E-Paper
Advertisement

మినీ డస్టర్ స్టైల్‌ లో కొత్త కాంపాక్ట్ SUV.. డిజైన్ పేటెంట్ దాఖలు చేసిన రెనాల్ట్!

మినీ డస్టర్ స్టైల్‌ లో కొత్త కాంపాక్ట్ SUV.. డిజైన్ పేటెంట్ దాఖలు చేసిన రెనాల్ట్!
Advertisement

Renault Bridger Compact SUV: భారత మార్కెట్‌ లో మరింత బలంగా సత్తా చాటేందుకు రెనాల్ట్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కొత్త ఎస్‌యూవీలపై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జర్ అనే కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీకి సంబంధించిన డిజైన్ పేటెంట్‌ ను భారత్ లో దాఖలు చేసింది. ఈ పేటెంట్‌ ను  గేమ్స్ అండ్ టాయ్స్ విభాగం కింద అప్లై చేసింది. దీని ప్రొడక్షన్ మోడల్ కాకుండా, ముందుగా తయారు చేసిన స్కేల్ మోడల్ లేదంటే కాన్సెప్ట్ మోడల్ కావచ్చని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆటో ప్రియులను ఆకట్టుకుంటున్న బ్రిడ్జర్ కాన్సెప్ట్

రెనాల్ట్ ఇప్పటికే ఆవిష్కరించిన బ్రిడ్జర్ కాన్సెప్ట్ ఆటో ప్రియుల్లో ఆసక్తి కలిగిస్తోంది. అప్పట్లో దీన్ని మినీ డస్టర్ అని పిలిచారు. ఇప్పుడు బయటకు వచ్చిన పేటెంట్ ఫోటోలు చూస్తే, ఆ కాన్సెప్ట్‌ లో కనిపించిన డిజైన్‌ నే కంపెనీ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎస్‌యూవీకి బాక్సీ స్టైల్ డిజైన్ ఉండటం విశేషం. ప్రస్తుతం మార్కెట్‌ లో ఉన్న సాధారణ కాంపాక్ట్ ఎస్‌యూవీలతో పోలిస్తే మరింత రగ్గడ్ లుక్‌ తో కనిపిస్తోంది.

Advertisement

బ్రిడ్జర్ ముందు భాగంలో బ్లాక్ కలర్ ఫ్రంట్ ఫేసియా ఇవ్వగా, దానితో పాటు ప్రత్యేకమైన LED DRLలు కనిపిస్తున్నాయి. సైడ్ ప్రొఫైల్‌ లో చతురస్రాకార వీల్ ఆర్చ్‌ లు, బలమైన ఫెండర్ డిజైన్ వెహికల్ కు ఎస్‌యూవీ ఫీల్‌ ను ఇస్తున్నాయి. బ్యాక్ సైడ్ టెయిల్‌ గేట్‌ పై ఉంచిన స్పేర్ వీల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రియర్ డిజైన్, LED టెయిల్ లైట్లు కారుకు మోడర్న్ టచ్ ఇచ్చాయి. ఈ ఎస్‌యూవీలో కాన్సెప్ట్ మోడల్‌ లో కనిపించినట్లే సి పిల్లర్ దగ్గర వెనుక డోర్ హ్యాండిల్స్‌ ను అమర్చారు. ఈ కారు మరింత స్టైలిష్‌ గా కనిపిస్తోంది. రూఫ్ రైల్స్, టూ టోన్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి. అయితే, కాన్సెప్ట్‌ లో కనిపించిన వెలుగుతున్నట్లు కనిపించిన రెనాల్ట్ లోగో మాత్రం ఈ పేటెంట్ ఇమేజెస్ లో కనిపించలేదు.

ఇంజిన్ గురించి..

ఇంజన్ విషయానికి వస్తే, రెనాల్ట్ బ్రిడ్జర్‌ ను రెండు పెట్రోల్ ఆప్షన్లతో తీసుకురావచ్చని తెలుస్తోంది. ఇందులో ఒకటి 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజన్ కాగా, మరొకటి కొత్త 1.2 లీటర్ 4 సిలిండర్ MPFi టర్బో పెట్రోల్ యూనిట్‌ గా ఉండొచ్చని అంచనా. భారత మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుని కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్‌డ్ CNG వెర్షన్‌ ను కూడా అందించే అవకాశం ఉంది.

Advertisement

ప్రస్తుతం భారత్ లో చిన్న ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో రెనాల్ట్ బ్రిడ్జర్ మార్కెట్లోకి వస్తే మారుతి బ్రెజ్జా, టాటా నెక్సాన్, హ్యుందాయ్ ఎక్స్టర్ లాంటి మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.

Read Also: టాటా To ఎంజీ.. లో కాస్ట్ లో హై రేంజ్ ఇచ్చే స్మాల్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Related News

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

మారుతి కస్టమర్లకు షాక్.. మళ్లీ ధరలు పెంపు, ఈసారి ఎంతంటే?

కార్నివాల్ హైబ్రిడ్ To న్యూ సోనెట్.. కియా నుంచి రాబోతున్న 10 క్రేజీ కార్లు ఇవే!

కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు.. బాలెనో ఫేస్‌లిఫ్ట్ ఏముంది గురూ!

Big Stories

Advertisement
×