Real Life Parasite: పరాన్న జీవి అంటే ఏంటి? ఇతర జీవుల మీద ఆధారపడి బతికే వాటిని పరాన్న జీవులు అంటారు. తలలో ఉండే పేలు కూడా పరాన్న జీవులు కిందికే వస్తాయి. ఇంతకీ ఈ పరాన్న జీవుల ముచ్చటేంది? అనుకుంటున్నారా? సాధారణంగా ఏ పనీ చేతకాని వ్యక్తులు, అమ్మయ్య కష్టం మీద బతికే వాళ్లను కూడా పరాన్నజీవులు అంటూ తిడుతుంటారు. చైనాలోనూ తాజాగా ఇలాంటి ఓ ఆశ్చర్యకర ఘటన జరిగింది. ఓ మహిళ అచ్చం పరాన్న జీవిలా బతుకుతున్న విషయం బయటకు వచ్చింది. అడ్డంగా దొరికినా బుకాయించే ప్రయత్నం చేసింది. చివరకు ఈ కథ కోర్టుకెక్కడంతో తిక్క కుదిరింది. చాలా మంది ఈ ఘటనను రియల్ లైఫ్ ‘పారాసైట్’గా పిలుస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
బేస్ మెంట్ లోని గదిలో రహస్య జీవనం
తూర్పు చైనా లోని జియాంగ్సు ప్రావిన్స్ లో జాంగ్ అనే మహిళకు ఓఇల్లు ఉండేది. ఆ ఇంటిని ఏడు సంవత్సరాల క్రితం లీ వ్యక్తికి అమ్మింది. ఆ తర్వాత ఆ ఇంటిని తనకు అప్పగించింది జాంగ్. అప్పటి నుంచి ఆ ఇల్లు తనదే అనుకుంటున్నాడు లీ. తాజాగా అసలు విషయం తెలిసి షాక్ అయ్యాడు. తన ఇంటిని శుభ్రం చేస్తుండగా, ఇంటి బేస్మెంట్ లో ఒక గది ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అంతేకాదు, ఆ ఇంట్లో ఓ మనిషి జీవిస్తున్నట్లు గుర్తించారు. ఆ గదిలో అన్ని వసతులూ ఉన్నాయి. లైట్లు, బయట నుంచి గాలి వెలుతురు వచ్చే విధంగా వెంటిలేషన్ ఉంది. చిన్న బార్ సెటప్ కూడా ఉంది. వెంటనే ఆ ఇంటిని పూర్తిగా పరిశీలించాడు. ఆ ఇంట్లో ఉంటుంది ఎవరా అని ఆరా తీశాడు. అసలు విషయం తెలిసి మైండ్ బ్లాంక్ అయ్యింది. అందులో నివాసం ఉంటున్నది మరెవరో కాదు. ఆ ఇంటి పాత యజమాని జాంగ్.
కోర్టుకు వెళ్లి పరిహారాన్ని పొందిన లీ
వెంటనే లీ మాజీ యజమానురాలు జాంగ్‌ని గట్టిగా నిలదీశాడు. తనకు ఇల్లు అమ్మిన తర్వాత బేస్ మెంట్ లో ఉండటం ఏంటని ప్రశ్నించాడు. జాంగ్ తెలివిగా మాట్లాడ్డం మొదలుపెట్టింది. ఇల్లు అమ్మాను కానీ, బేస్ మెంట్ అమ్మలేదు, ఆ విషయం అగ్రిమెంట్ లో లేదంటూ వితండవాదం మొదలుపెట్టింది. తాను ఖాళీ సమయంలో అక్కడే సేదతీరుతానని తేల్చి చెప్పింది. దీంతో సదరు ఓనర్ కోర్టుకు వెళ్లాడు. న్యాయస్థానంలో పోరాటం చేశాడు. చివరకు మాజీ ఇంటి యజమాని కేసులు గెలిచాడు. బేస్ మెంట్ లోని గదిని సొంతం చేసుకోవడంతో పాటు నష్టపరిహార కూడా పొందాడు.
అచ్చం ‘పారాసైట్’ సినిమా మాదిరిగానే..
ఇక ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ‘పారాసైట్’ మూవీ కథ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. ఈ మూవీలో కూడా ఒక వ్యక్తి ఇంటి బేస్ మెంట్ లో రహస్యంగా సంవత్సరాలు గడుపుతాడు. ఈ ఘటనను చూసి రియల్ లైఫ్ ‘పారాసైట్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: సూదులతో గుచ్చుతూ.. కొవ్వొత్తితో కాల్చుతూ.. 16 ఏళ్ల అమ్మాయిపై 44 రోజులు.. 100 మంది అలాంటి చర్య!