందరు మాత్రం ప్రవస్తికి లిరిక్స్ తోనే సమాధాన చెప్పినట్టు సునీతపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి దీనిపై ప్రవస్తి ఎలా స్పందిస్తుందో చూడాలి..
?igsh=MXdpNXl4MWd4OW04OA==