Mohan Lal L2:మలయాళం ఇండస్ట్రీలో ఫేమస్ అయిన హీరోలలో మోహన్ లాల్(Mohan Lal) ఒకరు. ఈయన ఇప్పటి జనరేషన్ హీరో కాకపోయినప్పటికీ ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకోవడంలో ఫస్ట్ ఉంటాడు అని చెప్పుకోవచ్చు. అలాంటి మోహన్ లాల్ తన ఏజ్ కి తగ్గ పాత్రలు చేస్తూ మలయాళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఈయన కేవలం మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ లో మంచి పేరున్న హీరో గా పేరు దక్కించుకున్నారు. ఈయన చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయినవి ఉన్నాయి. అలా తెలుగులో కూడా మోహన్ లాల్ కి అభిమానులు ఉన్నారు. అయితే అలాంటి మోహన్ లాల్ హీరోగా చేసిన లూసీఫర్(Lucifer) సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా తెలుగులో చిరంజీవి (Chiranjeevi) గాడ్ ఫాదర్(God Father) పేరుతో రీమేక్ చేశారు.
సీక్వెల్ కి సిద్ధమవుతున్న లూసీఫర్..
అయితే మలయాళం లో బ్లాక్ బస్టర్ అయిన లూసీఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరుతో విడుదలైనప్పటికీ ఈ సినిమా హిట్ కాలేదు. ముఖ్యంగా అనిపించుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం రాలేదు. అయితే మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసీఫర్ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అని చాలా రోజుల నుండి వార్తల వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా పూర్తయ్యి త్వరలోనే ఈ సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మూవీ ప్రమోషన్స్ మొదలెట్టేశారు చిత్ర యూనిట్. అయితే తాజాగా మలయాళ ఇండస్ట్రీలో లూసిఫర్ సీక్వెల్ గా ఎల్ 2 ఎంపురాన్(L2 Empuraan) గురించి ఒక ఆసక్తికరమైన విషయం చక్కర్లు కొడుతుంది.
లూసీఫర్ 2 షూటింగ్ 6 దేశాలు 25 ప్రధాన నగరాలలో..
అదేంటంటే లూసీఫర్ సీక్వెల్ కోసం చిత్ర యూనిట్ ఎన్నో ఇబ్బందులు పడిందని, అలాగే సినిమాని అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా భారీ అంచనాలతో విడుదల చేయడానికి రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఏకంగా ఆరు దేశాల్లో వరల్డ్ లోనే 25 ప్రధాన నగరాల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది. 6 దేశాలు 25 ప్రధాన నగరాలు అంటే మామూలు విషయం కాదు. ఇక లూసిఫర్ సీక్వెల్ విషయంలో నిర్మాత బడ్జెట్ విషయంలో అస్సలు తగ్గలేదని సమాచారం. అలా ప్రపంచంలోనే 25 ప్రధాన నగరాలతో పాటు 6 దేశాల్లో షూటింగ్ అంటే సినిమాని ఏ లెవెల్ లో డైరెక్టర్ తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు.
అరుదైన రికార్డ్ సృష్టించనున్న మోహన్ లాల్..
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ఈ న్యూస్ మలయాళ సినీ వర్గాల్లో వినిపించడంతో ఇదే నిజమైతే మోహన్ లాల్ (Mohan Lal)ఒక అరుదైన రికార్డ్ ని క్రియేట్ చేసినట్టే..ఎందుకంటే ఇప్పటివరకు ఇలా 6 దేశాల్లో 25 ప్రధాన నగరాల్లో ఏ హీరో కూడా సినిమా షూటింగ్ జరుపుకోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మలయాళ ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ చాలా మంది మాత్రం ఇది నిజమే అంటున్నారు.అయితే ఈ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరున రీమేక్ చేసిన చిరంజీవి (Chiranjeevi) దీనికి సిక్వెల్ మాత్రం చేయరని తెలుస్తోంది. ఎందుకంటే లూసిఫర్ కి రిమేక్ గాడ్ ఫాదర్ వచ్చింది.అలాగే లూసీఫర్ సీక్వెల్ కూడా రాబోతుంది. మరి లూసీఫర్ సీక్వెల్ ని తెలుగులో చిరంజీవి రీమేక్ చేస్తారా అని చాలామందిలో ఒక అనుమానం ఉంది.కానీ గాడ్ ఫాదర్ రిజల్ట్ తో చిరంజీవి చేయరని తెలుస్తోంది. దాంతో తెలుగులో కూడా మోహన్ లాల్ లూసిఫర్ (Lusifer) సీక్వెల్ చేస్తారని సమాచారం. ఇక ఇప్పటికే లూసీఫర్ సీక్వెల్ పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా మార్చి 27న రిలీజ్ కాబోతుంది.