E-Paper
Advertisement

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన
Advertisement

FIT Student: ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-FIT క్యాంపస్‌లో అత్యంత దారుణమైన ఘటన బయటపడింది. కాలేజ్‌లోని గదిలో ఓ విద్యార్థినికి బలవంతంగా డ్రగ్స్ ఇచ్చారు కొందరు వ్యక్తులు. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన కారణంగా విద్యార్థిని కోమలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. సంచలనం రేపిన ఈ ఘటన న్యూయార్క్‌లో వెలుగుచూసింది.

డ్రగ్స్‌ ఎక్కించి ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం

అమెరికాలోని న్యూయార్క్‌లో ఫేమస్ ఫ్యాషన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-FIT క్యాంపస్‌. అక్కడ చదివితే తమ లైఫ్‌కి ఢోకా ఉండదని చాలామంది విద్యార్థులు భావిస్తుంటారు. సీటు కోసం చాలామంది విద్యార్థులు పోటీ పడతారు. అలాంటి క్యాంపస్‌లో షాక్ అయ్యే ఘటన వెలుగులోకి వచ్చింది. ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వివరాల మేరకు.. బ్రాంక్స్ ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కాలేజీ యువకుడు.. మార్చి 18న తోటి విద్యార్థినులు ఉండే డార్మిటరీకి వెళ్ళాడు.

న్యూయార్క్‌లోని ఫ్యాషన్ కాలేజీ షాకింగ్ ఘటన

Advertisement

కొకైన్ అని చెప్పి యువతులకు ఫెంటానిల్ డ్రగ్‌ ఇచ్చాడు. యువకుడి మాటలు నమ్మిన ఇద్దరు ఆ విద్యార్థినులు దాన్ని తీసుకున్నారు. క్షణాల్లో వారిద్దరు స్పృహ కోల్పోయారు. ఆ తర్వాత వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలతో ఇద్దరు విద్యార్థిని కోమలోకి వెళ్ళిపోయారు. మార్చి 21న ఓ యువతి మృతి చెందింది. మరో యువతి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ కేసుకు సంబంధించి నిందితుడు కాలేజీ స్టూడెంట్ తోపాటు మరో నిందితుడు (మైనర్)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు విచారణ న్యాయస్థానం ముందుకు వచ్చింది. విచారణ సందర్భంగా నిందితుడి తరఫు న్యాయవాది నోరు విప్పారు. టీనేజర్లు చేసిన అమాయకపు తప్పని వాదించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై వాదోపవాదనల సందర్భంగా న్యాయమూర్తి రియాక్ట్ అయ్యారు. ఫంటానిల్ డ్రగ్ ఇవ్వడం అనేది టీనేజర్లు చేసే అమాయకపు పని కాదన్నారు. అసిస్టెంట్ అటార్నీ మాట్లాడుతూ విద్యార్థిని అపస్మారక స్థితిలో ఉన్నట్లు గ్రహించిన నిందితుడు సహాయం కోరడానికి బదులుగా బాధితురాలి ఫోటోలను ఇతరులకు పంపాడని, దాదాపు 45 నిమిషాలు వృథా చేశాడని వివరించారు.

ALSO READ: పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

Advertisement

చివరకు క్యాంపస్ సెక్యూరిటీ వద్దకు వెళ్లి ఆ యువతులు ఎక్కువగా మద్యం తీసుకున్నారని అబద్ధం చెప్పాడని వెల్లడించారు. ఈ ఘటనలో మూడో నిందితుడు నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. ప్రధాన నిందితులపై ఫెడరల్ కోర్టులో అత్యాచారం, డ్రగ్స్ పంపిణీ కింద అభియోగాలు మోపారు. ఈ నేరం గనుక రుజువైతే ముగ్గురు యువకులకు రెండు దశాబ్దాలు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అధికారులు స్వయంగా తెలిపారు.  దీనిపై న్యాయస్థానంలో ఇంకా వాదోపవాదనలు జరుగుతున్నాయి. మరి న్యాయస్థానం తీర్పు ఏ విధంగా ఇస్తుందో చూడాలి.

 

Related News

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

భూమికి సౌర తుఫాను ముప్పు.. ఉపగ్రహాలు- జీపీఎస్ వ్యవస్థల మాటేంటి? రాత్రికి ఆకాశంలో ఏం జరుగుతోంది?

నేపాల్‌లో మరోసారి ఆకస్మిక వరదలు.. సల్లేరి బజార్‌ను ముంచెత్తిన ప్రళయం, అధికారులు హెచ్చరిక జారీ

Big Stories

Advertisement
×